వారెవ్వా!-51

0
8

[dropcap]దే[/dropcap]శంలో నేటి సామాజిక స్థితిగతులపై తన ఆలోచనలను ‘వారెవ్వా’ అంటూ కవితాత్మకంగా వెల్లడిస్తున్నారు ఐతా చంద్రయ్య.

~
కరుణలేని కరోనాతో
కలకలం ఈ ప్రపంచాన
లక్షణాలేవో కాని
లక్షణముగా తెలియవాయె.
ప్రభుత్వాలను ప్రజను గూడా
ముంచివేసేను పరేశాన్‌ల
కోవిడ్ పందొమ్మిది అంటూ
కసిగ పెరిగెను రోజు, రోజు.
ఎప్పుడొచ్చును, ఎలా వచ్చును
తెలియదాయె ఖచ్చితముగ.

***

సానిటైజర్, మాస్క్ వాడుట
ప్రతి మనిషికి తప్పదందురు.
అన్ని వాడిన గూడ రోగం
ఆవహించె కొంతమందికి
కొందరేమి వాడకున్నా
కొంటె రోగము అంటదాయె.
మందుమాకుల వాడుతూనే
రెండు వారాల్ గడుపుమనిరి.
పుట్టిన చైనా గుణాలన్ని
పుణికి పుచ్చుకున్నదేమో!

***

వారు, వీరని తేడాలేక
వరుసబట్టి ఆవహించెను.
ఎమ్మెల్లే, ఎంపీలు, మంత్రుల
ప్రాణాలను పరిహసించెను.
ప్రభుత్వాసుపత్రిలోన
బెడ్ దొరుకుట కష్టమాయె.
ప్రైవేటాసుపత్రు లందున
నిలువు దోపిడి నిత్యమాయె.
విరుగుడేమో లేకపోయేను
వింతగా ప్రాణాలు బోయె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here