వారెవ్వా!-54

0
10

దేశంలో నేటి సామాజిక స్థితిగతులపై తన ఆలోచనలను ‘వారెవ్వా’ అంటూ కవితాత్మకంగా వెల్లడిస్తున్నారు ఐతా చంద్రయ్య.

~

[dropcap]బా[/dropcap]లబ్రహ్మల సంస్కారమే

భవిష్యత్తు బంగారు బాట.

ధర్మమార్గము జూపు వారల

ధన్యులను చేయాలి బాబూ!

పెద్దలకు నమస్కార మిడుట

ముందు మార్గము శుద్ధి జేయు.

మాతృభూమికి ప్రణతు లిడుమని

సదాచారము నేర్పవలెను.

పురాణాల కథలు జెప్పుటము

పుణ్యమూర్తులకే సాధ్యము.

***

మాతృభాషన విద్య నేర్పుట

మహనీయుల కాదర్శము.

తల్లిదండ్రులను మమ్మి, డాడి

పిలుచుటే అవమాన మందురు.

మమ్మి అంటే దయ్యమెగా

డాడి అనగా పాడెకట్టె.

కాంట్రాక్టు పెళ్ళి చోటున

పాడి యందురు పిల్లలంత

పుణ్యభూమి భారతమ్మున

పెళ్ళియన నూరేళ్ళ పంట.

***

మాతృభాషను మరిచినప్పుడు

మనిషి కాడని చెప్పవచ్చు.

రష్యన్ భాష రాజభాషయె

రష్యా దేశమ్ము నందున.

ఇంగ్లీషే జాతీయ భాష

ఇంగ్లండు మరి బ్రిటన్ నందున.

జపానీయే ప్రజల భాషని

జపాన్ దేశ వాసులందురు.

హిందూస్థానము నందు హిందీ

వ్యతిరేకత ఎందుకుండెను?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here