వసంతాగమనము

1
10

[dropcap]తే[/dropcap]జరిల్లగ నవతేజమ్ము తోడను
రయమున పల్లవ ప్రాభవమ్ము
వికసిత కుసుమాల విలసిత వదనార
విందమ్ముల సొగసు విస్తరిల్ల
కమ్మని గంధర్వ గళ నిర్ఝరిత గాన
వీచికల్ వీనుల విందు జేయ
సకల ప్రసూన వాసనల నానందించు
మత్తాళి సందోహ మలరు చుండ
అందాలు విరజిమ్ము అంబర వీథిని
విహగాల విహరణ విరివి గాగ
గిరి నిర్ఝరిత శుద్ధ ఝరుల సంగంబులు
వారిధి దరిజేర పరుగు లిడగ
అజ్ఞాన తిమిర సంహరణమ్ము గావించు
భాసంత భాస్కర ప్రభల తోడ
వరలు మహోన్నత వాసంత విభవమ్ము
చిత్రిత చిత్రాతి చిత్రముగను
అల్లన మెల్లన చల్లని చూడ్కుల
ఎల్లరి యుల్లముల్ వెల్లి విరియ
సురుచిర శోభలు సురలోక మంటంగ
నవ వధూ వైఖరిన్ నడచి వచ్చె
సుందరతమమౌ వసుంధరాతలమున
విహరించు యాకాంక్ష విరియగానె viagra cena>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here