విశ్వర్షి వాసిలి సాహిత్యం – వ్యక్తిత్వం, యౌగిక తత్త్వం – అంతర్జాతీయ సదస్సు

0
9

[dropcap]తె[/dropcap]లుగుశాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం, చెన్నై – 600 005 వారు అక్టోబర్ 10 & 11, 2022 తేదీలలో నిర్వహిస్తున్న’విశ్వర్షి వాసిలి సాహిత్యం – వ్యక్తిత్వం, యౌగిక తత్త్వం‘ అనే అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం.

సదస్సు లక్ష్యం

“నా జననం ఒక నిర్మితి/నా జీవనయోగం ఒక హితగతి/నా యోగజీవనం ఒక నవనిర్మితి” అంటూ ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుదీర్ఘకాలం రచనా వ్యాసంగాన్ని కొనసాగించి, తెలుగులో తొలి యౌగికకావ్యంగా ప్రఖ్యాతమవుతున్న “నేను” కవిగా సహస్రభావ శోభితమైన “విశ్వర్షి వాసిలి” మన మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ తొట్టతొలి స్నాతకోత్తర విద్యార్థి.

వాసిలి జన్మతః అక్షరప్రేమికులు. పదిహేనేళ్ల ప్రాయంలోనే కలంపట్టి కాలం వెంట పడ్డ వాసిలి పద్దెనిమిదవ ఏటనే ‘చిత్ర ప్రగతి’ అనే సినిమా పత్రికను స్నేహితులతో ప్రారంభించి, పాతికేళ్ల ప్రాయంలోనే ‘యోగమార్గం’ పత్రికను పుష్కరకాలం పాటు నడిపిన సంపాదకులు. నాలుగు పదులు నిండక మునుపే ‘తెలుగు పరిశోధన’ పత్రికతో సాహిత్య పరిశోధనా ప్రపంచంలో తమదైన ప్రతిభను చూపినవారు.

మన మద్రాసు విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన ‘విశ్వర్షి’ వాసిలి వసంతకుమార్ గారు అరుదైన వ్యక్తిత్వవికాస నిపుణులుగా, మనోవైజ్ఞానికులుగా, బహుముఖీన గ్రంథకర్తగా, సహస్రాధిక వ్యాసకర్తగా, కవియోగిగా ప్రసిద్ధులు కావటం, తమదైన ముద్రతో ఇటు సాహిత్య రంగంలోనూ, అటు యౌగిక రంగంలోనూ రాణిస్తుండటం మన విశ్వవిద్యాలయ తెలుగుశాఖకు ఎంతో గర్వకారణం. ఇక్కడి విద్యార్థి సమగ్ర సాహిత్యంపై ఈ విధంగా రెండు రోజుల సదస్సులను నిర్వహిస్తుండటం విశ్వర్షి వారిని సత్కరించటంగానే కాక మనశాఖ ఔన్నత్యాన్ని చాటుకుంటున్నట్టుగా పరిగణిస్తున్నాం.

ఈ నేపథ్యంలో మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ ‘విశ్వర్షి వాసిలి సాహిత్యం – వ్యక్తిత్వం, యౌగిక తత్త్వం‘ అనే శీర్షికతో వారి రచనలను సమాలోచన చేయాలనే సంకల్పంలో భాగంగా ఈ అంతర్జాతీయ సదస్సు పురుడు పోసుకుంది. వారి సాహిత్యపు లోతుల్ని, వారి దృక్పథాన్ని, వారి రచనల ద్వారా అందించిన చైతన్యాన్ని సమీక్షించుకునే దశలో తెలుగు సాహిత్య పరిశోధకులు, సాహిత్యాభిమానుల నుండి లోకాన్ని జాగృత పరిచిన వాసిలి వసంతకుమార్ సాహిత్యంపై విలువైన పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తున్నాం. ఈ అంతర్జాతీయ సదస్సులో సమర్పించబడిన పత్రాలతో యు.జి.సి. కేర్ జర్నల్ ‘భావవీణ’లో ప్రచురించి సదస్సు ప్రారంభ సమావేశంలో ఆవిష్కరించదలచుకున్నాం.

వాసిలి వంసతకుమార్ రచనలు- వ్యక్తిత్వవికాస, మనోవిశ్లేషణాత్మక గ్రంథాలు: 1. ది విన్నర్ : గెలవాలి! గెలిపించాలి!!, 2. ది పర్ఫెక్ట్ : ఒత్తిడి ఇక లేనట్లే!, 3. ది అదర్ హాఫ్ : పెళ్లి మైనస్ పెటాకులు, 4. టైం ఫర్ సక్సెస్ : బుక్ ఆఫ్ స్ట్రాటజీస్, 5. సిగ్గు పడితే సక్సెస్ రాదు, 6. మనసును గెలవాలి, 7. లైఫ్ ఈజ్ ఎమోషనల్ : అయినా గెలవాల్సిందే, 8. మనకే తెలీని మన రహస్యాలు, 9. స్వీట్ సిక్స్టీ, 10. స్వీట్ సిక్స్టీన్.; తత్త్వ, యోగ గ్రంథాలు : 11. ఆధ్యాత్మిక తత్త్వం: అస్తిత్వ జీవనతత్వం, 12. సాధనా రహస్యం, 13. 77 సాధనా రహస్యాలు, 14. 56 ఆత్మ దర్శనాలు, 15.యోగలయ, 16. మాస్టరిజం: ప్రజ్ఞాన రహస్యాలు, 17. మాస్టరిజం: తత్త్వ దర్శనాలు, 18. మాస్టరిజం: ఖగోళ రహస్యాలు, 19. మూడో కన్ను : జన్మ, కర్మ, మృత్యు రహస్యాలు, 20. క్షేత్ర దర్శని ; కొత్త కోణంలో గీతారహస్యాలు – 21. జీవన గీత, 22. ఆత్మ గీత, 23. నాయక గీత, 24. యౌగిక గీత ; సాహిత్య గ్రంథాలు: 25. అధ్యయన సాహితి, 26. లోనారసి (వాసిలి పుస్తకాలపై సమీక్షలు), 27. దృక్సూచి (ఇతరుల గ్రంథాలపై వాసిలివారి సమీక్షలు), 28. నేను – నా వ్యాసంగం, 29. సాహిత్య ప్రసంగాలు, వ్యాసాలు, 30. ఆధ్యాత్మిక వ్యాసాలు, ప్రసంగాలు, 31. మునుముందుమాటలు ; పరిశోధక గ్రంథం : 32. అస్తిత్వ తాత్వికత : తెలుగు నవల; జీవిత చరిత్రలు : 33. అతీంద్రియ రహస్యాలు : బ్లవట్స్కీ, 34. మాస్టర్ శార్వరి : మిషన్ అండ్ విజన్; కవిత్వం : 35.“నేను” యౌగిక కావ్యం, 36. జీవ సంహిత (4 పాదాల 250 తాత్త్విక కవితలు), 37. ఏడో ఋతువు (కవితా సంపుటి) ; సంపాదక గ్రంథాలు : 38. శార్వరీయ యోగం, 39. యోగానుభవాలు, 40. అరవై వసంతాల శార్వరి, 41. అరవై వసంతాల యామిని ; సంపాదక పత్రికలు : 42. చిత్ర ప్రగతి, 43. యోగమార్గం, 44. తెలుగు పరిశోధన; ఆంగ్ల రచన : 45. WINNER: Win and Make Winners ; హిందీ అనువాదం : 46. మై హూ (“నేను” కావ్యం హిందీ అనువాదంగా) ; కన్నడ అనువాదాలు : 47. నాను (“నేను” కావ్యం కన్నడ అనువాదంగా); 48. 77 సాధనా రహస్యగళ్లు, 49. నమగే తెలియద నమ్మ రహస్యగళు ; 50. “నేను” విశ్వావలోకనం (ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథం).

సదస్సు సంచాలకులు

ఆచార్య విస్తాలి శంకరరావు

తెలుగు శాఖాధ్యక్షులు, మద్రాసు విశ్వవిద్యాలయం, చెన్నై – 05.

(సెల్: 9445203041)

సహ సంచాలకులు

డా. పాండురంగం కాళియప్ప

(సెల్: 9701869674)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here