వెన్నెల కురిపించే వాడు

0
9

[dropcap]సా[/dropcap]యంత్రాన్ని చూస్తే
పాపం ఎంతో జాలేస్తుంది

పగలు త్యజిస్తుంది
రాత్రేమో సొంతం చేసుకోదు

పాపం సాయంత్రం ఓ అనాథ

దాన్ని ఊరడిస్తూ
ఓ కవి క్షితిజం పై
రంగులద్దడం మొదలెడతాడు

ఇంతలో
‘చీకటి ముసురు’ కురుస్తుంది

దిగాలుపడ్డ కవిని చూసి
మిణుకు మిణుకు మంటూ నక్షత్రాలు
కొంచెం తెరిపిన పడు

వెన్నెల కురిపించే వాడొస్తున్నాడు
అంటూ ఓదారుస్తాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here