స్వాతి కవితలు-1: వెతికివ్వవూ!

1
9

[box type=’note’ fontsize=’16’] తన హృదయపు తాళంచెవిని పోగొట్టుకున్న ఓ ప్రియుడు దాన్ని వెతికివ్వమని ప్రేయసిని అడుగుతున్నాడు స్వాతి రాసిన “వెతికివ్వవూ” కవితలో. [/box]

[dropcap]నా [/dropcap]గుండె గదిలో జ్ఞాపకాలన్నీ పెట్టి
భద్రంగా తాళం వేశా
గుర్తొచ్చిన ప్రతిసారీ తాళం తీసి
ఆ మధురిమని ఆస్వాదించా
మళ్ళీ మౌనంగా తాళాలు వేసేశా.

వచ్చిన పెద్దరికపు మతిమరపుతో
తాళం దాచిన చోటు మరిచా
ఎంత వెదుక్కున్నా దొరకదేం!

కానీ –
ఎవరో తలుపు సందుల్లోంచి
లీలగా చూస్తున్న అలజడి.

అది గనక నీవైతే
తాళం చెవి కొంచెం వెతికివ్వవూ…
నా గుండె గదిలోకి నిన్ను రానిస్తా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here