విచిత్రం

2
9

[dropcap]ఉ[/dropcap]చితమనే తాయిలం,
నాయకుల నాలుకపై..
నిత్యమూ నాట్యమాడే..
ఆకర్షణ మంత్రం!!

పదవీకాంక్షతో తహతహలాడి,
సాధ్యాసాధ్యాలను మరచి,
నాయకులు చేసే వాగ్దానాలను..
నెరవేర్చేందుకు దగ్గరి దారే-
ఈ ఉచితమనే అయస్కాంతం

ప్రజలకొరకు ప్రజలచే ఎన్నుకున్న-
ప్రజా ప్రభుత్వాలు చేసే వంచనే-
ప్రజలసొమ్ము, ప్రజలకొరకు,
ప్రజా సేవ పేరుతో పంపిణీ..!
అంతిమ భారం ప్రజలపై-
పదవీభోగం నాయకులకే!!

ఉచితాలకు ఆద్యులైన నాయకులే-
సముచితమా? అనుచితమా?
అన్న చర్చకు తెరతీయడమే-
అసలైన హాస్యా చిత్రం..
ప్రేక్షకులనే ప్రజలకు-
అర్థం కాని విచిత్ర చిత్రం!!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here