విద్యుదావేశం

1
9

[dropcap]వి[/dropcap]ద్యుత్ ధరలను పెంచి
ప్రజలను ముంచడమే
ఇప్పటి నాయకుల విద్వత్తు!
ఉచితంగా ఎవడివ్వమన్నాడు!
బిల్లు కట్టేవారినే ఎవరు బాదమన్నాడు!
అప్పనంగా, అక్రమంగా, విద్యుత్తు వాడే వాడిపై ఏది నిఘా!
అందుకే నిజాయితీపరులవుతున్నారు ‘దగా’!
గ్యాస్, బొగ్గు కొనుగోళ్ళలో ‘గోల్‌మాల్’
ప్రజల బతుకుల్లో చీకటి ‘హల్‌చల్’
సహజ వనరులతో రాష్ట్రం సుభిక్షం!
అయినా ఎనలేని విద్యుత్ సంక్షోభం!
స్వార్థ ప్రయోజనాలతో వ్యవస్థల పతనం!
సంక్షుభితం అయింది ప్రజా జీవనం!
ఒక ప్రక్క పైర్లు ఎండి రైతుకు గుండె కోత!
ఆత్మహత్యలతో బంధువులకు కడుపు కోత!
ఇప్పుడు ప్రజలకే కావచ్చు ‘షాకు’
రాబోయే రోజుల్లో పెద్దలకే పెద్ద ‘షాకు’
అప్పుడెక్కడ ఉంటుంది ఈ అధికారం ‘సోకు’!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here