విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-11

2
11

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

ప్రణతి ప్రణతి ప్రణతీ

ప్రణతి ప్రణతి ప్రణతీ
పమప మగమ సరి సా..
ప్రణతి ప్రణతి ప్రణతీ
ప్రణవనాద జగతికీ..
మమప మమప మప నీ..
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ
ప్రథమ కళా సృష్టికీ..
ప్రణతి ప్రణతి ప్రణతీ
ప్రణవనాద జగతికీ.. ఈ ఈ ఈ..

గంగాధరం చేసిన అపచారానికి తండ్రి కొడతాడు. తల్లి అడ్డం పడుతుంది. అంతకు మునుపు అనంతరామ శర్మ: “క్రమశిక్షణ లేని ఇలాంటి శిష్యులను తయారు చేసి గురు స్థానానికి అపకీర్తి తీసుకు రాండి,” అని పక్షితీర్థం మామ్మగారిని హెచ్చరించి వెళతాడు.

ఒక గొప్ప అవకాశాన్ని బిడ్డ చేజేతులా పాడు చేసుకుంటే ఒక మధ్యతరగతి తండ్రి ఏ విధంగా ప్రవర్తిస్తాడో అలాగే గంగాధరం తండ్రి రియాక్టవుతాడు. ప్రపంచం మొత్తం కుంగిపోయినట్లు, జలపాతాలు ఎండిపోయినట్లు, దీనంతటికీ కారణం పురుష సూక్తాన్ని అపస్వరంలో గంగాధరం పాడటం వల్లనే అన్నంత రీతిలో తన ప్రతాపాన్ని చూపుతాడు. అక్కడ ధర్మవరపు సుబ్రహ్మణ్యం నిజమైన తండ్రిలాగే నటించాడన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నిజానికి అనంతరామ శర్మ దేవాలయానికి వెళ్ళిన దగ్గర నుంచీ, ఆనతినీయరా పాట ముగిసే వరకూ మమ్ముట్టి కనిపించే ప్రతి ఫ్రేమ్‌ను విశ్లేషించాలి. ఎక్కడా ఒక్కచోట కూడా అప-expression ఉండదు. తూకం వేసినట్లు శరీరంలోని ప్రతి కండరాన్నీ అదుపులో ఉంచి తనకు కావలసినట్లు నాట్యమాడిస్తాడు. అసూయ. అసూయ. అసూయ. నరనరానా, కండర కండరానా, కణ కణానా అసూయ.

We can observe inferiority complex that has started to eating away Anantha Rama Sharma, and the superiority complex he used as a mask.

పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం..
ఓంకారమా..
సుప్రభాత వేదిక పై.. శుకపికాది కలరవం..
ఐంకారమా..
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం..
ఓంకారమా..
సుప్రభాత వేదిక పై.. (పసససాస పానిపమా..) శుకపికాది కలరవం..
ఐంకారమా…
పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా..
హ్రీంకారమా..
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడీ శ్రీంకారమా..
శ్రీంకారమా..
ఆ బీజాక్షర విఘటికీ అర్పించే జ్యోతలివే.. (ఓం ఐం హ్రీం శ్రీం)
ప్రణతి ప్రణతి ప్రణతీ
ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ..

గంగాధరం స్కూలు మాస్టరు ఇక అతని చేత ప్రార్థన చేయించడు. గంగాధరం పుస్తకాలు తీసుకుని బైటకు వెళ్ళిపోతాడు. సంగీతం పంతులమ్మ దగ్గరకు వెళితే literally బైటకు గెంటేస్తుంది. చిన్న పిల్లల చేత.

ఆత్మాభిమానం దెబ్బతిని ఆత్మహత్యకు పూనుకుంటాడు. ఇప్పటికి గంగాధరానికి కాస్త ఇగో ఉంది. దాన్ని తరువాత చంపేసి అతని ప్రాణానికే తెచ్చే పెద్దల చేష్టలు ముందు ముందు చూస్తాం. తన పెన్నును స్నేహితుడికి జ్ఞాపకంగా ఇచ్చేసి తను నీళ్ళలో దూకటానికి పరుగులిడతాడు. కానీ, retrospective గా చూస్తే ఇదంతా నాటకం అని మనం deduce చేయవచ్చు. సహజ ప్రతిభాశాలి అయిన గంగాధరంకు కాస్త గీర ఉండటం సహజం. అది అతనికి ఆభరణం కూడా. అందువల్ల అతనికి తన వాళ్ళ చేత బతిమాలించుకోవాలనే కోరిక ఉండి ఉండవచ్చు. అందుకే ఆ మార్గం పట్టాడు. అనుకున్నట్లుగానే స్నేహితులు బతిమాలుతారు. ఒకడు ఇంటికి వెళ్ళి గంగాధరం తల్లిదండ్రులకు విషయం చేరవేసి తీసుకు వస్తాడు. మరో స్నేహితుడు అతడిని దూకకుండా పట్టుకుని ఉంటాడు.

అమ్మా, నాన్నా వస్తారు. ఈసారి చెంప ఛెళ్ళ్ మనిపించేది తల్లి. సహజమే.

తండ్రి అంటాడు: నేను కొట్టిన దెబ్బలకు నువ్వు గోదాట్లో పడాలనుకున్నావు. మరి నువ్వు మమ్మల్ని, మామ్మగారిని గుండెలు మీద కొట్టిన దెబ్బలకు మేమేం కావాలి?

చాలా ముఖ్యమైన డైలాగ్. సాధారణ జీవులు తమ గురించి ఎలా తక్కువగా ఆలోచిస్తారో, అదే రకమైన ఆలోచనలను తమ పిల్లలకు నూరిపోస్తారో అనేదానికి నాంది లాంటి మాటలివి.

గంగాధరం అంటాడు: అసలు నేనేం చేశానని? రోజూ గుళ్ళో శుభ్రంగా వినే మంత్రాన్ని ఆయనగారు (Note this word) ఇష్టం వచ్చినట్లు పాడితే అందరూ ఓహో ఓహో అని మెచ్చుకున్నారు. నేనూ అదే మంత్రాన్ని ఇంకో రాగంలో పాడితే.. చావగొట్టారు.

ఇంకొక పదం వాడతాడు. *చిన్న పిల్లాడిననేగా?*

అక్కడ అష్టావక్రుని తండ్రి కూడా కొడుకుని అష్ట వంకరలతో పుట్టమని శపించింది కూడా చిన్నపిల్లాడు అనే take it granted భావన వల్లే కదా. అదే తన తప్పును తనకన్నా పైస్థాయి వారు చెప్పితే శపించేంత సన్నివేశం ఉండేదా?

Fortunately there was no one to murder the ego of Ashtavakra Maharshi.

గంగాధరం తండ్రి అంటాడు: ఓహో! అదా విషయం?

దానికి గంగాధరం సమాధానం: అదేం చిన్న విషయం కాదు.

ఇది నిజం. అదేమీ చిన్న విషయం కాదు. ఒక అద్భుత సంగీతజ్ఞుడు పసి వయసులోనే ప్రాణం తీసుకునేందుకు దారితీసిన అత్యంత ముఖ్యమైన ఘటన. బీజం అక్కడే పడింది.

విషయాన్ని గంగాధరం కోతి చేష్టగా భావించటమే పెద్ద నేరం. పైగా అందరూ ‘ఆయన’ మహానుభావుడు. మహా విద్వాంసుడూ అంటుంటారు. నిజానికతడు ఆ క్షణంలోనే విధ్వాంసుడిగా మారాడు.

ఎంత పెద్దలయినా తప్పు చేస్తే తప్పని చెప్పగలగాలి. కానీ ఎవరూ చెప్పరు. చెప్పరు.

ఎందుకు?

ఇక్కడ విశ్వనాథ్ ఒక గొప్ప ఐరనీని ప్రదర్శిస్తాడు.

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here