విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-14

0
12

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

గాయత్రీ పతి – 1

[dropcap]ఒ[/dropcap]క అద్భుతమైన, ఎవరూ గమనించి ఉండని దృశ్యం.

పద్మశ్రీ సన్నివేశం తరువాత వస్తుంది.

శారద, ఆమె తమ్ముడు, పక్షితీర్థం మామ్మగారిని కలుస్తారు. ఆవిడ శారదకు గంగాధరం గురించి చెప్పి అనంతరామ శర్మ లాంటి వారు మాత్రమే ఆ పిల్లడిలో ఉన్న సంగీత సరస్వతిని వెలికితీయగలరని అమాయకంగా అంటుంది.

ఇంతలో..

“అమ్మ గారు నుంచీ శారదకు వచ్చావ్?” అని నాకు వినబడింది.

రోడ్డు మీద ఫోన్ లో టైప్ చేసుకుంటూ నడుస్తున్న నేను ఉలిక్కిపడి చూశాను.

వెనకాల అనంతరామ శర్మ గారి ధర్మపత్ని.

అమ్మగారూ బాగున్నారా? నమస్కరించాను. అంటే పెద్దల మీద గౌరవం గౌరవమే. కానీ రిపోర్టింగ్‌లో ప్రతిసారీ అలా చేయవలసిన పని లేదనీ..

ఆవిడ నవ్వారు. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు. గుడికేనా? ఆవిడ అడిగారు.

నిజానికి నేను ఏమీ తోచక అలా నడుస్తున్నాను. ఆ నడక సమయంలో ఆలోచనలు రికార్డు చేసుకుంటున్నాను. ఇంతలో ఈ రాక. చేసేందుకు వేరే ఏ పని లేదు కనుక, గుడికెళ్ళటంలో ఏ అభ్యంతరమూ లేదు కనుకా.. అవును. కాదు. అనకుండా, తల కూడా ఊపకుండా నడక కొనసాగించాను అమ్మగారితో.

మట్టిబాట. పైన కమ్ముకొస్తున్న మేఘాలు. వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

నాకు Petrichor అంటే ఇష్టం. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. పెద్ద వాన పడకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాను. వాతావరణం వల్ల ఆ కొన్ని క్షణాలు మౌనం రాజ్యమేలుతున్నా ఆ విషయం కూడా ఎవరూ గమనించలేదు.

అక్కయ్యా! కాసేపట్లో ………………………… . ఇప్పుడు ఎలా? అమ్మగారి తమ్ముడు అనంత్ అడిగాడు. ఎప్పటిలాగే అసలు విషయాన్ని మింగేసాడు. వాన గురించి.

నాకు నవ్వు వచ్చినా తమాయించుకున్నాను. I don’t know why, I can navigate through my interactions with Anantha Rama Sharma by paying attention to the details he leave or keep in open. But she is a different person all together. కల్మషం లేని మనిషి. నిజమే. కానీ ఏదో తెలియని discomfort when she’s around.

ఎంత వరకూ వచ్చింది నీ రాత? అడిగారు.

నడుస్తోంది. చెప్పాను. ఏ రాత?

ఉన్నది ఉన్నట్లు రాస్తాను. కేస్ వేయరు కదా. భయం అభినయిస్తూ అడిగాను.

ఆవిడ మళ్ళీ నవ్వారు. అంత పెద్ద వయసులోనూ ఆవిడ ముఖ వర్చస్సు స్పష్టంగా తెలుస్తోంది. She has a special kind of aura around her even though she’s on the wrong side of 70s. సమాధానం మాత్రం మాటల్లో ఇవ్వలేదు. ఎదురుగా గేదెల గుంపొకటి ఎదురు వచ్చింది. ముగ్గురం తోవ తప్పుకుని వాటికి దారి ఇచ్చాం.

నేను జేబులోంచీ ఫోన్ తీసి వాటిలో చిన్నగా కనిపిస్తున్న దాన్ని ఫొటో తీశాను. వెనక నుంచీ అనంత్ మాటలు..

“ఏంటి గేదెలను …….. …….. తీస్తావా?”

నాకేం చెప్పాలో తెలియక రాబర్ట్ డౌనీ జూనియర్ స్టైల్ లో పెదాలు కొద్దిగా సాగదీసి నవ్వాను. ఇంతలో గుడి వచ్చింది. ప్రాంగణంలో ఓ పక్కగా బావి ఉంది. అక్కడ రెండు చేదలు ఉన్నాయి. నేను గోపురాలను ఫొటో తీస్తూ బైటే ఉన్నాను ఆ క్షణానికి. Anticipating rain in the next 47 seconds. సన్నగా చినుకులు పడబోతున్నాయి.

నేను కోరుకున్నట్లే పెద్ద వాన వచ్చేలా లేదు. మేఘాల దిశ హామీ ఇస్తోంది. ఇంతలో తొలి చినుకు నేల మీదకు దూసుకు వచ్చింది. మట్టిని తాకింది. మరో చినుకు. మరో చినుకు. ఇంకో చినుకు.

Petrichor. Ah! గుడి ఎదురుగ్గా ఉన్న పెద్ద చెట్టు వర్షాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఆకులు కదులుతున్నాయి.

ఇంతలో something happened. Don’t know how it happened. Or how I managed to do it. కానీ.. ఏం జరిగిందంటే..

అనంత్ గుడి బావిలో నీళ్ళు తోడి అమ్మగారికి కాళ్ళు కడుక్కునేందుకు ఇచ్చే ప్రయత్నం. తన చేతిలో ఉన్న చెంబును (ఎందుకు తెచ్చారో?) బావి గట్టు మీద పెట్టి చేద వేయబోతున్నాడు. నేను వర్షం తెచ్చిన సువాసనను, మీద పడుతున్న చినుకులు పెడుతున్న చక్కిలిగింతలను ఆస్వాదిస్తూ గుడి ప్రాంగణంలో అడుగు పెట్టబోతున్నాను.

ఇంతలో పెద్ద గాలి వీచటం ప్రారంభమయింది. బావి గట్టు మీద పెట్టిన చెంబు కదులుతోంది. నా మనసు ఫలకంపై ఏదో అస్పష్ట చిత్రం…

I understood at that moment that the discomfort I felt wasn’t because of the presence of her. It’s because my subconscious was anticipating the repetition of some-thing sinister that happened decades ago foreshadowing the tragedy that was about to happen.

నల్లటి కారు వచ్చి ఆగుతుంది. అందులోంచీ అమ్మగారు, అనంత్ దిగుతారు. ఒక నంది మీదుగా out of focus లో గంగాధరం ప్రాణ మిత్రుడు నీళ్ళ బిందె మోసుకుంటూ రావటం చూపిస్తారు. (నల్ల కుండకు foreshadowing?)

మీ ఊరు చాలా ప్రశంతంగా ఉంది మామ్మగారూ. శారద పక్షితీర్థం మామ్మగారితో అంటుంది.

జలుబు గొంతుతో నవ్వుతూ మనసు ప్రశాంతంగా ఉంటే అంతా ప్రశాంతంగానే కనిపిస్తుంది అమ్మా! పక్షితీర్థం మామ్మగారైన జయంతి అంటుంది.

వాళ్ళిద్దరూ నడిచి వెళుతుంటారు. ఇంతలో అనంత్ మీద షాట్. పై ఇద్దరూ ఔటాఫ్ ఫోకస్. గంగాధరం జీవితాన్ని అనంతరామ శర్మ out of focus చేయబూనుతాడని చెప్పేందుకా? శంకరాభరణంలో శంకరశాస్త్రి పడక, వీణ రిఫరెన్స్ జోక్ గుర్తుందా?

అది ఏదో ఉన్న సన్నివేశంలో కాస్త హాస్యాన్ని ఇరికించటానికి పెట్టారు అనుకుంటాం. కాదేమో.

ఇక్కడ..

ఈ క్షణంలో..

గుడి ప్రాంగణంలో..

నాకు తెలియకుండానే నేను దూసుకువెళ్ళాను. How I did it, I still can’t fathom. బావి గట్టు మీద చెంబు కదులుతోంది మరింత వేగంగా. నేను అక్కడికి చేరుకునేసరికి చెంబు కదులుతున్న శబ్దం నా కర్ణపుటంచులను చేరుతున్న సమయంలో.. ఆ చెంబు కింద పడటం, నేను నేల మీద ఫీల్డర్‌లా జారుతూ వెళ్ళి క్యాచ్ పట్టటం జరిగిపోయింది.

అదృష్టవశాత్తూ గీరుకు పోవటాలు, దెబ్బలు తగలటాలు లాంటివేమీ జరుగలేదు. అమ్మగారు కంగారు పడి నా వైపు వచ్చారు. అనంత్ ఇవేమీ పట్టకుండా నీళ్ళుతోడి పక్కనే ఉన్న పాతకాలపు మెటల్ బకెట్‌లో పోస్తున్నాడు. నేను పైకి లేచి నిలబడి ఎడమ చేతితో బట్టలు దులుపుతున్నాను. కాలు కాస్త బెణికినట్లుంది.

కుడి చేతిలో చెంబు.

ఆ చెంబు కోసం అంత సాహసమెందుకు చేశావు? అమ్మగారు అడిగారు. అదేమీ పురావస్తు తవ్వకాలలో బైట పడినదేమీ కాదే?

మీకు గుర్తు లేదా? నేను అన్నాను. ఆవిడ ముఖం చిట్లించారు. ఏమయింది? ఏమి గుర్తుండాలి?

మీరు, అనంత్ మామ కార్ దిగారు. పక్షితీర్థం మామ్మగారితో ఊరు ప్రశాంతత గురించి మాట్లాడారు. ఆవిడ మనసు ప్రశాంతత గురించి చెప్పారు. మీరు వెంటనే ఆవిడతో నడిచారు. అదే క్షణంలో అనంత్ మామ చేతిలోంచీ చెంబు జారి పడిపోయింది.

వెంటనే మీకు అక్కడ పక్షితీర్థం మామ్మగారు..

నా గొంతు తెలియకుండా పట్టుకు పోయింది. స్వరం కాస్త మారుతుండగా దాదాపు whispering చేస్తున్నట్లు అన్నాను. గంగాధరం గురించి చెప్తున్నారు.

ఆవిడకు ఆ జ్ఞాపకాలను రేపి, బాధ కలిగిస్తున్నానా అన్న ఆలోచన మనసులో చోటు చేసుకుంటుండగానే నా నోట్లో నుంచీ ఈ మాటలు వచ్చాయి.

“కే. విశ్వనాథ్ గంగాధరం జీవితం కూడా ఇలాగే చేజారిపోబోతోంది అని చెప్పారా?”

ఒక మామూలు హాస్యం కోసం పెట్టిన షాట్ కాదది. అదే ఆవిడతో అన్నాను.

One of the great foreshadowing scenes that was, if K. Vishwanath really conjured it up intentionally.

మనసు భారమైంది. ఆవిడ కళ్ళలో నీళ్ళు తిరిగాయప్పటికే! చినుకులు సన్నటి జల్లుగా మారాయి.

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here