విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-15

0
12

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

గాయత్రీ పతి – 2

[dropcap]త[/dropcap]ర్వాత గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నేను అనుకున్నది ఒక్కటే అసూయ అనే ఇన్ఫెక్షన్ నన్ను తాకరాదని.

Jealousy is the only emotion without any positive side to it – Keira Knightly

మనిషిని దహించి వేస్తుంది. తనను తానే కించపరుచుకుంటం అసూయ చెందటం అంటే తెలియకుండా మెదడు మీద ముసుగు వేస్తుంది.

మా మధ్య జరిగిన సుదీర్ఘ సంభాషణలో ప్రధాన పాత్ర తనదే అని తెలియని అనంత్ మామ మామూలుగా తన పని తాను చేసుకుంటూ కాస్త డల్‌గా కనిపిస్తున్న అమ్మగారిని నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్షణంలో అమ్మగారిని వయసు స్పష్టంగా తెలుస్తోంది. బతికి ఉంటే గంగాధరం ఈపాటికి ఏ స్థాయిలో ఉండేవాడో ఊహకందని విషయం. కానీ ఆవిడకు ఇష్ట పుత్రుడిగా ఉండేవాడు.

ఎందుకో తెలియదు కానీ, గంగాధరం మరణానికి ఆవిడే అసలు కారణం అని నాకై క్షణాన అనిపించింది. ఎందుకు?

***

అనంతరామ శర్మ గారు చెప్పిన కారణాలవల్ల నంటావా? గంగాధరానికి స్కాలర్‌షిప్ రానిది?

ఈ ప్రశ్న వేసింది Inspector Radhakrishna.

సినిమా మొత్తంలో అనంతరామ శర్మను ఒక మనిషి లాగా చూసింది ఆ రాధాకృష్ణే. He saw Anantha Rama Sharma exactly as he was and is. And the way he should be seen.

ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు. పాండితీ ప్రకర్ష కలిగిన వ్యక్తి. కానీ, మంత్రపుష్పం సీన్ తరువాత కచ్చితంగా ఆయనలో మనకు స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. దానికి మునుపే పద్మశ్రీ సన్నివేశంలో ఆయన రెండు నాల్కల ధోరణి బైట పడుతుంది.

భార్య శారదతో తాను ఎందుకు ఆ అవార్డును స్వీకరించ తల్చుకోలేదు అన్న విషయం చెప్పిన తీరు, తరువాత విలేకరులతో చెప్పే కారణాలు వేర్వేరు.

కానీ ఒక చిన్న మార్పు జరిగి ఉంటే బాగుండేది. ఈ తేడాను మరీ మొదట్లోనే చూపకుండా ఉంటే బాగుండేది. ఇక్కడ కుల ప్రస్తావన వచ్చింది. ఆయన వ్యక్తిత్వం ఎలాటిది అన్న విషయాన్ని చూపారు అనుకోవచ్చు. అది మంచిదే. కానీ, ఈ కథను కేవలం అనంతరామ శర్మ – గంగాధరాల కథగా నడిపించారు. అప్పుడు మంత్రపుష్పం సన్నివేశం వరకూ అనంతరామ శర్మ అంతరంగాన్ని గోప్యంగా ఉంచితే బాగుండేది. ఈ మార్పు జరిగి ఉంటే ఎలాంటి effect ఉండేది అన్న విషయం తరువాత చూద్దాం.

***

అత్తయ్యా! ఆయన మీద ఉండే మూఢభక్తిని పక్కన పెట్టి చూస్తే ఆయన ఆంతర్యం తెలుసుకోవచ్చు – రాధాకృష్ణ.

చాలా అద్భుతమైన డైలాగ్.

ఈ మూఢభక్తి వల్లే, ఇలాంటి అతి ఆరాధన పూర్వక మనస్తత్వాల వల్లే సమాజంలో కొందరి ఆగడాలు బహు చక్కగా సాగుతున్నాయి.

We have to call a spade a spade. A crow a crow.

డేగ్నీ టేగార్ట్ తన పద్ధతులలో ఉన్న లోపాలను సరిజేసుకునే వరకూ, తన బలహీనతలను అధిగమించే వరకూ జాన్ గాల్ట్ ఆమెతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. తన స్నేహితుడైన ఫ్రాన్సిస్కో డాంకోనియానూ వదిలిపెట్టలేదు.

ఇక The Fountainhead లో ప్రధాన సంఘర్షణ నాయికా నాయకులైన డామినిక్ ఫ్రాంకన్, హోవర్డ్ రోవర్క్ ఈ విషయం మీదనే. We have to look at things as they’re. We have to interact with them as they are. And process them as they should be and ought to be.

***

అలా చేస్తే అసలు కారణమేంటో వెతికి పట్టుకోవచ్చు – Inspector Radhakrishna.

చాలా మర్యాదగా, పద్ధతిగా, క్లియర్‌గా చెప్పేశాడు సొల్యూషన్. కానీ ఎందుకో ఆ విషయాన్ని గంగాధరంతో గట్టిగా డిస్కస్ చేసి ఉండాల్సింది. అలా జరిగితే గంగాధరం వినేవాడా? ఇది కూడా సమయం వచ్చినప్పుడు చూడాల్సిన పాయింటే.

Inspector Radhakrishna మాటలను పక్షితీర్థం మామ్మ గారు కొట్టిపడేస్తారు.

“నీది పోలీసు ఉద్యోగం కాబట్టి వెతకటాలు, పట్టుకోవటాలు అలవాటైపోయింది.”

As Sherlock Holmes said multiple times, it is the simplest and obvious clues that we miss or ignore or dismiss as trivial. But it is in them lies the actual detail.

“సరళీస్వరాలు కూడా ఇంకా రాని ఈ పసి గుడ్డు..”

నిజమే! సరళీస్వరాలు కూడా రావు. గంగాధరం సంగీతం వరకూ పసి గుడ్డే.

కానీ, ఆ గుడ్డులోనే Protein ఉండేది 😀.

అది humilityనో, పెద్దలు ఎక్కువగా పొగిడితే పిల్లలకు మంచిది కాదనే నమ్మకమో ఆవిడ చేత అలా మాట్లాడించింది. కానీ, విషయాన్ని గ్రహించాలిగా?

అంధభక్తి.

***

“ఇంతలోనే విద్వాంసుడైపోతాడా? ఆ మహానుభావుడికి పోటీ వచ్చేస్తాడా?”

అనుమానం దేనికి? మన దగ్గర పెరిగిన పిల్లాడనా? మన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. అలాంటి వారంతా పక్కింట్లో మాత్రమే పుడతారా?

మామ్మగారి ఉద్దేశం నిజానికది కాకపోవచ్చు. కానీ, మన పెద్దవాళ్ళు మాట్లాడే పద్ధతి!!!

అత్తయ్యా! అదే. నువ్వు నవ్వుతూ అన్నా exactly అదే! అలాంటిదేదో ఆంతర్యం, అంతరార్థం ఉంది. అంటాడు గాయత్రీపతి.

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here