విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-16

0
10

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

అసూయాపతి – 1

[dropcap]అ[/dropcap]సూయ అనేది చాలా సహజమైన భావోద్వేగం. ఏడాదిన్నర వయసు ఉన్న పసి పిల్లవాడికి ఒక తమ్ముడో చెల్లెలో పుడితే ఆ బేబీకి తన అమ్మో, నాన్నో, ఇతర బంధువులెవరైనా ఎటన్షన్ ఇస్తుంటే ఈ ఏడాదిన్నర పిల్లకాయకు కలిగే అభద్రతా భావమే అసూయ. ఐడెంటిటీ క్రైసిస్. నాకు ఇంతకు మునుపు ఇచ్చిన ఎటెన్షన్ ఇప్పుడు ఇవ్వటం లేదు అనే బాధ. అలాంటి పిల్లలకు “అదేమీ లేదు నాన్నా, తమ్ముడు లేదా చెల్లి చిన్న పిల్లలు కదా, అందుకే వాళ్ళకు మన సాయం కావాలి. నువ్వు కూడా హెల్ప్ చేయవచ్చు” అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వాలి. నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావ్ అంటే ఆ పిల్లల పసి ఇగో (don’t confuse it with vanity. Vanity invades people above an age of 6) కూడా satisfy అవుతుంది. నిన్ను ఎవరూ వదలటం లేదు అని చెప్పాలి. చాలా సున్నితమైన విషయం. తీగ మీద నడక లాంటిది. కష్టమే. కానీ అసాధ్యం కాదు.

మరి పెద్ద వాళ్ళ సంగతి?

అసూయ అనేది చాలా సంక్లిష్టమైన భావోద్వేగం. అందుకే కీరా నైట్లీ మనకున్న భావోద్వేగాలలో ఏ మాత్రం మంచి చేయని భావోద్వేగం అసూయ అని అంటుంది. కీరా నైట్లీ సైకాలజీని బాగా గ్రహించిన, అవగాహన చేసుకున్న వ్యక్తి. కేవలం నటి మాత్రమే కాదు. గొప్ప వ్యక్తిత్వమున్న స్త్రీ.

అసూయకు చాలా కారణాలుంటాయి. వీటిలో కొన్ని..

Fear of Loss

Jealousy can be a response to the fear of losing a loved one, whether it be a romantic partner, friend, or family member. మనకిష్టమైన వ్యక్తులను వేరొకరికి కోల్పోతామనే భయం. పిల్లలలో కూడా ఇది చూస్తాము. అమ్మను తమ్ముడు లేదా చెల్లి లాక్కుపోతారు. నాన్న నన్ను పట్టించుకోడు.. ఇలాంటి ఆలోచనలు. మన అభద్రతాభావాలు కూడా అసూయకు దారి తీస్తాయి. అంతే కాదు వ్యక్తులు దూరమౌతారు అనే భయం కూడా.

ఉదాహరణకు ఇద్దరు స్నేహితులున్నారు. వారిలో ఒకరికి అనుకోని అవకాశం చిక్కి పెద్ద సక్సెస్ సాధిస్తారు. దాని వల్ల రెండో వ్యక్తి మొదట సంతోషించినా, ఆ సక్సెస్ నా స్నేహితుడిని నా నుంచి దూరం చేస్తుంది అన్న భావన కలిగి ఆ రెండవ వ్యక్తిలో మొదట అభద్రతా భావం, తరువాత fear of loss, ఆ పైన అసూయ వచ్చి చేరతాయి.

Feelings of inadequacy

స్థాయీభేదాల గురించిన భయాలు కూడా అసూయకు దారి తీస్తాయి. ఒకరికి మనం తగమేమో, వారికి మనం తూగలేమేమో అనే ఆలోచనలు. క్రమంగా అభద్రతాభావాలు రేకెత్తిస్తాయి. అవతల వారి సమక్షంలో ఉండలేకుండా చేస్తాయి. మనలను ఇతరులతో పోల్చుకునే లాగా చేస్తాయి. న్యూనతను కలిగిస్తుందీ పరిస్థితి. అనంతరామ శర్మ అనుభవించిన స్థితి ఇదే. గంగాధరం తనకు అందనంత ఎత్తులో ఉన్నాడని గ్రహించేశాడు. Such people compare themselves to others and feel like they don’t measure up. This leads to feelings of jealousy, anger, and resentment. అన్నీ చూశాము మనం అనంతరామ శర్మలో.

పోటీ

అసూయ అనేది పోటీపడే మనస్తత్వం వల్ల కూడా వస్తుంది. But we shouldn’t confuse this పోటీ to competence. ఇది శృంగార సంబంధాల విషయంలో కావచ్చు. చదువు విషయంలో కావచ్చు. ఉద్యోగం విషయంలో కావచ్చు. సామర్థ్యం విషయంలో కావచ్చు. ఎక్కడైనా మన సమ ఉజ్జీ అనుకున్న వ్యక్తి మనకన్నా మెరుగైతే కచ్చితంగా అసూయ వస్తుంది. 1983 ప్రపంచ కప్‌కు కపిల్ దేవ్‌ను కెప్టెన్‌గా చేసిన సందర్భంలో సునీల్ గావస్కర్ వియయంలో చూడవచ్చు.

Gavaskar was already an international superstar who was in the game for about 12 years. Kapil was merely 24 and from a small town compared to Bombay and played the game for a mere 5 years. తన స్టేటస్ ఎక్కడ? కపిల్ స్టేటస్ ఎక్కడ? తనను కాకుండా ఇంగ్లీషు కూడా సరిగ్గా మాట్లాడటం కూడా రాని కపిల్‌కు కెప్టెన్సీయా? దాని వల్ల వచ్చే అదనపు సదుపాయాలా? మామూలుగా తన సీనియారిటీ వల్ల, స్టేచర్ వల్ల అందాల్సిన కొన్ని సౌకర్యాలను ఇప్పుడు తన పాకెట్ నుంచీ చెల్లించి పొందాలి.

Gavaskar felt he was a gentleman with good grooming. Kapil was not sophisticated. కపిల్ తనను ఎక్కడ తక్కువ చేస్తాడో అన్న భావన వల్ల తనను తానే ఒక కుకూన్ లోకి నెట్టికుని ఫామ్ కోల్పోయాడు. So, like Keira Knightley said, there is no positive side to the emotion called jealousy.

Attachment styles

Our attachment styles can also play a role in jealousy. People with anxious attachment styles are more likely to experience jealousy, as they are constantly worried about being abandoned or rejected or left out. FOMO. Fear of Missing Out.

మరి అసూయను ఎలా జయించాలి? అసూయాపరులను ఎలా ఎదుర్కోవాలి? లేదా శాంతింపజేయాలి?

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here