విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-2

3
13

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

గురు శిష్యుల స్వాతికి‘రణం’

[dropcap]గు[/dropcap]రువుల గురించి విశ్వనాథ్ సినిమాల్లో ఉన్న అంశాన్ని శోధించే నా ప్రయత్నంలో ఇది మొదటి అడుగు. ఇంతకు ముందర నేను శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa? అని నా ప్రయత్నానికి పీఠికని వ్రాశాను.

ఇది అసలు విషయం.

Ayn Rand వ్రాసిన The Fountainhead అనే నవలలో మనుషుల మనస్తత్వాలని విశ్లేషిస్తుంది. అవి నాలుగు రకాలంటూ. ఆ నాలుగు రకాలలో ఎంతో గొప్ప generalization ఉంది. ఆమె ఆరోహణ క్రమంలో వివరించింది.

అలాగే కే విశ్వనాథ్ సృజియించిన అద్భుత చిత్రరాజాలైన

  1. ‘శంకరాభరణం’
  2. ‘సాగర సంగమం’
  3. ‘స్వర్ణ కమలం’
  4. ‘స్వాతి కిరణం’

లలో గురువుల గురించి అవరోహణ క్రమంలో చెప్పారు. కానీ నేను ఆరోహణ క్రమం లోనే వాటి గురించి పరిశోధిస్తూ వెళుతున్నాను.

ముందుగా స్వాతి కిరణం.

కే విశ్వనాథ్ అద్భుతమైన పరిశీలనా శక్తికీ, సునిసిత దృష్టికీ, ఈ నాలుగు సినిమాలు గొప్ప ఉదాహరణలు. ఆయన తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే ఈ నాలుగు సినిమాలూ ఒక ఎత్తు. ఈ నాలుగింటినీ ఒక quadrulogy అనుకోవచ్చు.

The Guru Quadrulogy

ఇక్కడే నా కేస్ స్టడీ మొదలవుతుంది.

“శృతి నీవు ద్యుతి నీవు.. ఈ నా కృతి నీవు భారతీ..” అంటూ ఆ శిష్యుడు కుతూహలంగా మొదలు పెడితే ఆ గురువు గారికి అసూయ మొదలైంది. విశ్వనాథ్ ఇక్కడే తన గొప్పతనాన్ని బయట పెట్టుకున్నారు. ఎలా అంటే…

ముందు ఆ గురు శిష్యుల పాత్రలకి ఎంపిక చేసిన పాత్రధారుల ద్వారా? నిజంగా మమ్ముట్టీని ఎంపిక చేయటం masterstroke. ఏ కమల్‌నో, సోమయాజులనో, ఎంపిక చేయవచ్చు. కానీ వారిని ఇద్దరు గురువుల కోసం వాడేశారు. మూడో గురువు ఎవరో సస్పెన్స్. అందులోనూ వారిద్దరికీ తెలుగు ప్రేక్షకులలో ఒక రకమైన ఇమేజ్ ఉంది. అందువల్ల కథ మీద అంచనాలతో వచ్చే ప్రేక్షకులకి నిరాశ కలుగవచ్చు. ఇక్కడ విషయ ప్రధానమే కానీ నట ప్రధానం కాదని ఆయన తన ఎంపిక తోనే చెప్పారు.

మమ్ముట్టీ ఎంత మాత్రం నిరాశ పరచకుండా నటించి (మాట తప్పేమో..), ఆయన ఆశీస్సులని అందుకున్నారు. ఆ పిల్లాడూ అంతే బాగా నటించాడు. Selection of actors is top class. K. Vishwanath is a master in it. (Some more about this aspect in the later portions).

‘అసూయ’ మనిషి భావాలలో అతి ఏహ్యమైన భావం. మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుంది.

అందులోనూ ఒక గొప్ప శిష్యుని చూసి అసూయ పడ్డ గురువు ఆ గురుత్వానికే అనర్హుడు.

అలా అసూయ చేతిలో చిక్కి తన జీవితాన్ని కోల్పోవటమే కాక ఇద్దరికి కడుపు కోత మిగిల్చిన ఒక గురువు కథే ‘స్వాతి కిరణం’. అసూయ ప్రభావాన్నే కాదు మనుషుల సైకాలజీని ఇంత అద్భుతంగా స్టడీ చేసిన సినిమాలు చాలా అరుదు.

Ayn Rand తన The Fountainhead లో మనుషులని

  1. “a man who never could be, but doesn’t know it.”
  2. “a man who never could be, knows it too.”
  3. “a man who could have been.”
  4. “The man as he should be and ought to be.”

అని విభజిస్తుంది.

మరి విశ్వనాథ్ సినిమాల్లో.. మొదట అసూయ వల్ల ఎంత పతనమవుతారో చెప్పే ‘స్వాతి కిరణం’.

ఇక్కడి నుంచే నా పయనం మొదలు.

 

 

ఎందుకో కానీ నాకు తోచక అలా నేను ఒక రోజు రోడ్డు మీద నడిచి వెళ్తున్నాను. హఠాత్తుగా ఎవరో తెలిసిన మనిషి లాగా ఉంటే తేరిపార చూశాను. ఆశ్చర్యం!!! నా కళ్ళని నేనే నమ్మలేక పోయాను.

“నమస్కారం శర్మ గారూ!” అన్నాను. ఎంతైనా పెద్ద వ్యక్తి కదా.

“నేనెవరో నీకేలా తెలుసు?”

“ముందు ఆశీర్వదించండి. పెద్దలు.”

“ఆయుష్మాన్ భవ! ఇప్పుడు చెప్పు నేను నీకెలా తెలుసునో?”

“మిమ్మల్ని నేను ‘స్వాతి కిరణం’ అనే సినిమాలో చూశాను. మీరు అనంతరామ శర్మ కదూ?”

“అంటే నా గత జీవితం గురించి నీకు అంతా తెలుసునన్నమాట!”

“తెలుసునా అంటే కాస్త తెలుసునండీ.”

“మరి నా గురించి తెలిసిన వాడికి నాకు నమస్కారం పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? నా స్వంత వారే నన్ను అసహ్యించుకున్నారే?”

“అయ్యా! ఆ కాలంలో నాకూ మీ మీద అసహ్యం కలిగిన మాట నిజమే! మీరూ చివరకి పశ్చాత్తాప పడ్డారు. అయినా అసూయ మనిషిని ఎంత పతనం చేస్తుందో తెలుసుకోవటానికి మీ కథే ఒక సజీవ ఉదాహరణ.”

“నీ మాటల్లో పొంతన కుదరటం లేదు అబ్బాయీ.”

“విలువైన పాఠాన్ని నాకు నేర్పిన ఎవరైనా నాకు గౌరవనీయులే. అదీ కాక మీరు ఎంతైనా విద్వాంసులు.”

“బాగానే మాటలు చెపుతున్నావ్. కానీ నా తప్పుని క్షమించగలవా?”

“తప్పో ఒప్పో. అది జరిగి పోయిన విషయం. ఒకసారి తప్పు చేసినంత మాత్రాన ఎప్పుడూ తప్పు చేయాలనేమీ లేదుగా.”

“..”

“నాకు మీతో మాట్లాడాలని ఉంది. కొన్ని విషయాలు మీ నుండి తెలుసుకోవాలని ఉంది నాకు. మీరు అనుమతిస్తే.”

“నా నుంచా?”

“అవును శర్మగారూ. మీరు ఈ మధ్యన మీ ఆత్మకథని వ్రాశారట కదా?”

“అవును వ్రాశాను. ఆ విషయం మీదా? నేను అన్నీ నిజాలనే అందులో వ్రాశానా లేదో తెలుసుకుందామనా?”

“మీరు నిజాలు వ్రాసినా అబద్ధాలు వ్రాసినా నాకు సంబంధం లేదు. నాకు కావలసినది సత్యం. అన్ని నిజాలూ సత్యానికి దారితీయవు. అలాగే అబద్ధాలన్నీ అసత్యం కాదు. ధర్మాన్ని నిలబెట్టేది ఏదైనా సత్యమే.”

“ధర్మం అంటే?”

ఇది నేను ఊహించని ప్రశ్న! నాకు ధర్మం అంటే పూర్తిగా తెలియదు. మరి సత్యం? ఆ అన్వేషణలోనే ఉన్నాను. ఆయనకి ఏమి చెప్పాలి?

“ఏమబ్బాయ్! మౌనం వహించావు? సమాధానం చెప్పలేవా?”

“..”

“ధర్మం గురించి చెప్పలేనివాడివి ఆ పదాన్ని ఉచ్చరించకూడదు. మనకా అర్హత ఉందా? అని మనం తెలుసుకునే మాట్లాడాలి. నిన్ను తప్పు పట్టటం లేదు. తెలుసుకుంటావని చెపుతున్నాను.”

“మీరన్నది నాకు అర్ధం అవుతున్నది. కానీ అసలేమీ తెలియని వాడిని కాదు.”

“అంటే కాస్తైనా తెలిసిన వాడినే అంటావు. సరే పద. నీతో సంభాషణ ఆసక్తికరంగా ఉంది. ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం. వస్తావా?”

అలా నేను ఆయనతో నడుస్తూనే ఉన్నాను. మా మధ్య మౌనం. పొద్దుటి నుంచీ తిరిగి తిరిగి అలసిపోయిన నాకు కాస్త విశ్రమించాలని అనిపించింది. అందుకే ఏమీ మాట్లాడకుండా నేను ఆయనని అనుసరించాను. ఆ క్షణాలే నాకు అసూయ అంటే ఏమిటో అవగతం అయింది. నా అన్వేషణ ముందుకుసాగేలా చేసిందా ప్రయాణం.

మనిషిలో ఠీవి. ఒకరకమైన దర్పం. జీవితం నేర్పిన పాఠం వల్ల వచ్చిన humbleness. ఆ రెండూ ఆయనని ఒకేసారి ముంచెత్తినట్లు అనిపించింది. నుదుటన పొడూగ్గా బొట్టూ, పంచా, పైన ఉత్తరీయం. నడుముకీ పై పంచకీ మధ్యన ఆయన వేసుకున్న జంధ్యం అదో మాదిరిగా ఊగుతున్నది. సందె వేళైంది.

“ఇదిగో! ఇదే మా ఇల్లు. కాళ్ళు కడుక్కుని లోపలకి రా.”

ఇంతలో అమ్మగారు వచ్చి చెంబుతో నీళ్ళందించారు.

“అచ్చం స్వాతి కిరణం సినిమాలో రాధిక లానే ఉన్నారే?” స్వగతం లోనే అయినా పైకే అనేశాను.

ఆవిడ నవ్వింది. చల్లగా. చందమామలా.

ఆయన నన్నొక సారి చూసి అన్నారు. “అదే కదయ్యా! విశ్వనాథ్ గొప్పతనం. పాత్రోచితమైన నటులనే ఎన్నుకుంటారు. మమ్ముట్టి నాలా ఎలా సరిపోయాడో నీకు తెలుసు కదా.”

నేను అవునన్నట్టు తలూపాను. వరండాలో రెండు కుర్చీలు వేసి అమ్మగారు నన్ను లోపలకి పిలిచారు. చేతికి రెండు గ్లాసులు మంచి తీర్థం ఇచ్చి తినటానికి ఏమైనా తెస్తానంటూ లోనకు వెళ్ళారు.

నేను ఆయనకి ఒక గ్లాసు ఇచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడ్డాను.

“అబ్బీ! ఇంతకీ నీ పేరు చెప్పనేలేదు.”

“నన్ను ‘గీతాచార్య’ అంటారండీ.”

“అంటే ‘విజయ విశ్వనాథం’ అనే ప్రయత్నం మొదలెట్టినది నీవేనా?”

“అవునండీ.”

“వ్రాస్తున్నావా? లేక వ్రాసి ఆపేశావా మధ్యలోనే?”

“వ్రాసి ఆపాను. కాస్త విరామం కొరకు. కానీ నేను వ్రాస్తాను.”

“ఎందుకాపాల్సి వచ్చిందో?”

“అసూయ అంటే తెలియక.”

“సెల్ఫ్ డబ్బానా?” ఆయన నవ్వారు. నేనూ ఆయనతో శృతి కలిపాను. ఇంతలో అమ్మగారు ప్లేట్లలో పులిహారతో వచ్చారు.

“ ‘ఆపు నీ పులిహార కబుర్లూ, నువ్వూనూ’ అని చెప్పటానికా అండీ.” అన్నాను నేను నవ్వుతూ.

ఆవిడ నవ్వింది. “ముందు తినవయ్యా! తరువాత మాట్లాడుకుందాం.” అన్నారు ఆయన గంభీరంగా. పులిహార చాలా బాగుంది. ట్రిప్లికేన్ పార్థసారథి స్వామి గుడిలోని పులిహారలా.

తింటుండగా ఆయన సాలోచనగా అన్నారు. “శంకర శాస్త్రిని Howard Roark తో పోల్చావు. అద్భుతం. మరి నన్ను? నీకు చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పవద్దులే.”

నేను కాస్త నవ్వుతూ ఊరుకున్నాను. ఏదో ఆలోచిస్తూ.

“నీ శైలి బాగుంది. కానీ కాస్త ఆ లోపాల మీద దృష్టి పెట్టు. జనం చేత చదివించేలా వ్రాయాలి.” సరే అన్నట్టు తలూపి ఆయన కళ్ళలోకి చూస్తూ అన్నాను నేను.

“Peter Keating!”

ఆయన ఉలిక్కి పడ్డారు.

(సశేషం)

..మా మిగిలిన సంభాషణా, ఆత్మకథ విషయం మళ్ళీ కలసినప్పుడు.

ఈలోగా..

ఏమీ లేదు. నవ్వొద్దు. SERIOUS MATTER!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here