విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-29

0
12

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

The Redemption

[dropcap]ఇం[/dropcap]తకీ వీళ్ళందరికన్నా ప్రథమంగా మనకు తెలసిన శంకర శాస్త్రి గారు సంగీత కచ్చేరీ చేస్తూనే శంకరపదం చేరుకున్నారు. మరి వారి వారసత్వాన్ని అందుకున్న శంకరం ఏమయ్యాడు?

మీ ఊహ ఏమిటి?

పతనమయ్యాడు.

నమ్మరా? నా మీద మీ మీ అస్త్రాలు ఎక్కుపెడతారా?

శంకరం మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వినయ విధేయతలు ఉన్నవాడు. జిజ్ఞాస కలిగిన వాడు. మన గంగాధరం లాగానే ఆ వయసుకు తగినట్లు కనిపించాడు. కానీ, అతని subconscious లో తెలియని బడబాగ్ని గూడుకట్టుకుని ఉంది. గంగాధరం లాగా తనకు కుటుంబం లేదు. తల్లి మరణించింది. ఆలనా పాలనా చూసుకున్నది శారద, కామేశ్వరరావు. రిషభానికి, వృషభానికీ తేడా తెలియని కామేశ్వర రావు. చుట్టుప్రక్కల పెద్దలు ఉన్నా, శంకరానికి కావలసిన విద్యను అందించే గురువు లేకుండాపోయాడు. ఉన్న ప్రతిభను ఉపయోగించుకుని ఎదిగాడు. అందరిలాగానే కుటుంబం ఏర్పడి ఉండవచ్చు.

కానీ..

Somewhere down the line, he was lost in the world. జనం క్రమంగా మర్చిపోయారు. ఎందుకు? మనిషి తత్వమే అంత కనుక.

ఇదంతా నేను డేటాను విశ్లేషించటం ద్వారానే చెప్తున్నాను. కానీ, ఇక సమయం తీసుకోదల్చుకోలేదు కనుక పూర్తి వివరాలు అందించలేను (అంటే ఏమి జరిగి ఉండవచ్చు, ఎలా జరిగి ఉండవచ్చు అని). చూద్దాం!

బ్రాహ్మీ ముహుర్తంలోనే బయలుదేరాము. శకునాలు నాకు మంచిగా తోచాయి. నాన్న బట్టలు, ఇతర అవసరమైన వస్తువులు అనంతరామ శర్మ గారికి తగినవి ఇచ్చాను. ఆయనకు భేషుగ్గా సరిపోయాయి.

నాలుగు గంటలా పదిహేను నిముషాల తరువాత హస్తినలో దిగాము. సాయంకాలం ఆ అరంగేట్రం.

అరంగేట్రం అద్భుతంగా సాగింది. కృష్ణశాస్త్రి దేవులపల్లి గారు సంతోషించేలా 😉.

మీనాక్షి శిష్యురాలు భారత సంతతికి చెందిన వ్యక్తి కాదు. ఒక విదేశీ బాలిక చేత అంత అద్భుతమైన కళా ప్రదర్శన చేయించిన మీనాక్షిని, అందుకు కారణమైన చందును అభినందించకుండా ఉండలేము. అంతా అయ్యాక చివరలో ఆ అమ్మాయితో పాటు మీనాక్షి, శైలజలు నర్తించటం.. అపూర్వం. అన్నిటినీ మించి అనంతరామ శర్మగారికి దక్కిన గౌరవాదరాలు. కలిసిన మిత్రుల కోరిక మీద ఆయన తన స్వరాన్ని వినే భాగ్యం నాకు దక్కింది ప్రత్యక్షంగా.

కలిసిన వారితో మాటల మధ్య విజయ విశ్వనాథానికి సంబంధించిన చర్చ జరిగింది. వాతావరణం గంభీరంగా మారింది. అయినా అందరూ… highly matured people. చర్చ, గత జ్ఞాపకాల గురించి జరిగిన సంభాషణలు అన్నీ సౌహార్ద్రపు వాతావరణంలో జరిగాయి.

I had never seen Anantha Rama Sharma in such a blissfully peaceful mood like there’s nothing to worry about in the world.

హరుడు ఆనతినిచ్చాడు.

సంభాషణలు శంకరం మీదకు మళ్ళాయి. ఆయన వివరాలు కనుక్కున్నారు. నిజానికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం వేరొకరి ద్వారా శంకరం కు పంపించబడింది. కానీ..

రాలేదు.

ఆసక్తి లేదు.

సంగీతాన్ని వదిలేసాడు.

చాలాకాలం క్రితమే!

అందరూ ఆశ్చర్యపోయారు. వివరాలు అన్నీ క్రమంగా తెలిసిన వారి ద్వారా అందాయి. ఒక్కొక్కరూ ఒక్కొక్కరు స్పందించారు. నిండా 50 సంవత్సరాలు ఉండవు. ఒకటి రెండేళ్ళు అటూ ఇటూ. ఆయన తిరిగి సంగీత సరస్వతిని ఉపాసిస్తే బాగుంటుందనేది అందరి మాట!

అప్పటిదాకా మౌనంగా ఉంటున్న అనంతరామ శర్మ గారు ఒక పెరియాళ్వార్ పాశురాన్ని పాడారు. నా వైపు చూశారు.

నేను తల పంకిస్తూ కళ్ళతో అదే! అన్నట్లుగా అన్నాను.

“శంకరం బాధ్యత నేను తీసుకుంటాను.”

శర్మగారి మాట!

అతన్ని సంగీత సరస్వతి ఒడిలో చేర్చే బాధ్యత నాది. అందరూ ఆశ్చర్యంగాను, కొందరు అనుమానంగానూ చూశారు.

ఇక నేను మాట్లాడాల్సిన సమయం వచ్చింది. చెప్పాను జరిగినదంతా. అందరూ మౌనంగా విన్నారు.

ఇంతకు మించిన శుభవార్త మరొకటి ఉండదు. శర్మగారు తప్ప శంకరంలో ఆ స్ఫూర్తిని రగిలించిన సమర్థులు ఉండరు. పైగా అవసరమైతే సంగీతంలో గూఢమైన మెలకువలను ఆయన తప్ప మరొకరు అందించలేరేమో. శంకర శాస్త్రి గారి వారసత్వం వెలుగొందాలంటే ఇదే మార్గం. మీనాక్షి అన్నారు. శైలజ కూడా అదే సమర్థించారు.

చందు నావైపు చూసి కళ్ళెగరేసారు నవ్వుతూ. నేను సమాధానంగా నవ్వాను.

ఏంటి అజ్ఞానంలో బ్రహ్మజ్ఞానమా?

పింకు బాబు అన్నాడు. చెప్పనే లేదు కదూ? అక్కడే వారితోనే ఉన్నాడు.

అనంతరామ శర్మ గారు మాట నిబెట్టుకున్నావయ్యా! అని నా భుజం తడితే.. నా కళ్ళలో ఆనందబాష్పాలు.

Anything is possible in a benevolent universe.

Redemption too.

स्वस्ति: प्रजाभ्यः परिपालयंतां

न्यायेन मार्गेण महीं महीशाः।

गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं

लोकाः समस्ताः सुखिनोभवंतु॥

॥लोकाः समस्ताः सुखिनोभवंतु॥

(కలుద్దామా?)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here