విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-3

0
10

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

ఎంత మాటన్నాడు! (అనంతరామ శర్మ ఆత్మకథ)

[dropcap]నా[/dropcap] పేరు అనంతరామ శర్మ. మీకు తెలిసే ఉంటుంది. మీకందరికీ మీదైన ప్రపంచం, బాహ్య ప్రపంచం నాకు మాత్రం ఉన్నది ఒకటే ప్రపంచం. అదే సంగీతం.

ఈ ప్రపంచంలో హిమనగర, సాగర చందమున ఎన్నియో ఎత్తుపల్లములున్నవి.

సంగీతమునందునూ స్వరములందు హెచ్చుతగ్గులున్నవి. అలాగే నా జీవితంలోనూ ఎత్తుపల్లాలున్నాయి. కానీ నా జీవితం సంగీతమే కావటం నా అదృష్ట దురదృష్టమో లేక దురదృష్ట అదృష్టమో. నా జీవితంలోని అన్నిఎత్తులూ, ఉన్న ఒకేఒక్క ఒక్క పల్లమూ, (నీరు పల్లమెరుగును అంటారు. ఒక సారి పల్లపు మార్గము పడితే ఎంత మాత్రం ఎగువకు చేరలేదు. జీవితంలో ఎగువకు వెళ్ళలేదు. నేనూ నీరైపోయాను. అసూయతో. ఇక నా జీవితం పల్లానికే దారి తీసింది. అదే నా పతనం.) సంగీతం వల్లనే.

ఆ కుర్రాడు ఎంత మాటన్నాడు. నన్ను పీటర్ కీటింగ్! అసలు స్పృహలో ఉండే అనగలిగాడా? ఆ మాటన్నప్పుడు నా సహధర్మచారిణి కూడా అవాక్కయింది.

నాకైతే ఒక పిడుగు నా నెత్తిన పడినట్టయింది. ఈ అనంతరామశర్మ కీటింగ్! అదే ఒకప్పుడైతే ఎవరన్నా నా ముందు నిలబడాలంటేనే భయపడేవారు. నాకు సన్మాన సత్కారాలు చేసేటందుకు వేచి చూసేవారు. అచ్చు శంకర శాస్త్రి మాదిరిగానే. నేనూ ఆయన మాదిరిగానే సంగీతంలో మునిగిపోయాను. నా సర్వశక్తులూ దానిమీదే ఒడ్డాను. శంకర శాస్త్రి కన్నా నేను ఎందులో తక్కువ? ఆయన Roark. మరి నేను కీటింగ్? ఎంత అవమానం?

జీవితంలో పతనమైయ్యాను కానీ, మరీ ఇంతలానా?

అసలు సంగీతమంటేనే తెలియని ఒక సాధారణ యువకుడు నన్నంత మాట అంటాడా? సరిగమలు తెలుసునోలేదో?

కీటింగ్! కీటింగ్! కీటింగ్! This is cheating.

ఒకసారి తప్పు చేసినంత మాత్రాన ఎప్పుడూ తప్పు చేస్తారని నియమేమన్నా ఉన్నదా? అని నన్ను ప్రశ్నించిన వాడు! ఇప్పుడిలా అంటాడా? అవునులే. ఒకసారి పతనమైన మనిషంటే అందరికీ చులకన. ఎన్ని వత్సరములు గడచినా.. అనంతరామ శర్మ అంటే.. ఒక అసూయాపరుడు. ఒక చిన్న పిల్లడి మరణానికి కారణమైన నీచుడు. అంతే కానీ నా సంగీత పరిజ్ఞానం, అపరిమిత విజ్ఞానం ఎవరికీ పట్టవు. అసలు ఎవరూ తప్పులే చేయనట్టు.

నాకు పద్మ అవార్డు వచ్చినప్పుడు నేను దానిని తిరస్కరించటమే తెలుసు మీకు. కానీ నాకు కలిగిన ఆవేదన ఎవరికైనా పట్టినదా? నాకన్నా అర్హతలు తక్కువ ఉన్న వ్యక్తులతో పాటూ నాకు ఇస్తే నేను ఎలా స్వీకరిస్తానని అనుకున్నారు?

అవును నేను సంగీతంలోనే మునిగిపోయాను. నిజంగానే మునిగి పోయాను. బయట ప్రపంచం తెలియనంత. Child prodigy కావలసిన వాడిని నేను నా అసూయతో అంతం చేశానని అసూయ అంటే తెలియదని చెప్పుకున్న ఆ కుర్రాడు అన్నాడా? అనలేదు. కానీ జనం అన్న ఆ మాటని నేనెంత మరిచిపోజూసినా కుదరని పరిస్థితులు. కానీ నేనొక child prodigy ని కాదా?

కీటింగ్‌కి అసలు వాస్తునిర్మాణ శాస్త్ర పరిజ్ఞానం లేదే? అతడు ఒక పరాన్న భుక్కు. కానీ నేను ఎన్నో, ఎన్నెన్నో గీతాలనూ, కృతులనూ కూర్చాను. ఎందరినో నా గానంతో, గాత్ర మాధుర్యంతో అలరించాను. ఏ గంగాధరం మరణానికి నేను కారణమయ్యానో.. (హత విధీ..! నన్ను నేనే నిందించుకుంటున్నానే..? ఎంతలా దిగజార్చారు నన్ను జనులు?) కాదు కాదు, కారణమని నిందలు ఎదుర్కున్నానో ఆ గంగాధరాన్ని చేరదీసినది నేను కాదా? కోతికొమ్మచ్చులాడే వాడిని ఒక దారిలోపెట్టింది నేను కాదా? అవన్నీ.. ఎందుకులే.

నా జీవితాన్ని చెపుతాను. వినండి ముందు. నా బాల్యం అంతా సంగీతోపాసనలోనే గడచినది. నా యౌవ్వనమంతా కూడా అందులోనే కరగిపోయింది. నాకు సంగీతం తప్ప వేరేదీ లేనంతగా అది నా జీవితంలో పెనవేసుకుని పోయింది. ఎంత శ్రమపడ్డాను. ఎంత పరిశ్రమ చేసి నిర్మించుకున్నాను నా సంగీత సామ్రాజ్యాన్ని? అందులో మకుటం లేని మహారాజులా ఎదిగిపోవాలని ఎన్ని కలలని కన్నాను? (మకుటం ఉన్న మహారాజైతే ఏమన్నా ఇబ్బందా అనే ఆ కొంటె కోణంగా నన్ను కీటింగ్ అన్నది!)

వివాహం అయినది. సహధర్మచారిణి వచ్చింది. సంగీత పరమపద సోపానంలో నిచ్చెనలను ఎక్కే పని మీద ఉన్న నేను నా వయసునీ దాని హోరునీ పట్టించుకోనేలేదు. అలా నా జీవితం గోదారిలా, నిండు గోదారిలా ఉరకలు పరుగుల మీద సాగిపోతున్న తరుణంలో నాకు ఒక అడ్డు ఎదురైంది.

గంగాధరం రూపంలో.

నా సంగీత స్వరగంగా ప్రవాహానికి అడ్డుకట్టలా అవతరించాడు వాడు. గరళ కంఠుని పేరు పెట్టుకున్న వాడు నాలో నిలువెల్లా అసూయ అను విషమును నింపాడు.

ఎందుకు? ఎందుకలా?

ఆ అసూయే నా జీవిత గమనాన్ని ఛిద్రం చేసింది. అసలు నాకు సంగీతమే తప్ప వేరొకటి తెలియనప్పుడు అసూయ ఎందుకు కలిగింది? ఎందుకలా? ఏమైంది నాకు. గొంతు తడారి పోతున్నది. ఒళ్ళంతా మంటలు పుట్టుచున్నది. మెదడు మొరాయిస్తున్నది. మనస్సంత సెగలు. హృదయం దహించుకుని పోతున్నది.

పైకి గాంభీర్యం. లోపల అసూయ సెగలు. అసూయ నా మీద తన ప్రభావాన్ని చూపించటం మొదలెట్టింది. ఎందుకలా?

Hellow! Hellow! Dear Editor! Let me speak. Let me speak for a while. Gimme a breathing space. ఆయన ప్రశ్నల పరంపరని నేను ఎదుర్కోగలను. నన్నూ మాట్లాడనీయండి. Don’t let him to blame me for calling him Peter Keating. I have my strong reasons. I wanna share my reasons. That’s why I came here. Hellow! Hell….

Editor: కాస్త ఆగమ్మా! పెద్దాయన కదా ఆయనని చెప్పనీ. నీకవకాశం ఎప్పుడూ ఉంటుంది. చెప్పక పోతే రాయొచ్చు. ఆయన మన అతిథి. తన భావాలని మనతో పంచుకునేటందుకు ఇక్కడకి వచ్చారు. Let him do it. Then you will be given your time.

అవును సంగీతమే నా ప్రపంచం. అందులోనే నా సర్వస్వాన్నీ ఒడ్డాను. కానీ గంగాధరం? అతిచిన్న వయసులోనే.. నేను సాధనలో మునిగిన వయసులోనే ఆ స్వరగంగా ప్రవాహాన్ని, తన మస్తిష్క జటాజూటంలో బంధించటమే కాక.. ప్రేక్షక, శ్రోత భగీరధులకి పంచనారంభించాడు.

ఆ స్వర విపంచిని చూశాక నాలో ఒక అభద్రతా భావం వెన్నాడనారంభించింది. నా సంగీత ప్రపంచపు పునాదులు కదలనారంభించినాయి. మకుటం లేని మహారాజైన నాకు నా కిరీటం జారునేమో అన్న భావం ఎప్పుడు కలిగిందో నాకు విచక్షణ నశించనారంభించింది.

విచక్షణ లేని మానవడు పశువుతో సమానం. అంటే నేను ఆ రోజులలో పశువునయ్యాను. నాకు సంగీతమే ప్రపంచమెలాగో.. ఆ గంగాధరానికీ అంతే. కానీ మా ఇద్దరి మధ్య తేడా ఎక్కడి నుంచీ వచ్చింది? ఎక్కడ మా మధ్య తేడా?

దీర్ఘంగా నిశ్వసిస్తూ అనంతరామ శర్మ గారు మాటలుడిగి ఆగిపోయారు.

అందుకే గిమ్మీ ఏ ఛాన్స్ టు స్పీకే వర్డ్. మీకు సంగీతమే ప్రపంచం. అందులోకి మీరు కోరి వచ్చారు. పరిశ్రమ చేసి సాధించారు. అందుకే మీకు అహం పెరిగింది. ఎక్కువ తక్కువలు కనిపించ సాగాయి. అంటే మీరు జనానికి విలువ కట్టటం ప్రారంభించారు. అంటే మీరు ఇతరులని లెక్క చేయటం ప్రారంభించారు.

మీ స్వీయ గౌరవాన్నీ, .. What I mean to say is that, you lost your sense of self respect, and were valuing yourself by taking others as standards. అదెప్పుడు మొదలైందో అప్పుడే మీరు మిమ్మల్ని కోల్పోసాగారు. మీ ఆలోచనలంతా గంగాధరమే నిండాడు. అతనికి జనం కొట్టే చప్పట్లే మీ చెవులలో ప్రతిధ్వనించసాగాయి. ఇక మీలో సంగీత జ్ఞానానికి స్థానం ఎక్కడ ఉన్నది?

స రి గ మ లు మిమ్మల్ని వదలి బయటకు రాగా వాటి స్థానంలో గం గా ధ రం అనే నాలుగాక్షరాలూ చేరాయి.

అం..టే.. అక్కడ అనంతరామ శర్మ లేడు. ఉన్నది గంగాధరమే. అంత మాత్రాన మీరిద్దరూ ఒకరిలో ఒకరు ఏకమై త్వమేవాహం అని అనుకుంటున్నారా? అంటే అదీ లేదు.

అతని సంగతి నాకు తెలియదు కానీ ఈ కొద్ది పాటి పరిచయంలో మీ గురించి నాకు అర్ధమైన దానిని బట్టీ.. మీలో రెండు పార్శ్వాలు బయట పడ్డాయి. గంగాధరం. అనంతరామ శర్మ. అనంతరామ శర్మ native place లో గంగాధరం ఒక వైపూ, ఉల్టాగా మరో వైపూ.. ఇది చాలదూ సంఘర్షణ మొదలవటానికి?

మీలోని అహంకారి ఆ గంగాధరాన్ని తరమ లేకపోయాడు. అందుకే ఆ అనంతరామ శర్మ బయట ఉన్న గంగాధరం మీద పడ్డాడు. మీరా గంగాధరంలా ఉండలేరు. (ఒక సెలయేరులా.. పిల్ల తెమ్మెరలా.. ఆ ఈజ్ మీలో లేదు. రాదు.) ఎందుకంటే మీరు సంగీతంలో ఉన్నతిని కష్టపడి సాధించగా, ఆతనిలో అది అలవోకగా వచ్చి చేరింది.

మీ ప్రపంచం సంగీతం. కానీ ప్రపంచమే ఆతని సంగీతమైనది. అందుకే చెట్లూ, పుట్టలూ, అన్నీ, ఈ ప్రకృతంతా ఆతని నేస్తం. అందుకే మీకు అతని మీద అసూయ కలిగింది..

అగ్గి రగిలింది. ఏదోకటి కాలకుండా ఆగదు. మీ వ్యక్తిత్వం కాలనారంభించింది. దాన్ని ఆర్పుకోవాలంటే మీకు సెలయేటి లాంటి గంగాధరం కావాలి. అందుకే అతనిని మీ ఇంటికి తీసుకుని వెళ్ళారు.

అక్కడే..

You know? Happy men are the free men. And if you want to destroy a person’s happiness, first you gotta destroy his source of happiness – People like Ellsworth Monkton Toohey.

అందుకే గంగాధరానికి మీరొక పనిని అప్పగించారు. అతను అలవోకగా సాధించగానే, మీరు అతనిని తప్పు పట్టారు. He knew that he did that work his heart out. He knew, what he did was the best possible thing.

కానీ మీ దయ వల్ల అతనిలో ఒక దోషం ఏర్పడింది. అంతకు మునుపు అతనికి అతనే జడ్జ్. కానీ ఇప్పుడు అతనికి మీరొక ప్రమాణం అయ్యారు. అతనికి మిమ్మల్ని సంతృప్తి పరచటమే ప్రయారిటీ అయ్యింది. సంగీతం బ్యాక్ సీట్ తీసుకున్నది.

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here