విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-30

1
12

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్. చివరి భాగం.]

Say లవ్

[dropcap]సె[/dropcap]ర్యోష ఎవరు? ఎక్కడ ఉంటాడు?

నాకు ఐదేళ్ళ వయసున్నప్పుడు ఒక జ్వరం వచ్చిన సాయంకాలం వీధి అఱుగు మీద ఒళ్ళో కూర్చోపెట్టుకుని, విసెనకర్రతో విసురుతూ, మా నాన్న చదివి వినిపించిన ఒక కథ. నా వయసుకు అర్థమయ్యేలా క్లుప్తీకరిస్తూ చెప్పారు.

పుస్తకం పేరు అందరికీ తెలుసు.

పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు!

సోవియట్ యూనియన్‌కు చెందిన వేర పనోవ (పుస్తకం మీద వి. పనోవ అని ఉంటుంది. మా ఇంటి పేరే అనుకునే వాడిని) రాసిన నవల. A Summer To Remember అని ఇంగ్లీషులో ఉందట. నాకైతే దొరకలేదు. తెలుగు నవల నా స్నేహితుడికి ఇచ్చాను ఇంటర్‌లో ఉండగా. ఆ స్నేహమూ, పుస్తకమూ రెండూ మర్చిపోవాల్సి వచ్చింది. నాన్న చేత్తో పట్టుకుని చదివి వినిపించిన పుస్తకం. ఆయన జ్ఞాపకంగా నాతో లేకపోయింది. అదొక బాధ.

సరే!

ఆ పుస్తకం చివరలో సెర్యోషకు కూడా జ్వరం వస్తుంది. ఊరు కదలకూడదని అంటారు. కానీ పిల్లవాడు బెంగపెట్టుకుంటం తట్టుకోలేని మారుటి తండ్రి కొరొస్తెల్యోవ్ అతని ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని తీసుకుని వెళతాడు. తమ్ముడు, తల్లితో కూడా. పాషా అత్తయ్య కంగారుకు కొరొస్తెల్యోవ్ సమాధానం ఇచ్చిన విదానం నా మనసు మీద ముద్రించుకుని పోయింది.

చాలాకాలానికి నేను నా చిన్నప్పుడు చదివిన పుస్తకాల గురించి పుస్తకం.నెట్‌కు పంపిస్తే అక్కడ దాన్ని చదివిన ఆనంద్ సినిమా కాస్టూమ్ డిజైనర్ అరవింద్ జాషువా చదివి కామెంట్ పెట్టారు. ఆయనకు కూడా ఆ పుస్తకమంటే చాలా ఇష్టమని, తన వివాహం కూడా ఆ పుస్తకం వల్లే అయిందని. తరువాత ఆయనే నాకొక కాపీ ఇచ్చారు ఆ పుస్తకం.

ఆ సెర్యోష కథ నాకు చాలా ప్రత్యేకం. జ్ఞాపకాలతో ముడిపడి ఉండటమే కాదు. చాలా రకాలుగా నచ్చిన కథ.

తన స్వంత ఊరి నుంచీ (అంటే పుట్టి పెరిగిన ఊరి నుంచీ) దూరం వెళ్ళిపోయిన సెర్యోష అక్కడ తన జీవితం గురించి రకరకాల కలలు కంటాడు. ఆశతో వెళతాడు. అక్కడతో కథ ముగుస్తుంది.

కానీ తరువాత సెర్యోష కథ ఏమయింది? సెర్యోష పెరిగి పెద్దవాడయ్యాడా? లేక అనారోగ్యం తరువాత చేసిన ప్రయాణం వల్ల ఏమైనా అయ్యిందా? కొరొస్తెల్యోవ్ or Dimitri Korneyevitch ప్రేమ పూర్వక పెంపకంలో సోవియట్ భూమిలో ఒక బాధ్యత గలిగిన పౌరుడిగా ఎదిగాడా?

కథా కాలం 1950లు. అంటే తరువాత మూడున్నర దశాబ్దాలకు సోవియట్ యూనియన్ పతనమైంది. అప్పటికి సెర్యోష వయసు (బ్రతికి ఉంటే) 40 సంవత్సరాలు. ఎలా ఆ సమయంలో ఉండి ఉంటాడు? తరువాత రష్యా జీవనంలో ఎలా కలిసిపోయి ఉంటాడు? తన చిన్నతనపు సోవియట్ రోజులను తన వృద్ధాప్యంలో ఎలా తల్చుకునే వాడు? అతని రియాక్షన్ ఏ విధంగా ఉండి ఉండేది? ఇవన్నీ నాకు ప్రశ్నలే.

ఒంటరిగా ఉన్నప్పుడో, ఖాళీగా ఉన్నప్పుడో ఆలోచిస్తుంటాను. Dmitry Korostelyev was a Red Army veteran. So, Seryozha must be influenced by him about the Soviet style of life.

ఆ నవలలో దొరికిన ఆధారాలను బట్టీ వివిధ రకాలైన permutations combinations వాడుతూ అతని తదనంతర జీవితాన్ని, అదే నా నేస్తు సెర్యోష, నా రష్యన్ మిత్రులతో చాలాసార్లు చర్చిస్తుంటాను. They’re fascinated by my interest in Seryosha. There was a guy in Reddit named Sergey Bukhanin used to have a username Seryozha. Later I came to know about Seryozha being the diminutive form of Sergey. Bukhanin and I used to have several discussions about the Seryozha.

అలాగే నా మీద ముద్ర వేసిన సినిమా స్వాతి కిరణం. కనీసం వెయ్యి సార్లు చూసి ఉంటాను.

***

నజీర్ గారని నాకు మొదటి ఉద్యోగం ఇచ్చిన కాలేజ్ వ్యవస్థాపకలు, ప్రిన్సిపల్. ఆయనకు నేనంటే చాలా అభిమానం.

ఒకసారి మా అనకొండ దగ్గర టైప్ నేర్చుకున్న వ్యక్తి ఫలానా కాలేజ్‌లో ఇంటర్ వాళ్ళకు ఫిజిక్స్ చెప్పాలని అంటే అప్పుడే పీజీ ముగించిన నేను ట్యూటర్‌గా కన్నా డైరక్ట్ టీచింగ్ మంచిదని వెళ్ళాను. వెళ్ళగానే ఇంటర్ వాళ్ళకు ట్యూటర్‌గా ఇస్తాను. క్లాస్ తర్వాత చూద్దాం అన్నారు. అసలు విషయం ఏమిటంటే నేను వెళ్ళేసరికే ఆ రోల్ ఫిల్ అయ్యింది. కానీ వచ్చిన కుర్రాడిని డిజప్పాయింట్ చేయకూడదని ఆ ట్యూటర్ రోల్ ఆఫర్ చేశారు. వాళ్ళకు అవసరం లేకపోయినా.

కాదు. ఒక్కసారి డెమో తీసుకుని చెప్పండి అన్నాను.

ఇంటర్‌లో కష్టం. చెప్తానంటే డిగ్రీ వాళ్ళకు తీసుకుంటాను అన్నారు. సరే అని డెమో ఇచ్చాను. వాళ్ళకు Morning section లో ఇంటర్ వాళ్ళకు ట్యూటర్ గా, Evening section లో డిగ్రీ వాళ్ళకు పాఠాలు చెప్పే లాగా. పూర్తి సమయం చేయాలి. అలా చేయటం ఇష్టం లేక నేను వచ్చేశాను.

కానీ, డబ్బు అవసరం అయితే ఉంది. గేట్ పరీక్షకు కోచింగ్ తీసుకోవటానికి కాస్త వెనకేసుకోవాల్సిన అవసరం కూడా. దీనికి తోడు అనుభవం వస్తుంది. As we all know experience is always important. ఒక రెండు వారాలు గడిచాక గేట్ కోచింగ్ ఫీజు నేను దాచుకునేందుకు తగినంత కాలం నేను మీ దగ్గర చేస్తాను. నాకు పొద్దున మాత్రమే కుదురుతుంది. మీకు నా డెమో కనుక నచ్చితే ఈ సహాయం చేయండి. అని ఆయన నాకు చెప్పిన నంబర్ లో 60 శాతం కోట్ చేస్తూ అంత జీతానికి చేస్తాను అని లెటర్ రాసాను.

ఆయనేమనుకున్నారో ఏమో తెలియదు. క్లార్క్ చేత ఫోన్ చేయించి రమ్మనమన్నారు. వెళ్ళాను. వెళ్ళగానే నన్ను చూసి పెద్దగా నవ్వారు.

ఆ లెటర్ ఏంటి? ఆ వ్యవహారం ఏంటి అని.

సరే! నువ్వడిగినంత ఇస్తాను. ఇంటర్ వారికి కాదు. డిగ్రీ వాళ్ళకు చెప్పు అని అవకాశం ఇచ్చారు.

ఇప్పటికి తల్చుకున్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయనతో చాలాసార్లు సంభాషించే వాడిని. ఆ సంభాషణల్లో లోకజ్ఞానం అబ్బింది. మనుషులు, వారి మనస్తత్వాలు, ఆలోచనలు, ఈ ఉద్యోగ పర్వాలలో ఉండే రాజకీయాలు, పెద్దవాళ్లతో ఎలా మెసగాలి, పై వారిని ఎలా మెప్పించాలి?

I’m one way, he directly or indirectly through his casual conversations with me helped me gain experience to cope up with this big bad world.

ఆ కాలేజ్ లోనే అనంతరామ శర్మ లాంటి వ్యక్తి నాకు ఎదురు పడ్డాడు. ఆయనే ఫిజిక్స్ లెక్చరర్. నేను డిగ్రీ వాళ్ళకు చెప్పే శైలి, విధానం, అక్కడ పిల్లలకు పెరిగిన మార్కులు వాటిని గురించి తెలుసుకున్న ఇంటర్ పిల్లలు నేను ఎప్పుడైనా వాళ్ళకు ఆయన absence లో వెళ్ళినప్పుడు నేను వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా అనే వారు. అది విన్న నజీర్ గారు నేను వారి ట్రాప్‌లో పడకుండా కాపాడారు.

In one way he shielded me from getting trapped by such cheap praise from the students who generally… you know it. అలాగే నా మీద విపరీతంగా complaints చేసే ఆ అనంతరామ శర్మ గారి ప్రభావం నా మీద పడకుండా చూశారు.

నజీర్ గారి దగ్గర పనిచేసిన ఆ సమయం, ఆయన మాటలు, చాకచక్యం, ఆయన మంచితనం, నాకు అవకాశం ఇచ్చిన విధానం, దాని వెనుక ఉన్న కారణం ఇవన్నీ నా మీద మంచి ప్రభావం చూపాయి. All helped me in coping up with the power games in the corporate world later in my life. అనంతరామ శర్మలనే కాదు చాలామందిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా అర్థం చేయించారు. ఆయన నాకు ఇప్పటికీ ఆత్మీయులుగా ఉన్నారు.

పీఠికలో చెప్పినట్లు, కే. విశ్వనాథ్ సినిమాలలో The Guru Quadrulogy చాలా ప్రత్యేకం. దాని నుంచీ చాలా నేర్చుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే జీవితకాలం పాఠాలను విశ్వనాథ్ మనకు నాలుగు సినిమాల రూపంలో అందించాడు.

All those films and the characters have several parallels with Ayn Rand’s characters in The Fountainhead. అది కూడా సవివరంగా మొదటి ఎపిసోడ్లలో చెప్పాను.

అసలు విజయ విశ్వనాథమ్ రాయటానికి ప్రధాన కారణం ఈ సినిమాలను through the prism of Ayn Rand’s Objectivism విశ్లేషిస్తూ, మానవ మనస్తత్వాలను, ఎలాంటి సందర్భాలలో ఎవరు ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తారు, దాని వెనుక ఉన్న సైకాలజీ ఏమిటి అన్నది చూడాలని. ఈ సినిమాలలో ఉన్న ప్రధాన పాత్రలను పూర్తిగా అవగతం చేసుకుని, వారి జీవితాలను సినిమాలో చూపిన మేర కాదు. పుట్టుక దగ్గర నుంచీ, విశ్లేషిస్తూ, సినిమాలో చూపిన కథ తరువాత వారి జీవితాలు ఏ విధంగా ఉండవచ్చు అనేది కూడా అర్థవంతంగా, లాజికల్ గా reconstruct చేసి ఒక క్లోజర్‌కు తీసుకుని రావాలి. అదే నా ఆలోచన. చాలాసార్లు జరిగిన సంభాషణలు, డిస్కషన్లు, ఇలా తయారు చేసుకున్న నోట్సే Vijaya Vishwanatham – Vishwa Vijayeebhava గా రూపుదిద్దుకున్నది.

తెలుగులో కాదు. ఇంగ్లీషులో. చాలా పెద్ద పుస్తకమే అయ్యింది.

మిత్రుడు రఘు నల్లూరి తన మాస్ కమ్యూనికేషన్స్ పీజీలో (రచన కాలేజ్) చేసిన ప్రాజెక్ట్‌కు రిఫరెన్స్‌గా సాగర సంగమం భాగాన్ని తీసుకున్నాడు. అది దాదాపు 200 పేజీల కథ. అలాగే కనీసం మరో నలుగురు రిఫరెన్స్ కింద వాడుకున్నారు. With due acknowledgement.

VV isn’t a failure. The English version is an epic, in one way as I preposterously declared in one of my Facebook posts, it’s India’s answer to The Fountainhead.

కానీ, దురదృష్టవశాత్తు సంచికలో రాస్తున్న దానిని నేను సరైన టార్గెట్ రీడర్లను నిర్ణయించుకోలేక బోల్తాపడ్డాను. లేదా చదివేవారికి సంతృప్తి కలిగేలా రాయలేకపోయి ఉంటాను. చిన్నగా కథనాన్ని చిక్కబరుస్తూ, 96 ఎపిసోడ్లకు అనుకున్నాను. కానీ, చేరాల్సిన టార్గెట్ రీడర్లకు చేరకపోవటం, అయినా కొనసాగించటం అన్నది సమయం వృథా కార్యక్రమం అనిపించింది.

రాసిన దాని వల్ల పేరైనా రావాలి. లేదా డబ్బైనా రావాలి. పైగా మరో ఆర్టికిల్‌ను ఎడిటర్‌లు ఎడిట్ చేసి అప్లోడ్ చేయటం ఎప్పుడూ భారమే. అందుకే హింట్స్ ఇస్తూ ముగింపుకు తెచ్చాను. ఎవరికీ భారం కాకుండా.

  1. శంకరాభరణం తరువాత శంకరం కథ ఏమయి ఉండవచ్చు?
  2. సాగర సంగమం తరువాత శైలజ బాలకృష్ణ భాగవతార్ ఆశలను పరిపూర్ణం చేస్తుందా? లేక దారి తప్పుతుందా? అసలు బాలకృష్ణ భాగవతార్ లాంటి వాళ్ళు అలాగే ఎందుకు ఉంటారు? వారి జీవితాల్లో సక్సెస్ ఎందుకు రాదు?
  3. మీనాక్షి చందు కోసం అమెరికా వెళ్ళకుండా తిరిగి వచ్చేసింది. తరువాత అవకాశం ఎలా? తొలిప్రేమ లాంటి ముగింపు విశ్వనాథ్ ఎందుకు ఇవ్వలేదు?
  4. అనంతరామ శర్మ గారు చేసిన పనికి తగిన శిక్ష పడింది. చివరలో మరలా ఆయన సంగీతాభ్యాసంలో పడతారు. But being an egotist (different from egoist), he’s not completely redeemed. He has to tame his vanity (egotism) with egoism. దానికి ఆయనకు redemption అవసరం ఉంది.

శంకరాన్ని మరలా సంగీత ప్రపంచంలోకి తీసుకు వచ్చి మెంటర్‌గా ఉండటానికి ఆయనకన్నా అర్హులు వేరొకరు ఉండరు. It not only gives an apt and perfect closure to the oft tragic circles of K. Vishwanath endings but also gives redemption to Anantha Rama Sharma.

అందుకు ఆయనకు foil గా ఉండే “నేను” అనే నేరేటర్ ను ప్రవేశ పెట్టాను. That నేను భవదీయుడు ఉస్తాద్ గీతాచార్య కాదు (Pawan Kalyan fans be damned). A person who knows how to handle the likes of Anantha Rama Sharma.

అజ్ఞానంలో బ్రహ్మజ్ఞానం concept is the true catalyst in the redemption of Anantha Rama Sharma. స్వాతి కిరణంలో ఇచ్చిన ముగింపు సరైనది కాదు. He deserves a proper second chance and he should have one.

దీనంతటికీ చాలా కథ నడపాలి. ప్రతి పాత్రనూ మథించాలి. బడ్డాయి.

ఏదో ఇక్కడ అలా జరిగిపోయింది. I failed to properly connect the dots for Sanchika readers. And my specific readers are too small in numbers here to sustain this series. No regrets here.

మీకో విషయం తెలుసా? నన్ను తిట్టొచ్చు. కానీ,

The actual villain in Swathi Kiranam isn’t Mammootty’s Anantha Rama Sharma. It’s రాధిక వేసిన అమ్మగారు లేదా శారద.

Surprised?

There’s a logical answer to it. But my byte sized episodes didn’t work. And let it hang like that.

Thanks for the opportunity.

Let’s continue our journey forward..

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here