విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-6

1
11

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

దర్శనం

[dropcap]ఆ[/dropcap] రోజు హోవర్డ్ రోవర్క్ రీమోడల్ చేయబడిన Stoddard Temple ను చూడాలని వెళతాడు. కాస్త దూరంగా నిలుచుని అటువైపే తీక్ష్ణదృక్కులు సారిస్తాడు. మొహంలో ఎలాంటి భావనా కనపడదు. ఆ టెంపుల్‌లో చేసిన మార్పులను గమనిస్తుంటాడు. ఉండవల్సిన యూనిటీ అనుకున్న విధంగానే మిస్ అయి ఉంటుంది.

ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది టూయీకి. రోవర్క్ ఎదురుగా ఉన్నాడు. మేకపోతు గాంభీర్యాన్ని ఆభరణంగా ధరించి, చేవ లేని నవ్వును పెదవుల మీద ఇముడ్చుకుని ఒక రకమైన ధ్వనితో రోవర్క్‌ను పలకరిస్తాడు.

అసలు తన ఎదుట ఒక మనిషి ఉన్నట్లు ఏమాత్రం స్పృహ చూపడు రోవర్క్.

టూయీకి మాత్రం ఇది సత్య దర్శనం. తట్టుకోలేని విధంగా, తన ఆత్మను నిలువెత్తు నగ్నంగా తన ముందే నిలబెట్టిన పరిస్థితి.

ఆ Stoddard Temple వ్యవహారం, తరువాత జరిగిన కోర్టు కేసు, తనకున్న సర్వం కోల్పోవటానికి టూయీనే కారణమని రోవర్క్‌కు తెలుసు అని టూయీకి తెలుసు.

అందుకే రోవర్క్ తనను ఎంత అసహ్యించుకుంటున్నాడో అతని ద్వారానే తెలుసుకోవాలని కుతి. He wanted to see a Howard Roark outburst.

వెళ్ళాడు.

నీ ప్రతిభను నేను గుర్తించినంతగా వేరెవరూ గుర్తించరు అని తెలుసుకో.. – ఉపోద్ఘాతంగా అంటాడు టూయీ.

కానీ నీవంటి వాళ్ళు ఈ ప్రపంచానికి ప్రమాదకరం. అందుకే నీ పతనాన్ని శాసించటానికే Hopton Stoddard ను నీ వద్దకు పంపాను. చూశావా? నా వాళ్ళు నీ సృష్టికి చేసిన మార్పులు?

రోవర్క్ పట్టించుకోడు. గోడ మీద బల్లి, కేంద్రం దృష్టిలో తెలుగు రాజకీయ నాయకులు, Ellsworth Toohey.

ఇక్కడెవరూ లేరు. దాపరికాలు వద్దు. నా గురించి నీవు ఏమనుకుంటున్నావు? టూయీ రోవర్క్‌ను అడుగుతాడు.

అతని ఆధిపత్యాన్ని కూలుస్తూ రోవర్క్ అంటాడు.

BUT I DON’T THINK OF YOU!

నిజానికి గంగాధరం అనంతరామ శర్మ అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని మనస్తత్వం, యోచన, వ్యక్తిత్వం ఎక్కడా consistent గా లేవు. He has no integrity అన్నది మంత్రపుష్పాన్ని వరుస మార్చి పాడినప్పుడే తెలుస్తుంది.

పెద్దవాడు, ఆదర్శప్రాయుడు అయిన అనంతరామ శర్మ వరుస మారుస్తే, సహజ ప్రతిభ ఉన్న కోణంగి గంగాధరం కూడా అనుకరించడా?

అసలు ఈ అనుకరణే గంగాధరాన్ని దెబ్బకొట్టింది.

తనకు తానే benchmark కావలసినవాడు, వేరొకరిని benchmark గా తీసుకోవటం ఆత్మహత్యా సదృశం. చివరికి తన జీవితాన్ని అర్ధాంతరంగా తీసుకున్నాడు. ఆత్మహత్య రూపంలో.

రోవర్క్ ఎక్కడా ఎవరినీ తన benchmark గా తీసుకోడు. Not even Henry Cameron. He was and is an independent spirit both inside and out. But Gangadharam is not such an independent spirit.

It is not just because of the characterisation the filmmaker had given. There’s a lot more to it. Psychologically, and at a deeper level. దేశాలు, సంప్రదాయాలు, సంస్కృతుల మధ్య భేదం కూడా తన ప్రభావం చూపిందిక్కడ.

But just like Toohey knows the capabilities of Howard Roark like no others, Anantharama Sharma has seen a threat in Gangadharam. అతని మీద తొలి చూపులోనే ద్వేషాన్ని పెంచుకున్నాడు.

అందుకే ఒక పదేళ్ళ చిన్న పిల్లడి పిల్ల చేష్టలను అవసరమైన దానికన్నా ఎక్కువ గర్హనీయమైన పనిగా జమకట్టి,

“నా సమక్షంలోనే వేద నాదాన్ని అవహేళన చేస్తాడా?” అని హుంకరిస్తాడు.

మరి ఆయన చేసిన పని ఏమిటో?

ఒక పవిత్రమైన వేద మంత్రాన్ని అన్య రాగంలో పాడటం తప్పు కాదా? తాను చేయబట్టే కదా దాన్ని మరింత రంజుగా మార్చాలని చూస్తాడు గంగాధరం. గురువింద నైజం. తన లోపాలను కప్పిపుచ్చుకోవటం కోసం..

ఈ ఒక్క చర్య వల్ల అటు తల్లితండ్రులు, ఇటు తనకు విద్య నేర్పుతున్న టీచరమ్మా గంగాధరాన్ని చీదరించుకుంటారు. అతని మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు.

Just like Toohey trapped Roark indirectly through the Stoddard Temple, using his love of his work as a bait, Anantharama Sharma too trapped Gangadharam. Not in this moment of reckoning (for us – మంత్ర పుష్పం సీన్), but much later in the film. But this is a foreshadowing.

Gamgadharam’s was a case similar to Hank Rearden in Atlas Shrugged.

Sanction of the Victim!

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here