విజయపథం – పుస్తక పరిచయం

0
8

[dropcap]భా[/dropcap]రతీయ మూల శాసనాల నుంచి మౌలిక విజయసూత్రాలను చెప్పే అమృత బిందువులను ఒకచోట చేర్చి, సమకాలీన సమాజానికి అన్వయిస్తూ, అనుసంధానం చేసే ప్రయత్నం ‘విజయపథం’.

సంస్కృత వాఙ్మయంలో ప్రధానంగా రామాయణ, భారత ఇతిహాసాల ఆధారంగా రచించిన వ్యాసాలు ఇవి. “సంస్కృత వాఙ్మయ సరిత్తు నుండి ఒక స్రవంతి ఈ ‘విజయపథం’ పుస్తకంగా ప్రత్యక్షమయింది. దేశం-ధర్మం, సంస్కృతి.. ఒకటిగా ఉన్న భారతీయయత ఎంతటి సార్వకాలిక – సార్వజనీన సత్యమో ఈ పుస్తకం మరో మారు ఋజువు చేస్తోంది” అని ముందుమాట రాసిన సామవేదం షణ్ముఖశర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘యువత అవశ్యం పఠించాల్సిన ఈ గ్రంథం వారి వ్యక్తిత్వాన్ని పదును పెట్టడమే కాక, భారతీయత లోని ఔన్నత్యాన్ని గ్రహించటానికి దోహదపడుతుంద’న్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ పుస్తకంలో మొత్తం 33 వ్యాసాలున్నాయి. ‘ఆలోచన ఎలా చెయ్యాలి’ నుంచి ఆరంభమయిన వ్యాసాలు ‘విజయపథంలో జారుడు మెట్ల’ గురించి హెచ్చరిస్తూ, ‘వినయం – విజయ రహస్యం’ అని నిరూపిస్తూ, ‘స్వధర్మం’ వివరించి శాంతిమంత్రంతో పూర్తవుతుంది.

ప్రతి వ్యాసం అవసరమైన సమాచారంగా, ఉపయోగకరమైన వ్యాఖ్యానంతో, చక్కటి శ్లోకాలతో, విషయాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. పది పాశ్చాత్య ప్రభావిత ‘వ్యక్తిత్వ వికాస’ పుస్తకాల కన్నా ఈ పుస్తకంలో ఒక్క అధ్యాయం ఎక్కువ పాజిటివ్ ఆలోచనలను, ఆరోగ్యకరమైన ధోరణిని ఇస్తుంది.

మొత్తం పుస్తకం తప్పకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, సక్రమమైన దిశలో ఆలోచనలను ఇస్తుంది.

***

విజయపథం

సంకలనం – వ్యాఖ్యానం: బి.ఎస్. శర్మ

పేజీలు: 158

వెల: ₹ 150/-

ప్రతులకు:

సాహిత్యనికేతన్, 3-4-852, కేశవనిలయం,

బర్కత్‌పురా, హైదరాబాద్ 500027

ఫోన్:  040 2756 3236

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here