విలయ విన్యాసం

1
2

స్వామి వివేకానంద చెప్పినట్లు శివలింగం అంటే ఆద్యంతములు లేని అసాధారణ శక్తి కలిగినదని అర్థం. అథర్వవేద సంహితలోని పదవకాండలో ఎనిమిదవ సూక్తంలో 25వ ప్రపాఠకంలో యూపస్తంభం పస్తావన ఉన్నది. ఈ స్తంభానికి ఆద్యంతాలు లేవు. నిరాకారుడైన పరమేశ్వరుడి అసాధారణ శక్తి కలిగి ఉన్నది. ఇందులోనుంచి అగ్ని (ఫైర్) విరజిమ్ముతున్నది. ఈ యూపస్తంభమే శివలింగానికి మూలమని స్వామీజీ వివరించారు. లింగము అంటే స్తంభమని అర్థం. శివలింగం అటామిక్ ఎనర్జీకి స్పష్టమైన ప్రతీక అని పరిశోధకులు సైతం తేల్చారు. దీన్నెలా నిరూపించాలి? అణు శక్తి అంతులేని వినాశనానికి గుర్తు. అదే సమయంలో అంతులేని మంచి ప్రయోజనాల కోసమూ అణుశక్తి ఉపయోగపడుతుంది. భారతీయ శాస్త్రాల ప్రకారం శివుడు ఎంత లయకారుడో.. అంత బోళాశంకరుడు. ఇవన్నీ పక్కన పెడదాం. నిజంగా శివలింగం అణుశక్తికి ప్రతీక అని ఎలా చెప్పగలం? ఒకసారి ఆధునిక యుగంలో న్యూక్లియర్ రియాక్టర్లు గమనిద్దాం.

  1. శివలింగం అన్నది సాధారణంగా గోళాకారంలో ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్ కూడా అదే రూపంలో ఉంటుంది.
  2. పానవట్టం అన్నది శివలింగం అభిషేక జలాన్ని విడిచిపెట్టడానికి ఏర్పాటు చేసింది. న్యూక్లియర్ రియాక్టర్ బేస్ కూడా కలుషిత నీటిని వదిలిపెట్టడానికి ఏర్పాటుచేస్తారు.
  3. ప్రాచీన కాలం నుంచి ఇవాల్టి వరకూ కూడా శివలింగానికి ప్రతిరోజూ నీరు, పాలతో అభిషేకంచేస్తారు. ఇవాళ మనం న్యూక్లియర్ రియాక్టర్ చల్లబడటానికి దాని పై భాగంలో నీరు పోస్తాం.
  4. ఆసక్తికరమైన విషయమేంటంటే శివాలయాలు అత్యధికంగా నదులు, సరస్సులు, చెరువుల వంటి నీటివనరులు ఎక్కువగా ఉన్నచోటనే ఉంటాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు కూడా నీటి వనరులు ఉన్నచోటనే ఉంటాయి.
  5. శివలింగానికి అభిషేకం చేసిన జలాన్ని తీర్థ ప్రసాదంగా స్వీకరించరు. న్యూక్లియర్ రియాక్టర్‌ను చల్లబరిచేందుకు పోసే నీటిని కూడా రేడియేషన్ ప్రభావం ఉన్న కలుషిత నీటిగా వదిలిపెడతారు.

ఇదే విషయంలో మరో ఆలోచననూ గమనిద్దాం. త్రిమూర్తి తత్త్వం మన భారతీయ ధర్మంలో ఉన్నది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురూ త్రిమూర్తులు. ఇంతవరకు అంతా మనకు తెలిసిందే. ఇక్కడ విష్ణువు పాలసముద్రంలో శేషశయనుడై ఉన్నాడు. ఆయన నాభిలోంచి వచ్చిన కమలంపై బ్రహ్మ ఉంటాడు. వీరిద్దరికీ డిటాచ్డ్ (విడిగా)గా శివుడు నిరంతర ధ్యానముద్రలో ఉన్నాడు. ఈ కాన్సెప్ట్‌ను కూడా మనం అధ్యయనం చేయాలి. అణుశక్తి అన్నది ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్ల కారణంగా ఉద్భవిస్తుంది. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. ఈ కేంద్రకం ఆధారభూమికగా ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి. కణాల సృష్టిలో ప్రధానమైన భూమిక ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లదే. అందులోనూ ఎలక్ట్రాన్లదే ఎక్కువ పాత్ర. త్రిమూర్తి తత్వంలోనూ బ్రహ్మ బాధ్యత అదే. ఎలక్ట్రాన్లు తమ దశ మార్చుకుంటే కేంద్రక విచ్ఛిత్తి జరుగుతుంది. అంటే సృష్టి లయ తప్పితే మహావినాశనం జరుగుతుంది. ఇక్కడ విష్ణువు నాభి కేంద్రకమైతే, హరుడు న్యూట్రాన్, హరి ప్రోటాన్ అయితే బ్రహ్మ ఎలక్ట్రాన్ అన్నమాట.

ఇక్కడ మరో ముచ్చట కూడా చెప్పుకోవాలి. అణుశక్తిని ఎంతగా సద్వినియోగం చేసుకుంటే అంత మేలుచేస్తుంది. దుర్వినియోగం చేసుకుంటే మహావినాశనానికి దారితీస్తుంది. దీనికి సంబంధించి కూడా మనకు భారతీయ పురాణాల్లో కథల రూపంలో హెచ్చరించారు మన పూర్వికులు. భస్మాసురుడు కనాకష్టం పడి శివుణ్ణి మెప్పిస్తే ఆయన కనికరించి తన పవర్‌లో చిన్న పర్సంటేజిని ఇచ్చాడు. దాన్ని అతడు దుర్వినియోగం చేస్తే తానే భస్మమైపోయాడు. శివుడిలోని అణుశక్తికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేంకావాలి.

కైలాసంపై ఏమున్నది?

కైలాస పర్వతం శివుడి ఆవాసం. పశ్చిమ టిబెట్లో దాదాపు 22 వేల అడుగుల నిలువెత్తు పర్వతం. భారతీయులతోపాటు, బౌద్ధులు, జైనులు కూడా ఆధ్యాత్మికంగా పవిత్రమైనదిగా భావిస్తారు. పరమశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని అందరి విశ్వాసం. అత్యంత ప్రతికూల వాతావరణంలో, ఆక్సిజన్ తక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్న కైలాస పర్వతం దగ్గరకు ఒక్కసారైనా వెళ్లిరావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. ఏటా లక్షలాది భక్తులు కైలాస మానససరోవర యాత్ర చేస్తుంటారు. ఆధునిక శాస్త్రవేత్తలు మాత్రం శివుడు లేదా గ్రహాంతరవాసులు ఇతర లోకాల నుంచి రకరకాల పరికరాలను భూమ్మీదకు తీసుకువచ్చేందుకు ఈ పర్వతాన్ని వినియోగించుకొన్నారని భావిస్తారు. కానీ దీని శిఖరంపైన ఏమున్నదనేది ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని రహస్యమే. విచిత్రమేమంటే ఈ పర్వతం ఒకవైపు నుంచి చూస్తే శంఖాకారంలో, మరోవైపు నుంచి చూస్తే పిరమిడ్ ఆకారంలో కనిపిస్తుంది. ఎర్న్‌స్ట్ ముల్దషేవ్ అనే ఓ రష్యా కంటి సర్జన్.. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లోని 21 పర్వతాలను అధిరోహించారు. 1999లో కైలాస పర్వత స్వరూప స్వభావాలను అధ్యయనం చేయడానికి వెళ్లారు. ఆయన వెంట కొందరు రష్యా శాస్త్రవేత్తలు కూడా వెళ్లారు. కైలాస పర్వత శిఖరం వారికి ఒక పిరమిడ్‌లా కనిపించింది. ఆ శిఖరం ఎవరో రూపొందిస్తే రూపొందిందే తప్ప సహజంగా ఏర్పడింది కాదని వారు అభిప్రాయపడ్డారు. వారి దృష్టిలో గ్రహాంతర వాసులు దీని శిఖరం పై ఒక నిర్మాణాన్ని చేసుకున్నారని నమ్మారు. అలాగైతే అదే శివుడి ఆవాసమా? కైలాస శిఖరంపై కృత్రిమ నిర్మాణం నిజంగానే ఉన్నదా? ఆ రహస్యం మాత్రం తేలలేదు. అనేక మతాలు కైలాస పర్వతాన్ని పూజనీయంగా భావిస్తాయి. దాని అంచుల్లో అడుగులు వేయడం కూడా ఘోరమైన పాపంగా భావిస్తారు. ఎవరైనా సాహసం చేస్తే వారు చనిపోతారని కూడా చెప్తారు. అందుకే చైనా కైలాస పర్వతారోహణను నిషేధించింది. అయితే కైలాస యాత్రకు వెళ్లిన చాలామందికి అనూహ్యమైన అనుభవాలు కలిగాయి. చాలామందికి వయసు పెరిగిపోయింది. వెంట్రుకలు, గోళ్లు సాధారణంకంటే వేగంగా పెరిగాయి. కైలాసపర్వతంపై నుంచి వచ్చే ఎనర్జీ యాత్రికుల శరీరాల్లో ప్రవేశించడం వల్ల మార్పులు జరుగుతున్నాయి. కైలాస శిఖరంపై ఎనర్జీ ఉన్నదని ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలు చెప్తారు. కైలాస పర్వతమే రేడియోయాక్టివ్ కావచ్చు. శివుడిలోని హాలాహలం అంటే ఇదేనా? అంటే అవుననే చెప్పాలి. ఇందుకు మరింత ఆధారం కోసం అన్వేషిస్తే.. మరిన్ని వివరాలు లభ్యమయ్యాయి. కైలాస పర్వతానికి సుమారు 600 మైళ్ల దూరంలో పశ్చిమచైనా ప్రాంతంలోని మొగావో గుహల్లో క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తుశకం 1500 మధ్యకాలంలో దాదాపు 50 వేల మాన్యుస్క్రిప్ట్లను బౌద్ధులు దాచి ఉంచారు. 1907లో హంగేరియన్ పరిశోధకుడు ఆరెల్ స్టెయిన్ కనుగొనేంత వరకు వీటి గురించి ప్రపంచానికి తెలియలేదు. ఈ పత్రాలలో ఒక అద్భుతమైన డయాగ్రమ్ లభించింది. ఈ డయాగ్రమ్‌ని చూస్తే ఇది అత్యంత సాంకేతికపరమైనదిగా కనిపించింది. ఈ డయాగ్రమ్‍ను పరిశీలిస్తే అదొక కణత్వరణ యంత్రం (పార్టికల్ ఆక్సెలరేటర్)గా అభిప్రాయపడ్డారు. ఇది న్యూక్లియర్ రియాక్టర్‌కు శక్తిని ఇచ్చేది. మహా ప్రళయం సంభవించినప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీని ఉంచడానికి కైలాస పర్వతాన్ని సరైన ప్రదేశంగా గ్రహాంతరవాసులు భావించారని ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలంటారు. శివుడే పరమ శక్తి అయినప్పుడు.. అది కైలాసంలో ఉంచక మరెక్కడ ఉంటుంది. కైలాస పర్వతం చాలా అద్భుతమైందని శాస్త్రవేత్తలే రూఢీ చేశారు. కైలాస పర్వతం పూర్తిగా రేడియేషన్‌తో నిండి ఉన్నదని తేల్చారు. రేడియేషన్ అంటే పాయిజన్.. అంటే విషం. శివుడి పరిభాషలో చెప్పాలంటే హాలాహలం. భూమిపై అత్యంత ప్రాచీన నాగరికతకు, అణ్వస్త్ర శక్తికి ఇంతకంటే ఆనవాళ్లు ఇంకేం కావాలి. ఈ శక్తిని మానవాళికి గ్రహాంతరవాసులు అందించారని పాశ్చాత్యశాస్త్రవేత్తలు అంటారు. పరమేశ్వరుడి ప్రత్యక్ష్య సాక్ష్యం మనకిక్కడ సాకారంగా కనిపిస్తున్నది. మన లభించిన ప్రాచీన శాస్త్ర విజ్ఞానానికి ఆయనే ప్రతినిధి. మనకు గురువు. మార్గదర్శి. సర్వస్వం. కైలాస పర్వతానికి సంబంధించి మరో అంశాన్ని కూడా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. రష్యాకు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నికోలస్ రోరిచ్ హిమాలయాల అన్వేషణలో వెళ్లినప్పుడు ఆయనకు సూర్యకాంతితో వెలుగులీనుతూ ఒక భారీ యూఎఫ్‌ఓ ఆకాశంలో వెళ్తూ కనిపించిందిట. ఇది దక్షిణం నుంచి ఆగ్నేయం వైపు దారి మళ్లుతూ ఆకాశంలో మాయమైపోయిందని రోరిచ్ పేర్కొన్నారు. కైలాస యాత్రకు వెళ్లే చాలా మందికి యూఎఫ్‌ఓ‌లను చూసిన అనుభవం ఉన్నది. వీటిలో చాలావరకు కైలాస పర్వతం సమీపంలోకి వెళ్లి మాయమైపోయాయి. కైలాస పర్వతం రేడియోయాక్టివ్ కనుకనే దానిపై సురక్షితంగా చేరడానికి యూఎఫ్‌ఓలు తిరుగుతున్నాయనడానికి సంకేతంగా భావించవచ్చని ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలు చెప్తున్నారు. అంటే కైలాసంపై శివుడి ఉనికి స్పష్టమని తేలిపోయింది. ఎందుకంటే శివుడు శక్తికి ఆధారమే కాదు. తానే పరమోత్కృష్టమైన శక్తి.

త్రినేత్రం.. త్రిశూలం

శివుడు త్రినేత్రుడు.. ధరించే ఆయుధం త్రిశూలం. త్రిమూర్తులలో మూడోవాడు. శివుడికి మూడు అంకెకు ఉన్న సంబంధం ఏమిటి? మూడులోని రహస్యచైతన్యం ఏమిటి? భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో ఈ మూడు అనే అంకె విపరీతంగా ప్రభావితం చేస్తున్నది. భారతీయ ధర్మంలో త్రిమూర్తులు ఎలా ఉన్నారో.. శ్రీ.. వాణి.. గిరిజలు ముగురమ్మలుగా ఉన్నారు. మనకున్న దేవతల సంఖ్య కూడా ముక్కోటి. శ్రీచక్రం అనేక త్రికోణాల సమాహారమే. మన ఆధ్యాత్మిక భావభూమికల్లో మూడు అంకెకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. మూడు తర్వాత మనం చెప్పుకొనేవి కూడా మూడు గుణాకార సంఖ్యలనే చెప్పుకొంటాం. రెండు మూడులు గుణిస్తే షణ్ముఖుడు కన్పిస్తాడు. మూడు మూడులు గుణిస్తే.. నవ దుర్గలు, నవవిధ బ్రహ్మలు, నవనాథులు ఉంటారు. నాలుగు మూడులు గుణిస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలున్నాయి. అయిదు మూడులు గుణిస్తే కృష్ణ, శుక్ల పక్షాలు.. ఆరు మూడులు గుణిస్తే అష్టాదశ శక్తిపీఠాలు.. ఏడు మూడులు గుణిస్తే ఏకవింశతి. వినాయకుడిని ఏకవింశతి పత్రాలతో పూజిస్తారు. ఎనిమిది మూడులు గుణిస్తే చతుర్వింశతి.. గాయత్రి మంత్రంలోని అక్షరాలు 24. మనకు 24 మంది ప్రధాన ఋషులు ఉన్నారు.

మన సారస్వతంలో ప్రధానమైన కావ్య గుణాలు 24. తొమ్మిది మూడులు గుణిస్తే సప్తవింశతి. మనకు ఉన్న నక్షత్రాలు 27. మనకు ఉన్న పలు విధాలైన యోగాలు 27. విశ్వదేవులు 27. మండపములు 27. మీరే ఒక్కసారి ఆలోచించండి.. మనం పెట్టుకొనే నామాలు మూడు. త్రిశూలమే త్రినామాలు. మనం ఆలయంలో తీసుకొనే తీర్థు మూడుసార్లు తీసుకొంటాం. ప్రదక్షిణ మూడుసార్లు చేస్తాం. ఆచమనం మూడుసార్లు చేస్తాం. యజ్ఞోపవీతం మూడు లేదా ఆరు వరుసలు వేస్తారు. మనం చేసే నమస్కార ముద్ర త్రికోణాకారంలో ఉంటుంది. ప్రేమ చిహ్నమూ త్రికోణమే. ఏమిటీ మూడుకున్న ప్రాధాన్యం? మన వ్రతాల్లో, పూజల్లో, యజ్ఞయాగాదుల్లో పసుపుతో తయారుచేసే గౌరీ రూపానిదీ త్రికోణమే. ఋగ్వేదంలో మనకు దేవతల స్వరూపాలను విశ్లేషించారు. వారి సంఖ్యను పేర్కొన్నారు. పన్నెండుగురు ఆదిత్యులు.. పదకొండు రుద్రులు.. ఎనిమిది మంది వసువులు.. 31 మంది.. వీరికి ద్యావాపృథువులిద్దరినీ కలిపితే.. 33 మంది దేవతలయ్యారు. ఇక్కడ కూడా ఇదే ప్రాధాన్యం.

ఈ మూడు అంకెకున్న ప్రాధాన్యం అసాధారణమైంది. కేవలం భారతీయ ధర్మానికే ఇది పరిమితం కాలేదు. ప్రపంచంలోని అన్ని సంప్రదాయాల్లోనూ ఈ మూడుకు అత్యధిక ప్రాధాన్యమున్నది. మానవ చరిత్ర మొత్తాన్ని ఒక్కసారి పరికిస్తే అత్యున్నతమైనవన్నీ మూడు రూపాలలో వచ్చినట్లు తెలుస్తుంది. ఈ అంకె మరో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నట్లుగా ప్రతీకాత్మకంగా కనిపిస్తుంది. భూమికి, మరో ప్రపంచానికి ఒక గేట్ వే గా మూడు అంకే ప్రాతినిధ్యం వహిస్తున్నది. మతంలో, ధర్మంలో మూడు అంకె కీలకమైన భూమిక పోషిస్తున్నది. ఎందుకంటే.. ప్రపంచంలో కోట్లాది ప్రజలు భూమి మీదకు ఇతర గ్రహాల నుంచి.. లేదా ఇతర లోకాల నుంచి జీవులు లేదా దేవతలు.. సైంటిఫిక్‌గా చెప్పాలంటే గ్రహాంతరవాసులు వచ్చి వెళ్లారని బలంగా విశ్వసిస్తున్నారు. బౌద్ధం త్రిశరణాలను బోధించింది. హిందూ త్రిమూర్తి తత్వం మాదిరిగానే క్రైస్తవం త్రిమూర్తి తత్త్వాన్ని బోధించింది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అన్న మూడు తత్త్వాలు ఏకమై త్రిమూర్తి తత్త్వంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ తండ్రి అంటే యహెూవా, కుమారుడు అంటే ఏసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అంటే దేవుడి ఆత్మ భూమి నుంచి నీరు మూడురోజుల పాటు వేరయిందని ప్రాచీన బైబిల్ చెప్పింది. ఏసుక్రీస్తు శిలువ వేయబడిన తర్వాత మూడురోజులకు తిరిగి జీవితుడయ్యాడని న్యూటెస్టిమెంట్ చెప్తుంది. మనదేశంలో షిర్డీ సాయిబాబా కూడా శరీరాన్ని విడిచిపెట్టి మూడురోజుల తర్వాత మళ్లీ ప్రవేశించాడని చరిత్ర చెప్తుంది. యూదుల సంప్రదాయంలోనూ త్రి తత్వాలున్నాయని చెప్తారు.

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోనూ మూడుకున్న ప్రాధాన్యం శిలాసదృశంగా కనిపిస్తుంది. ఐర్లాండ్‌లోని న్యూట్రేంజిలో ఐదువేల ఏండ్లనాటి ఓ సమాధి మూడు రకాల దారులు కలిగి ఉన్నది. ప్రాచీన గ్రీసులోని పదకొండు వందల ఏండ్లనాటి మూడు బౌద్ద ఆరామాలు మూడు పగోడాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి కూడా త్రికోణాకారంలో ఏర్పడి ఉన్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి మనుషులను రక్షించేందుకు ఈ రూపంలో నిర్మించారని ప్రజల విశ్వాసం. ప్రపంచంలోని అనేక సంస్కృతులు మూడు అనే అంకే అత్యంత పవిత్రమైనదిగా, దైవ సంబంధమైనదిగా భావిస్తాయి. యురోపియన్ సంప్రదాయంలో మూడు అంకె వినియోగం విస్మతంగా కన్పిస్తుంది. ఈ అంకెల సంప్రదాయాలు చాలా శక్తిమంతమైనవి. అంతేకాదు.. వివిధ సంస్కృతుల మధ్య ఒక కనెక్టివిటీని ఏర్పాటు చేశాయనటంలో సందేహం లేదు. ఇంతెందుకు మన జీవితమే భూతభవిష్యత్ వర్తమానాలుగా మూడు విభాగాలుగా విభజించుకొన్నాం. జానపదాల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో మూడో అంకె అధికంగా కనిపిస్తుంది.

అన్నింటికంటే ముఖ్యమైనవి ఈజిప్టులోని గిజా పిరమిడ్లు. కైరో నగర శివార్లలో నిర్మాణమైన మూడు అతి పెద్ద పిరమిడ్లు నాలుగువేల సంవత్సరాలకు పూర్వం నిర్మించినవి. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఇవి ఒకటి. ఈ మూడు పిరమిడ్లు త్రికోణాకృతిలోనే నిర్మించారు. ఆనాటి పిరమిడ్ నిర్మాతలకు జియోమెట్రీ గురించి బాగా తెలుసు. ఒకదాని పక్కన ఒక భవనాన్ని ఎలా నిర్మించాలన్న నాలెడ్జి వారికి చాలా ఉన్నది. గిజా పిరమిడ్ నిర్మాణమే అత్యంత ఆసక్తిగా కనిపిస్తుంది. మూడువైపులా కనిపించే ముక్కోణపు ఆకారం మన ప్రాచీనులు జియోమెట్రీ నాలెడ్జితో ఇంటిగ్రేట్ అయ్యారని స్పష్టంచేస్తుంది. ఈ ముక్కోణం ఊర్థ్వముఖంగా దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది. ఇది దేనికి సంకేతం.. ఇతర లోకాల్లో ఉన్న దేవుళ్లకు భూమి నుంచి సందేశాన్ని పంపించేందుకు ఏర్పాటుచేసిందా? ఊర్థ్వముఖంగా సాగిపోతున్న చైతన్య స్రవంతికి సింబలా?

క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం.. ప్రముఖ గ్రీకు గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త పైథాగరస్ ఒక ప్రముఖమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏ స్క్వేర్డ్ ప్లస్ బీ స్క్వేర్డ్ = సీ స్క్వేర్డ్. లంబకోణ త్రికోణంలోని మూడు వైపుల మధ్య సంబంధాన్ని ఈ గణితశాస్త్ర ఫార్ములా బోధిస్తుంది. పైథాగరస్ రెండున్నర వేల సంవత్సరాల క్రితం జీవించాడు. ఈయన ఈజిప్టుకు చెందిన గొప్ప ఉపాధ్యాయుల దగ్గర చదువుకున్నాడని చెప్తారు. అంటే ఈజిప్టు జ్ఞానాన్ని పైథాగరస్ గ్రీకుకు తీసుకువచ్చాడన్నమాట. ఒక పైథాగరస్‌కు మాత్రమే కాదు.. ప్రపంచంలోని ప్రాచీన తత్త్వవేత్తలందరికీ గణితశాస్త్రమనేది సూపరనేచురల్‌కు సంబంధించిన రహస్యాన్ని విప్పిచెప్పే అద్భుతమైందని విశ్వసించారు. విశ్వంలో ప్రతి ఒక్కటీ మూడు భాగాల నిర్మాణమని పైథాగరస్ చెప్పాడు. ప్రతి ఒక్క సమస్య కూడా డయాగ్రమెటిక్‌గా త్రికోణ పరిమితిలోకి వస్తాయన్నాడు. పైథాగరస్ శిష్యులు త్రికోణాన్ని ఊర్థ్యముఖానికి ప్రతినిధిగా నమ్ముతారు. ఇప్పటివరకు అంతుపట్టని అనేక రహస్యాలకు మూడు అత్యంత కీలకమైన అంకే అని చెప్తారు.

ఫ్రాన్స్‌లోని కార్నాక్.. ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో భారీగా నిలుచున్న రాళ్ళున్నాయి. ఆరువేల సంవత్సరాలకు పూర్వమైనవి. వీటిలో ఎక్కువగా పైథాగరస్ త్రికోణమితి మాదిరిగా ఉంటాయి. ఇవన్నీ కూడా పైథాగరస్‌కు ఎన్నో వేల ఏండ్లకు పూర్వం ఏర్పాటుచేసినవి. స్టోన్ హెంజ్, అవెబ్యురీ ప్రాంతాల్లో కూడా ఇవే రకమైన నిలువురాళ్లు కనిపిస్తాయి. పైథాగరస్ సిద్ధాంతం గ్రహాంతరవాసులకు సంబంధించిన జియోమెట్రిని ప్రతిబింబిస్తున్నదనేది ఆస్ట్రోనాట్ శాస్త్రవేత్తల అభిప్రాయం. త్రికోణమైనా.. త్రిశూలమైనా.. త్రినామమైనా.. విశ్వ రహస్యాన్ని ఛేదించే ఉపకరణం. దేవతలు.. లేదా గ్రహాంతర వాసులకు.. మనుషులకు మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక. 17వ శతాబ్దంలో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ చలనగతికి సంబంధించి మూడు సూత్రాలు ప్రకటించాడు. ఈ సూత్రాల ప్రకారం కూడా అన్ని శక్తులు రెండుగా ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో మిగతా శక్తుల చలనం ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా రాకెట్‌ను తీసుకోవచ్చు. ఊర్థ్వముఖంగా పయనించే చైతన్య ప్రసారమే త్రికోణం. ఈ త్రికోణంలో ఊర్థ్వముఖంలోని శిఖరం మహాశివుడు. మిగతా రెండు కోణాలు బ్రహ్మ విష్ణులు. ఈ మూడు దైవ శక్తులు ఒకదానిపై ఒకటి ఆధారభూతాలు. వినాశనం లేకుండా సృష్టి జరుగదు. దాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. ఈ వినాశనానికి ఆధారమైన శక్తి మహాదేవుడు. ఆయన చేతిలో త్రిశూలం ఉన్నది. ఆయన భృకుటిలో త్రినేత్రం ఉన్నది. ఇవి రెండూ ఊర్థ్వముఖంగా ఉంటాయి. మానవ శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు శివుడి త్రిశూలానికి ప్రతీకలు. కుండలిని యోగసాధన ద్వారా మనలోని జీవచైతన్య ప్రసారం ఊర్థ్వముఖంగా సుషుమ్న ద్వారానే జరుగుతుంది. ఈ సుషుమ్న త్రికోణంలోని శిఖరం. ఆ శిఖరం పేరు ఈశ్వరుడు. పరమేశ్వరుడు. త్రినేత్రం విషయంలో ఒక చర్చ చాలా కాలంగా జరుగుతున్నది. మన మేధస్సులోని పీనియల్ గ్లాండ్ త్రినేత్రానికి ప్రతీకగా చెప్తారు. పీనియల్ గ్లాండ్ మనలోని చైతన్యానికి.. అస్తిత్వ వికాసానికి ప్రతీక. చీకటిలోంచి వెలుతురు ప్రసరించినట్లు.. ఈ గ్లాండ్ నుంచి శరీరంలోని అన్ని భాగాలకు కాంతి ప్రసారం జరుగుతుంది. శివుడి మూడో కన్ను నుంచి కూడా అనంతమైన కాంతి ప్రసారం సమస్త విశ్వాన్ని భస్మరాశిగా మారుస్తుంది. మన శరీరంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలు మూడున్నాయి. ఈ మూడు జీవశక్తికి అత్యంత ప్రధానమైనవి. ప్రాణమయానికి అధిదేవత శివుడు. ప్రాణం నుంచే సమస్త ప్రాణులూ పుడుతున్నాయి. ప్రాణముచేతనే జీవితం సాగిస్తున్నాయి. చివరకు ఆ ప్రాణంలోనే మరణిస్తున్నాయి. ఈ జీవశక్తిలోని ప్రాధాన్యానికి కూడా మూడు అంకే కీలకం కావడం విశేషం. పై లోకాలలో ఉన్న శివుడు భూమ్మీద ఉన్న మనుషులకు సర్వం తానే అయి నిలిచాడు. నిలుస్తున్నాడు. మన నమస్కారంలోని త్రికోణమితి ఆ ఈశ్వరుడి కోసమే. పిరమిడ్‌లోని త్రికోణం ఆ దేవదేవుడికి పంపించే సందేశమే. ఊర్థ్వలోకాలకు భూమి నుంచి జరిగే చైతన్య ప్రసారానికి మూడు ఒక ప్రతీక. అందుకు మనకు ప్రతిఫలం ఆ ఈశ్వరుడి నుంచి లభిస్తున్నది. మనకు అక్షరం ఆయన. ఆహారం ఆయన. ఆభరణం ఆయన. ఔషధం ఆయన. ఆనందం ఆయన.

***

వేదాలు రఫ్‌గా నాలుగువేల సంవత్సరాలకు పూర్వం రాశారని పాశ్చాత్య శాస్త్రవేత్తలు నమ్ముతారు. భారతీయులు మాత్రం తమ ధర్మానికి ప్రథమ విజ్ఞాన శాస్త్రాలుగా భావిస్తారు. వేల సంవత్సరాల నుంచి వేదాలు ఉన్నాయి. మౌఖికంగా ఒక తరం నుంచి మరో తరానికి వేద విజ్ఞానం బదిలీ అవుతూ వచ్చింది. ఈ విజ్ఞానం ప్రకారం ఆధునిక మానవుల ఉనికికి ముందు భూమ్మీద ఇతర లోకాల నుంచి అడుగు పెట్టిన దేవుడు శివుడే. ఎవరీ శివుడు. ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో ఎన్కి, ఓడిన్, జ్యూస్, విరాకోచ, క్వెట్జాల్‌కోటి, కుకుల్కాన్ వంటి దైవరూపాలు ఉన్నాయి. ఈ రూపాలన్నీ కూడా.. ఆయా సంప్రదాయాల్లో సృష్టిలయలకు అధిష్ఠానదేవతలుగా కొలుస్తారు. ఈ శివుడే.. ఆయా సంస్కృతుల్లోని దేవతల రూపాలా? అంటే అవుననే ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బైబిల్ సంబంధమైన సంప్రదాయాలు ప్రారంభం కావడానికి వేల ఏండ్లనాడే మానవుడి సముద్ధరణకు దిగివచ్చిన ఈశ్వరుడు మహాదేవుడు. ఆధునిక సృష్టికి ముందు ప్రళయాన్ని సృష్టించిన లయకారుడు ఈశ్వరుడు. ఈ ప్రళయం అన్న మాట కేవలం భారతీయ ధర్మానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్కృతులు, ధర్మాలు.. అన్ని రకాలైన ప్రాచీన రచనలు, డాక్యుమెంట్లు.. మౌఖిక సాహిత్యం అన్నింటిలోనూ ఏదో ఒక విధంగా ప్రళయం (కొందరు గ్రేట్ ఫ్లడ్ అన్నారు) ప్రస్తావన.. చర్చ ఉన్నది. ఈ ప్రళయం అన్నది మహా శక్తిమంతమైనదని ఒకే ఒక్కరోజులో ఈ ప్రళయం భూమిని తుడిచిపెట్టేస్తుందని చెప్పినవే. భారతీయ ధర్మం ప్రకారం శివుడు చేసిందీ.. చేస్తున్నదీ.. చేసేదీ ఇదే. టిబెటన్ లామాల బోధనల ప్రకారం ప్రళయం లేదా గ్రేట్ ఫ్లడ్ ద్వారా భూమి అంతా జలసమాధిలో మునిగిపోతుంది. కొంతకాలానికి నీరు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తిరిగి జీవజాల సృష్టికి శివుడు బీజం వేస్తాడు. శివుడు కాస్మిక్ పవర్. ఆధునిక మానవ జీవనానికి పైలోకాల నుంచి దిగివచ్చిన దివ్య పురుషుడు. ప్రాచీన ఆస్ట్రోనాట్ థియరిస్టులు కూడా ఈ అభిప్రాయాన్ని ధ్రువీకరిస్తున్నారు.

ప్రళయం

పునఃసృష్టికి ముందు లయకారుడైన శివుడు ప్రళయాన్ని సృష్టిస్తాడు. ఆ ప్రళయానికి సమస్త విశ్వం జలసమాధి అవుతుంది. ప్రళయం రావటం అనేది నిజమేనా? దీనికి ఆధారాలు ఏమున్నాయి? ఒకవేళ ప్రళయం వస్తే అది శివుడి వల్లనే జరిగిందా? అట్లాంటిస్ మహానగరం ఎలా మునిగిపోయింది? ద్వారక సముద్రగర్భంలో ఎలా కలిసిపోయింది? ఇదంతా మహాదేవుడి వల్లనే అయిందా? మెసపటోమియా నాగరికత అంతమైపోవడానికి ప్రళయమే కారణమా? పునఃసృష్టి చేయడానికి ప్రస్తుత సృష్టి అంతం కావలసిందేనా? దీన్ని భారతీయ గ్రంథాలే చెప్తున్నాయా? లేక ఇతర సంప్రదాయాల్లో కూడా ఉన్నాయా? లోతుగా పరిశీలిస్తే చాలా విషయాలు వెలుగుచూస్తున్నాయి. భారతీయ గ్రంథాల్లో మహాదేవుడు మహా ప్రళయాన్ని సృష్టించినప్పుడు సముద్రంలో వటపత్రశాయి మాత్రం మిగిలి ఉంటాడట. అబ్రహం లేదా ఇబ్రహీం ధర్మావలంబులు నోవాను విశ్వసిస్తారు. దేవుడు మహాప్రళయాన్ని సృష్టించినప్పుడు నోవా ఒక పడవను తీసుకొని వచ్చి మంచి మనుషులను రక్షిస్తాడట. ఇస్లాం, క్రిస్టియన్ సంప్రదాయాలు ఈ అంశాన్ని బలంగా విశ్వసిస్తాయి. కొన్ని సంప్రదాయాల్లో మానవ ప్రపంచాన్ని శిక్షించడానికి దేవుడు ప్రళయాన్ని సృష్టిస్తాడని చెప్తారు. దేవుడి చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఈ మహా విధ్వంసం సంభవిస్తుందంటారు. మనం మహాదేవుడిని ప్రళయకారుడిగా విశ్వసిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1200 సంస్కృతులు ప్రళయం వచ్చిందని.. వస్తుందని నమ్ముతున్నాయి. ప్రముఖ గ్రీకు తత్వవేత్త ప్లేటో రచనల్లో ఈ ప్రళయాన్ని గ్రీకు దేవుడు జ్యూస్ సృష్టించాడని పేర్కొన్నాడు. ఈ దేవుడి చేతిలోనూ త్రిశూలం వంటి ఆయుధం ఉంటుంది. ఇతను అపరిమితమైన విద్యుత్ శక్తికి అంటే ఫైర్‌కు అధిదేవత. ఈయనే శివుడా.. శివుడే ఈయనా? వేర్వేరు సంప్రదాయాల్లో పేర్కొన్న దేవుళ్లు శివుడికి ప్రత్యామ్నాయ రూపాలేనా? అని అంటే అవుననే చెప్పాలి. ఇన్ని సంప్రదాయాల్లో ప్రచారంలో ఉన్న కథనాలు కేవలం ఊహించి రాసినవి కావని చాలా మంది ఆంత్రోపాలజిస్టులు చెప్తారు. ఇవన్నీ ఏదో ఒకచోట సంభవించిన దానిని బట్టే వచ్చినవని వారి బలమైన విశ్వాసం.

ప్రళయం నిజంగా సంభవించిందా? లేదా? మహాదేవుడి మహావినాశనానికి పాల్పడ్డాడా? లేదా? అన్న అంశాన్ని తేల్చడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. హెూలోక్ ఇంపాక్ట్ (అత్యంత నూతన యుగం)పై పరిశోధించడానికి ఐదుగురు శాస్త్రవేత్తలు హిందూ మహాసముద్రంలో శోధన మొదలుపెట్టారు. వేల సంవత్సరాలకు ముందు భూమిపై పెద్ద సంఖ్యలో ఆస్టరాయిడ్ దాడి జరిగిందని కనుగొన్నారు. ఆ ఆస్టరాయిడ్ దాడులతో అసంఖ్యాకంగా సునామీలు వచ్చి భూమిపై నాగరికతల నాశనానికి కారణమయ్యాయని అభిప్రాయపడ్డారు. ఈ మహా ఆస్టరాయిడ్ దాడి మెడగాస్కర్ దీవికి పశ్చిమం వైపు హిందూ మహాసముద్ర గర్భంలో 18 మైళ్ల వెడల్పు ఉన్న ఒక అతి భారీ బిలాన్ని ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేకాదు మెడగాస్కర్, ఆస్ట్రేలియా మధ్యన పెద్దసంఖ్యలో శిలాజాలు, అవక్షేపాలు వీరికి కనిపించాయి. సముద్రగర్భంలో జలజీవులే కాకుండా ఇతర జీవుల శిలాజాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అత్యధిక వేడిమి కలిగిన రాయి ద్రవీభవనం చెందింది. ఇలాంటి శిలాజాలు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయి. బొలీవియా దేశంలోని పుమాపును దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి శిలాజాలే మనకు దర్శనమిస్తాయి. వేల సంవత్సరాల క్రితం మహాదేవుడు చేసిన కాస్మిక్ వార్ కారణంగా సంభవించిన ప్రళయం వల్లనే ఇదంతా జరిగిందని హెూలోసిక్ ఇంపాక్ట్ శాస్త్రవేత్తలు చెప్తారు. దేవతలు మానవ సమాజంపై పెద్ద సంఖ్యలో జరిపిన బాంబర్లు (ఆస్టరాయిడ్స్) కురిపించారని దానివల్ల వచ్చిన ప్రళయానికి డైనోసార్ల జాతి నాశనమైందని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. ఒక్కొక్క ఆస్టరాయిడ్ కనీసం ఎనిమిది మైళ్ల విస్తీర్ణమున్న అతి పెద్దది. దీని శక్తి హిరోషిమాలో జరిగిన అణ్వస్త్ర శక్తికంటే అయిదు బిలియన్ రెట్లు ఎక్కువ. బైబిల్ కూడా ప్రళయం అనేది 40 రోజులు, 40 రాత్రులు కొనసాగుతుందని చెప్తుంది. ప్రళయానికి ముందు ఆస్టరాయిడ్ల ద్వారా పెద్ద ఎత్తున అగ్నిజ్వాలలు రేగుతాయని, ప్రపంచమంతా బూడిద కమ్ముకుంటుందని హెూలోసిక్ ఇంపాక్ట్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

బెల్జియంలోని మెల్ పట్టణంలో ఆండ్ర్యూ కోలిన్స్, మరో పురాతత్వ శాస్త్రవేత్త ఫెర్దీ గీర్ట్స్ ఒక అంతుపట్టని నల్లని భూమి పొరను కనుగొన్నారు. స్థానిక మైనింగ్ కంపెనీకి చెందిన భూభాగంలో జరిపిన తవ్వకాల్లో మూడు నాలుగు అడుగుల లోతున ఈ నల్లని భూమి పొర కనిపించింది. కోలిన్స్, గీర్ట్స్ దీనిపై మరింత లోతుగా పరిశోధన చేశారు. ఆ తర్వాత ఈ భూమిపొర ఐసేజ్ ముగిసిన కాలం నాటిదని నిర్ధారించారు. సుమారు 13వేల సంవత్సరాలకు పూర్వమైనదిగా భావించారు. డచ్‌లోని యుస్సెల్ హారిజాన్ లేయర్‌ను ఇక్కడి నల్లని భూమిపోలి ఉన్నది. గీర్ట్స్ కథనం ప్రకారం వేల ఏండ్ల క్రితం సంభవించిన భారీ జలవిపత్తు వల్లనే ఈ భూమి ఇలా మారిపోయింది. ఇంత పెద్ద విలయాన్ని నిస్సందేహంగా ఇతరలోకాల నుంచి ఎవరో చేశారని ఈ ఇద్దరు పరిశోధకులు చెప్పారు. ఈ విలయకారుడిని మనవాళ్లు మహాదేవుడిగా గుర్తించారు. త్రిమూర్తి తత్వంలో మూడో తత్వంగా ఈ లయ విన్యాసాన్ని గుర్తెరిగారు.

2014 అక్టోబర్లో అమెరికాలోని మేరీలాండ్లో అంతర్జాతీయ ఆస్టరాయిడ్ ఇంపాక్ట్ వర్క్‌షాప్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ శాస్త్రవేత్తలంతా హాజరయ్యారు. ఈ వర్క్‌షాప్ మొత్తం ఆధునిక పరిజ్ఞానం ప్రకారం ఆస్టరాయిడ్లు ఢీకొనడం.. వాటి వేగ తీవ్రతను చర్చించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఒక ఆస్టరాయిడ్ వేగం ఏకే-47 బుల్లెట్ కంటే 9రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

ఇక మన దేశానికి వద్దాం. పశ్చిమాన అరేబియా సముద్రతీరంలో కాంబే ద్వీపకల్పం ఉన్నది. గుజరాత్ రాష్ట్రంలోని కాంబే సుమారు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో త్రికోణాకృతిలో ఉంటుంది. ఈ ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో పరిశోధనలు ప్రారంభించారు. భూ ఉపరితలానికి 125 అడుగుల లోపల అసాధారణ రీతిలో ప్రాచీన నాగరికత ఆనవాళ్లు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో రెండు నగరాలను కనుగొన్నారు. ఈ నగరాలకు సంబంధించిన పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. భూమిపై అసాధారణ భౌగోళిక మార్పు సంభవించిన సమయంలో ఈ నగరాలు విధ్వంసం అయి ఉండవచ్చని వీరు భావిస్తున్నారు. ఈ నగరాలు కనీసం తొమ్మిదివేల సంవత్సరాలకు పూర్వమైనవేనని నిర్ధారిస్తున్నారు. ఈ నగరాలు ఒకప్పుడు జరిగిందని భావిస్తున్న ప్రళయ ప్రభావానికి గురైనవేనా? అన్నది ఆస్ట్రోనాట్ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇంతెందుకు ప్రపంచంలో అతి గొప్ప నాగరికత కలిగిన తొలి నగరంగా ప్రసిద్ధి చెందిన అట్లాంటిస్ క్రీస్తుకు పూర్వం 9600 సంవత్సరాలకు పూర్వం ఉన్న ఈ మహానగరం ప్రళయం కారణంగా ధ్వంసం అయింది. చివరి ఐసేజ్ అనంతరం కలిగిన ప్రకృతి విపత్తే మహా ప్రళయం.

వీటన్నింటినీ గమనిస్తే.. మానవ నాగరికత వేల ఏండ్ల నాడే మహా ప్రళయం వల్ల నాశనమైందని తెలుస్తుంది. సుమారు పదివేల సంవత్సరాల క్రితం వరకు మళ్లీ మానవ నాగరిక సమాజాలు అభివృద్ధి చెందేంతవరకు భూమిపై ఏమీ లేదనే భావించాలి. ఇప్పటికీ మనం సునామీల ప్రభావాన్ని, మహా మానవ హననాన్ని కండ్లారా చూస్తున్నాం. ఈ లయ విన్యాసానికి అధినాయకుడే మహాదేవుడు. లయకారుడు. సృష్టి నిర్వహణ కార్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నవాడు.

శివుడు అసత్యం కాదు. మిథ్య ఎంతమాత్రం కాదు. అన్నింటికీ మించిన నిజం. మహాప్రళయానంతరం మానవులకు, నాగరికత వికాసానికి గొప్ప మార్గం చూపించిన ఈశ్వరుడు. బొమ్మలో.. దేవాలయాల్లోని గోడలపై శిల్పాలో లేక ఆధ్యాత్మిక గ్రంథాలు అబద్ధం చెప్పవచ్చేమో.. కానీ అసాధారణమైన శక్తి… దాన్ని వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్న మానవజాతి.. నక్షత్రాలవైపు సాగుతున్న మన ప్రయాణాలు అబద్ధం చెప్పవు కదా.. ఓం నమః శివాయ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here