విలోమ ప్రేమ

3
12

[dropcap]వా[/dropcap]డెప్పుడూ అంతే –
కస్సు బుస్సులాడుతుంటాడు
తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు
చిర్రు బుర్రులాడుతుంటాడు!
అసహనంతో అరుస్తుంటాడు!

మనసులో అతి ప్రేమను కూడా
ద్వేషంగానే వ్యక్తపరుస్తుంటాడు!
ఏ విషయానికీ సానుకూలంగా స్పందించడు
పాజిటివ్ థాట్‍ను కూడా
నెగటివ్ మూడ్‍లోనే చెబుతాడు!
అన్నీ అపసవ్య సమాధానాలే!
అన్నీ అపహాస్యాలే!

అంతా విరోధాభాసే!
అంతా విలోమ భాషే!
అతనిది అదో స్టైల్
అతనిది అదో స్మైల్

నవ్వనేది ఆ మోములో
ఒన్స్ ఇన్ ఎ బ్లూ మూన్!
కోపం ఎక్కువైతే అర్ధాయుష్కుడౌతాడని
వాడికెలా వివరించాలి!
మనసు మంచిదే, గుణం మార్చుకోమని
ఎలా చెప్పాలి!

అతన్ని అర్థం చేసుకొనేవారు తక్కువ
అపార్థం చేసుకొనేవారే ఎక్కువ
అందుకే – అందరికీ విరోధిగానే కనిపిస్తాడు
ఒంటరిగానే మిగిలిపోతుంటాడు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here