విమాన ప్రయాణం

0
6

[dropcap]ఆ[/dropcap]కాశంలో ఎగిరే పక్షులు ఎంతో అదృష్టం పెట్టి పుట్టాయి, కావలసిన చోటికి ఎగిరి వెళ్ళి పోతాయి. మనిషి వెళ్లాలంటే విమానంలో ఎన్ని హంగులు ఆర్భాటాలు కావాలి? పరిస్థితులు అనుకూలించాకా మానవుడికి ఎన్నో రకాల వాహన సౌకర్యాలు. అందులో అతి తొందరగా వెళ్ళడానికి విమానం ముఖ్య సాధనము.

సూర్య కిరణాలు మేఘాలు నిండా పరచుకుని ఆహ్లాదంగా ఉన్నయి. ప్రకృతి కాన్వాస్‌లో భగవంతుని సృష్టి అద్భుతము. మేఘాలు, పచ్చికలు, కొండలు, వాగులు, గుట్టలు, సెలయ్యేళ్లు ప్రకృతి చూసి ఆనందించడం వరము. ప్రయాణం ఎప్పుడు ఆనందకరమే. అందులో విమాన ప్రయాణాలు మేఘాల మధ్య ఉన్నతంగా ఆకర్షణీయంగా ఉండి ఆహ్లాదాన్ని కల్గిస్తాయి

ఢిల్లీలో ప్రభుత్వం వారి అవార్డు తీసుకోవడానికి డాక్టర్ శ్రీనిజ రాజమండ్రి నుంచి విమానం ఎక్కింది. ఆప్తులు సన్నిహితులు ఆమెకు వీడ్కోలు చెప్పారు.

ఆమె ఒక సంఘసేవిక. ఎందరికో దారి చూపించిన వ్యక్తి, ఆమె కూడా అక్క కూతురు ఉంది. ఇద్దరు కలిసి ఒక వారం రోజులు అక్కడ ఉన్న కజిన్ ఇంట్లో ఉండాలి అని ప్లాన్ చేసుకున్నారు

ఆకాశంలో మూడు గంటలు ప్రతేక అనుభూతి చెందుతూ, మౌనంగా ఉండి ప్రకృతి అందాలు కిటికీ గుండా కొంత సేపు చూడాలని ఉన్న ఏర్ హోస్టెస్ సలహా సూచనలు పాటిస్తూ తమ ప్రయాణం చేశారు.

కిందికి దిగుతున్నట్లుగా అనుభూతి కలిగింది అప్పుడే డిల్లీ వచ్చేశాము అనుకున్నారు

ఏర్ ఇండియా వారి స్వాగతలు స్వీకరించి బయటకు వచ్చారు. అక్కడ మరో అక్క కూతురు, అన్న కూతురు వచ్చి ఉన్నారు. అంతా మహిళా సామ్రాజ్యంలా ఉన్నది. వాళ్ళు ఇద్దరు మంచి కంపెనీలలో సీ.ఈ.ఓ గా చేస్తున్నారు వారి కూడా వారి పిల్లలు వచ్చివున్నరు. అంతా కలసి బి.ఎం.డబ్లు కారులో వచ్చారు. భర్తలు మినిస్ట్రీ లో పని చేస్తున్నారు. పిల్లలు కూడా మెడిసిన్ చేస్తున్నారు. అంతా విద్యావంతుల కుటుంబము.

ఇంట్లో డెభై ఏళ్ల అత్త గారు ఉన్నారు. ఆవిడకు ఇంట్లో ఒక మనిషిని పెట్టి ఉంచారు. సెలవుల్లో అత్తగారు బాధ్యత చూస్తారు. కారు మెత్తని రోడ్డుపై పోతోంది. రివ్వున వీచే గాలిని ఆస్వాదిస్తున్నారు. ఎంతో రమ్యంగా ఉంది. అటు ఇటు మొక్కలు గార్డెన్ కంటే బాగా పెంచి ఉన్నాయి.

ఎంతైనా రాజధాని కదా, ఆ తరహా ప్రకృతి అక్కడ ప్రతిబింబిస్తుంది. కార్ డోర్ వేసిన సరే చలిగాలి వస్తోంది. స్వెట్టర్ పై శాల్ వేసుకుని కూర్చున్న ఏదో తెలియని అద్భుత అనుభూతి. అక్కడి గాలి ప్రకృతి అంతా కూడా ఎంతో కవుల కలాలకు అందని రమ్యత. డాక్టర్ శ్రీనిజ స్వతహాగా ప్రకృతి అరాధకురాలు. సరోజినీ నాయుడు కవితలు అన్నా, వర్డ్స్‌వర్త్ కవిత లన్నా ఎంతో ఇష్టం. అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతి వ్యక్తిలో భావుకత పెంచుతుంది కథలు రాసే అలవాటు నిస్తుంది. సంగీతం పాడటం వినడం కూడా ఎంతో ఇష్టం. అందుకే కవులు ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళి గ్రంథ రచనలు చేస్తారు. కవికి ప్రకృతి అంతా పరిశోధనాత్మకమే. ప్రతి వస్తువులో వారి సృజన ఉంటుంది.

ప్రకృతి అంతా చూపిస్తూ మూడు గంటల ప్రయాణం కారులో సాగింది. విమానం కంటే ఎక్కువ టైమ్ కారులో సరిపోయింది. అయితే డిల్లీ అందాలు అన్ని చూస్తూ ఆనందిస్తూ ఎన్నో వింతలు విశేషాలు చూస్తూ పరుగు పెట్టింది. విమానం వేగం కంటే మనసు వేగం ఎక్కువగా ఉంది.

కారు పెద్ద గేటు దాటుకుని లోపలికి వచ్చింది. అక్కడ బహుళ అంతస్తుల భవనాలు చాలా అందంగా నిర్మించబడి ఉన్నాయి. చాలా ఆధునికంగా అత్యాధునికముగా ఉన్నాయి. ఇక్కడ అందమైన మొక్కలు, పువ్వులు విరగ బూసి ఉన్నాయి. ప్రతి పువ్వు ఆకు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి పులకిస్తున్నట్లు స్వాగతం పలుకుతున్నట్లు అక్కడి వాతావరణం ఉంది. ఇలాంటి సిటీలో బ్రతకాలంటే చాలా డబ్బు కావాలి. అక్కడ జీవన సరళి వేరు. అంతా మంచు కమ్మి మసకగా ఉంది.

పట్ట పగలు కూడా మాల్స్ అన్ని దీపాల అలంకరణతో నిండి ఉండి, ఆకాశం వచ్చి భూమిపై పరచుకుందా అనే ఆలోచన వస్తుంది. మన పురాణం లోని మయసభ జ్ఞాపకం వస్తోంది. ఎంత మార్పు ఎంత విజ్ఞానము, మానవ ప్రగతి అనుకుంది.

పగలు రాత్రి తేడ తెలియకుండా విద్యుత్ దీపాలు. అటు విమానాశ్రయం ఇటు సిటీ అంతా కూడా వెలిగి పోతున్నాయి.

మన వాళ్లకి నచ్చేలా దొండకాయ గుత్తి కూర, కొబ్బరి పచ్చడి, బంగళా దుంప కూర వండించి, ఆవడ, రవ్వ కేసరి చేయించింది. ఒంటి గంట ప్రాంతంలో ఆడవాళ్ళు అంతా కల్సి భోజనం చేశారు. మగవాళ్ళు పగలు క్యాంటీన్లో తింటారు. “ఆంటీ, ప్రయాణం చేసి వచ్చారు, పడుకొండీ కాసేపు” అంటూ రూంలోకి తీసుకెళ్లింది.

పెద్ద గది. రూంలో హీటర్ ఉంది. మెత్తని పరుపు పెద్ద రగ్గు ఉన్నయి. గోడ టీవీ ఉంది. ఒక ప్రక్క కంప్యూటర్ ఉంది. వచ్చిన గెస్ట్‌కి అవసరం అయితే కంప్యూటర్ ఉంటుందని చెప్పింది. మన సామాన్య కుటుంబాలు పది బ్రతికే డబ్బుతో అక్కడ ఒక్క కుటుంబం బ్రతుకుతుంది. చలిగాలి తగిలి చేతులు నెప్పిగా అనిపించయి. ఈలోగా కర్చీఫ్ తీసుకుని చేతికి చుట్టుకుంది.

బ్యాగ్ లోంచి ఊల్ గ్లవుజులు తీసి ఇచ్చింది “అయ్యో మరచాను” అంటూ. వాళ్ళ కోట్లు, గ్లవుజులు, బూట్లు వేరే విధంగా ఉన్నాయి.

ఇంట్లో వంటకి మనిషి ఉంది. ఆమె వెళ్ళగానే వేడి టీ తెచ్చి ఇచ్చింది. ఆతరువాత కాసేపు ఏవో విషయాలు మాట్లాడుకున్నారు. అక్కడ అత్తగారు ఉంది, ఆమె మనిషికి చెప్పి అన్ని మన వంటలు చేయించి ఉంది. అత్తగారిలా కాక తల్లిలా చూసుకుంటుంది ఎందుకంటే ఆమెకు ఆడపిల్లలు లేరు. నలుగురు కోడళ్లను కూతురు మాదిరి చూసుకుంటుంది.

“నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో” అంటూ తను వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుంది. ఏవో లెక్కలు చూసుకుని వెళ్లిపోయింది.

డాక్టర్ శ్రీనిజకి బాగా నిద్ర పట్టేసింది. నాలుగు గంటల ప్రాంతంలో మెలుకువ వచ్చింది

“ఆంటీ లేచావా మనింటికి అతిథులు వస్తున్నారని మా ఆయన ఫోన్ చేశారు. మీరు అక్కడ మంచి సేవ కార్యక్రమాలు చేస్తున్నారని – గతంలో నువ్వు వస్తావని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి చూస్తా మన్నారు” అని చెబుతూ ఇంట్లోనే చిన్న సైజ్ మీటింగ్‍లా ఏర్పాటు చేసింది. అందరికీ రాత్రి అక్కడే డిన్నర్ అని కూడా పిలిచారు

శ్రీనిజ ఆశ్చర్య పోయింది సాయంత్రం అయ్యే కొద్ది చలి పెరిగిపోయింది. అయినా అక్కడ జీవన సరళి మామూలు గానే ఉన్నది. అక్కడి వాళ్ళు అక్కడి వాతావరణానికి అనుగుణంగా దుస్తులు ధరించి వచ్చారు. అడ మగ అంతా కలిపి పదిహేను మంది ఉన్నారు

శ్రీనిజ చక్కగా ఫ్రెష్ అయి గద్వాల్ చీర కట్టుకుంది. మెడలో ఎప్పుడు పగడాల దండ ఉంటుంది. పగడాల దుద్దులు, గాజులు పెట్టుకుంది. పగడం ధైర్యానికి ప్రతీక. కార్య శూరత్వం చూపుతుంది అందుకని పగడాలు పెట్టుకుంటుంది.

“ఆంటీ నువ్వు ఈ వయస్సులో ఇంత అందంగా ఉంటే యవ్వనంలో ఇంకెంత అందంగా ఉండి ఉంటావు కదా” అంటూ ఆనందంగా చెప్పింది.

“వ్యక్తి చేసే పనులు బట్టి వ్యక్తికి అందం అన్నది పెరుగుతుంది” అని శ్రీనిజ నవ్వింది. “కరెక్ట్ ఆంటీ” అని నవ్వింది.

ఈ లోగా వంట మనిషి “అమ్మ అన్నీ చేసి టేబుల్ పై సర్డుతాను” అని ప్లేట్స్ గ్లాసులు చెంచాలు కప్పులు అన్ని చక్కగా అమెర్చి వెళ్ళింది

“ఇంత పెద్ద సిటీలో నీకు మంచి మనిషి దొరికింది” అన్నది శ్రీనిజ. “నేను తగినట్టు చూస్తాను. తన పిల్లల చదువుకి హెల్ప్ చేస్తాను” అని చెప్పింది

వాళ్ళకి పుల్కాలు, కూర, స్వీట్, పెరుగు అన్నం చేశారు. ఫ్రూట్ జ్యూస్ పెట్టారు. వచ్చిన వాళ్ళల్లో కొంత మంది బోకేస్ తెచ్చి ఇచ్చారు. శ్రీనిజ చాలా సంతోషపడింది.

శ్రీ నిజ చేసిన సేవలు, అవార్డ్స్ విషయాలు అంతా సంతోషంగా మాట్లాడారు. వాళ్ళు అంతా కూడా కొంత వాళ్ళ దాతృత్వం చూపించడానికి ఎవరికి తోచిన అమౌంట్ వారు చెక్కుల్లో రాసి కవర్స్ అందించారు. శ్రీనిజ చాలా ఆనందపడింది.

అవార్డ్ విషయం అందరికీ చెప్పారు. అందరూ వారికి తోచిన రీతిలో అభినందనలు తెలిపారు. అందరూ చక్కగా మాట్లాడారు. శ్రీనిజ ఆంధ్ర నుంచి పూతరేకులు ఆత్రేయపురం తయారీవి పట్టుకెళ్ళింది. అవికూడా పార్టీలో వడ్డించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో అంతా వెళ్లారు.

మరునాడు అవార్డు ఫంక్షనుకు అక్క అల్లుళ్ళు కూడా సెలవు పెట్టుకుని వచ్చారు. ఆంధ్ర నుంచి శ్రీనిజ ఒక్కరే. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసి ఇచ్చారు. పత్రికల వాళ్ళు, ఛానెల్స్ వారు చుట్టుముట్టారు ఆంధ్ర నుంచి వచ్చినది శ్రీనిజ ఒక్కరే కనుక చాలా మంది తమ ఆసక్తిని వెల్లడించారు.

అప్పుడు శ్రీనిజ తన గురించి చెప్పింది. “మా తండ్రిగారు గొప్ప పండితుడు. ఆయనను అన్ని అవార్డ్స్ వరించాయి అయితే వాటిని ఆయన సామాన్యంగా స్వీకరించారు. వేదలపై అనువాదము చేశారు.. మేము చతుర్వేదముల వలే నలుగురు అక్క చెల్లెళ్ళము. అందరమూ పి.హెచ్.డీ.లు చేసాము. డబుల్ పి.జీలు చేసాము.. అందరం లెక్చరర్స్‌గా చేసాము. మేము మా కుటుంబాలతో పాటు సమాజ సేవ చేస్తున్నాము. నేను చిన్నతనం నుంచి నా స్నేహితుల్లో లేని పిల్లలకు పుస్తకాలు నోట్స్ ఇచ్చేదాన్ని. అప్పుడప్పుడు భోజనం తెచ్చుకొని వారికి నా క్యారేజ్‌లో అన్నం పెట్టేదాన్నీ. మా అమ్మ గారు ఎప్పుడు నేను తినేదాని కన్నా ఎక్కువ పెట్టి ఇచ్చి అవసరం అయిన నీ స్నేహితులకు పెట్టమని చెప్పేవారు. అలా బాల్యం నుంచి దయ దాతృత్వం వచ్చాయి. లేని పిల్లలకు చదువు చెప్పేదాన్ని. ప్రతి సెలవల్లో నాన్న గారు వెంట ఉండి అన్ని తెలుసుకునే దానిని. మా అక్క కుడా నాతో కలిసి మంచి సమాజ కార్యక్రమాలు చేసే వారము. అలా చిన్నతనం నుంచి కూడా సేవ ఇష్టంగా చేసేదాన్ని” అని చెప్పింది. “నా జీతంలో సగం సమాజ సేవకు అందించాను. కుటుంబ సభ్యులు కూడా అంగీకరించి నాతో కలిసి పని చేసేవారు..” అని చెప్పి నవ్వింది

చాలా గొప్ప విషయం అని పత్రికలు ఛానెల్ వారు అందరూ ఎంతో పొగిడారు. అందరూ ఆనందంగా ఇంటికి వచ్చారు. ఆంటీ ఉన్నంత కాలం సెలవు పెట్టి, అన్ని చూపిద్దము అన్నారు. సరేనని కుతుబ్ మీనార్, రెడ్ ఫోర్ట్, అక్బర్ ఫోర్ట్, రాష్ట్రపతి భవన్, తాజ్ మహల్ ఇత్యాది వన్ని చూపించారు. ముస్సోరి ప్రయాణం చేశారు అక్కడ కాశ్మీరీ వనితల వేషాలు వేసుకొని అంతా చక్కగా ఫోటోలు వీడియోలు చేశారు.

మూడువేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న గన్ హిల్‌కి రోపే వే లో వెళ్లి చూశారు. అబ్బ ఆ ప్రకృతి ఎంత అందంగా ఉంది! భగవంతుడా నీ సృష్టి అద్భుతం! అనుకుంది. ఒకప్రక్క కేమెల్ షేపులో రాయి ఉంది, దాన్ని కామెల్ రాక్ అన్నారు. మరో ప్రక్క కైలాస శిఖరం మానస సరోవరం గురించి అక్కడ మాట్లాడుకున్నారు. ఆ మొక్కలు పువ్వులు ఆ అందము ఆ అలంకారము ఎంతో బాగున్నాయి. ఇలా అక్కడ ప్రకృతిలో ఎన్నో విషయాలు తెలుసుకుని ఒక నవల రాయాలన్నది శ్రీనిజ సంకల్పము. అందరూ టూరిజం వారి ఆలోచనలు, చక్కగా అలంకరించిన విధానం ఎంతో బాగుంది అనుకున్నారు.

అంతా కలసి సుఖంగా ఇంటికి చేరారు. మర్నాడు బిర్లా టెంపుల్, లక్ష్మి నారాయణ మందిర్ చూపించారు. ఎన్నో మాల్స్ కన్నాట్ ప్లేస్‌లో వెళ్లి చూసి కొన్ని కొనుక్కుని తెచ్చారు.

మర్నాడు బయలుదేరి అంతా కలసి విమానాశ్రయానికి వచ్చారు. విమానం టైమ్ అనౌన్సర్ చెప్పగానే శ్రీనిజ లోపలికి వెళ్ళింది. కొంత సేపటిలో విమానం బయలుదేరింది. అంతా చెయ్యి ఊపి బయటకు వచ్చారు. సంతోషంగా ఉన్నారు. మధ్య మధ్యలో బంధువులు రావడం వారితో ఎంజాయ్ చెయ్యడం కూడా మనిషికి అవసరమే. యంత్రాల్లా నిరంతర ఉద్యోగాలు ఉపాధి చేసేవారికి ఇది ఒక ఆనంద సమయము.

విమానం రివ్వున ఆకాశంలోని మేఘాలను దూసుకుని ఆంధ్ర వేపు వెళ్ళింది. కార్లో వెడుతుంటే ప్రకృతి కడు రమ్యంగా ఉంది. ఆ మొక్కలు ఆ ప్రకృతి శోభ ఎంతో రమణీయంగా ఉన్నది.

ఫోన్‌లో శ్రీ అన్నమాచార్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు వింటూ కూర్చుంది

ఇట్టే విమానం ఎక్కినట్లు లేదు, మూడు గంటలు మూడు నిమిషాల్లో గడిచింది. రాజమండ్రి చేరింది. అంతా మళ్లీ అక్కడ వాళ్ళు కార్లో వచ్చి రిసీవ్ చేసుకుని నిడదవోలు ఆశ్రమానికి వెళ్లారు. అప్పటికే చాలా మంది గెస్ట్‌లు వచ్చి ఉన్నారు. మీటింగ్ ఏర్పాటు ఉంది. పుర ప్రముఖులు కూడా ఆవిడ సేవలను మెచ్చుకున్నారు. వృద్దులకు యువతకు కూడా ఆమె స్వయంగా ఎన్నో సహాయాలు చేశారు. యువ సేన ద్వారా సమాజ హిత కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ శ్రీనిజ ఎన్నో తరాలకు ఆదర్శంగా ఉన్నారు. అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here