విశాఖ సాహితి రామాయణ ప్రసంగాలు

0
9

[dropcap]వ[/dropcap]సంత నవరాత్రుల సందర్భంగా 14-04-2021 నుండి 21-04-2021 వరకు శ్రీమద్వాల్మీకి రామాయణం లోని బాలకాండము నుండి యుద్ధకాండము, శ్రీరామ పట్టాభిషేకము, చివరి రోజు శ్రీరాము నవమి నాడు సీతారామ కల్యాణం అనే అంశాలపై వరుసగా ఎనిమిది రోజులు విశాఖ సాహితి ఆధ్వర్యంలో ప్రసంగ కార్యక్రమాలు జరిగినవి.

అంతర్జాల మాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో, విశాఖపట్నం నుంచి ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, డా.దామెర వెంకట సూర్యారావు, ఆచార్య కోలవెన్ను పాండు రంగ విఠల్ మూర్తి, డా. కందాళ కనకమహాలక్ష్మి, ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారలు, విజయవాడ నుంచి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి, తిరుపతి నుంచి డా. ఆకెళ్ళ విభీషణ శర్మ గారలు, చికాగో, అమెరికా నుంచి డా. శారదాపూర్ణ శొంఠి గారు తమ హృదయరంజకమైన ప్రసంగాలతో అందరినీ అలరించారు.

విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతలో జరిగిన ఈ సభలలో డా. రేవూరు అనంత పద్మనాభ రావుగారు, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు వంటి ప్రముఖులే గాక దేశ విదేశాల నుంచి అనేకమంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, రామ భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభలను విజయవంతం చేసారు. విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం గారు సమన్వయకర్తగా వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here