[జూన్ 24 ప్రముఖ స్వరకర్త ఎమ్.ఎస్. విశ్వనాదన్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ రోచిష్మాన్.]
[dropcap]సి[/dropcap]నిమా సంగీత దర్శకుడు ఎమ్.ఎస్. విశ్వనాదన్ పుట్టిన రోజు 24/6.
భారతదేశ చలనచిత్ర సంగీత దర్శకుల్లో పుష్కలమైన సృజనాత్మకత ఉన్నవారు ఎమ్.ఎస్. విశ్వనాదన్. ఆయన ఒక visionary music composer. ఆయన ప్రదర్శించిన వైవిధ్యం దేశంలో మఱో సినిమా సంగీత దర్శకుడు ఇవ్వలేదు. తనను తాను మార్చుకుంటూ నాలుగు దశాబ్దుల కాలం పాటు వైవిధ్యవంతమైన సంగీతాన్ని చేశారు.
High stratum of aesthetic sense and creativityలతో ఆయన ఎన్నెన్నో పాటలు చేశారు. Musical gap, relief-note, bridge passages, leading notesతో విశేషమైన సౌందర్యాన్ని సాధిస్తూ అద్భుతమైన పాటల్ని చేశారు విశ్వనాదన్. పాటల్లో విలంబం అన్నదాన్ని అత్యంత గొప్పగా పొందుపఱిచేవారు విశ్వనాదన్. ఆయన చేసిన మహోన్నత స్థాయి పాటలు దేశంలోనే అరుదుగా వచ్చాయి.
చండీరాణి సినిమాలోని “ఓ జాబిలీ ఓ తారకా…” పాట మట్టు (బాణి) సుబ్బురామన్‌ది అయితే వాద్య సంగీతం విశ్వనాదన్‌దే. 1956లో వచ్చిన తెనాలి రామకృష్ణ సినిమాకు సంగీతం చేసిన విశ్వనాదన్ ఒక మలయాళీ అయుండీ తెలుగు పద్యాలకు సంగీతం చెయ్యడం విశేషం.
ఇళయరాజా, ఎ.ఆర్. రెహ్మాన్ లకు ఆదర్శం ఎమ్. ఎస్. విశ్వనాథన్. ఆయన వేసిన బాటలోనే ఈ ఇద్దఱూ అత్యంత గొప్ప సంగీతాన్ని సృజించారు.
విశ్వనాదన్ పాటలు ఆధారంగా ఇళయరాజా కొన్ని పాటలు చేశారు. ఇళయరాజా చేసిన “జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…” పాటకు ఆధారం ఓ విశ్వనాదన్ పాట. దేశాన్నే అలరించిన, అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన ఎ.ఆర్. రహ్మాన్ పాట “చిన్ని, చిన్ని ఆశ” పాటకు మూలం విశ్వనాథన్ పాటే. సత్తెకాలపు సత్తెయ్య సినిమాలో పీ.బీ. శ్రీనివాస్ పాడిన “ముద్దుముద్దు నవ్వు…” పాట అది.
“నిలవే ఎన్నిడమ్ నెరుఙాదే…” చేశారు. (ఇది తెలుగులో ఘంటసాల పాడిన “మంటలు రేపే నెలరాజా..” పాట; సినిమా: రాము) గజలియత్‌తో ఉదాత్తంగా పాడారు పీ.బీ. శ్రీనివాస్. గానం పరంగా దక్షిణ భారత దేశంలోని ప్రముఖ గాయకులు కె.జే. ఏసుదాస్, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ఆపై ఇతర గాయకుల్ని ప్రభావితం చేసిన పాట అది. ప్రముఖ గజల్ గాయకుడు గులామ్ అలీ మద్రాస్ (చెన్నై) పర్యటనకు వచ్చినప్పుడు విని తన గజల్ కచేరీలో ఆ తమిళ్ష్ పాటను పాడారు. విశ్వనాదన్ ఏ మేరకు గజలియత్‌కు రూపకల్పన చేశారో ఆ పాటను గులామ్ అలీ పాడడం తెలియజేస్తోంది.
ఇంటీకి దీపం ఇల్లాలే సినిమాలోని “నీవే నీవే..” పాట తెలుగు సినిమాల్లో వచ్చిన ఉన్నతస్థాయి పాటల్లో ఒకటి. డబ్బింగ్ సినిమా కర్ణలోని పాటలు తెలుగుకు బాగా తెలిసినవే. మహోన్నతమైంది ఈ కర్ణ సినిమా సంగీతం. విశ్వనాదన్ ముందుగా తమిళ్ష్‌లో చేసిన ఓ పాట “రేపంటి రూపం కంటి పూవింటి…” పాటగా తెలుగు ఇంటి అభిమానాన్ని అందుకుంది. మనసే మందిరం, ప్రేమించి చూడు, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, అంతులేని కథ వంటి రీమేక్ సినిమాల్లో పాటలు తెలుగులో ఎంతో జనరంజకమయ్యాయి. రక్తసంబంధం సినిమాలోని “చందురుని మించి అందమొలికించు ముద్దు పాపాయివే…” పాట తెలుగులో ఘంటసాల పేరుతో ఉంది. ఈ పాట విశ్వనాదన్ తమిళ్ష్‌లో చేసిందే. ఈ పాట విశ్వనాదన్ కన్నతల్లికి చాల ఇష్టమైన పాట. మరో చరిత్ర సినిమా పాటలు నాణ్యత పరంగా మేలైనవై జనరంజకమూ అయ్యాయి.
పెండ్యాల వంటి వారు విశ్వనాదన్ ప్రభావంతో సంగీతం చేశారు. బందిపోటు దొంగలు సినిమాలో పెండ్యాల చేసిన “విన్నానులే ప్రియా…” పాటకు స్ఫూర్తి, ప్రేరణ విశ్వనాదన్ చేసిన ఒక తమిళ్ష్ పాట.
ఎమ్. ఎస్. విశ్వనాదన్ – రామమూర్తి ద్వయంగా మొదటి సినిమా పణం అన్న తమిళ్ సినిమా, 1952లో విడుదలయింది. అంతకు మునుపు ఎస్. ఎమ్. సుబ్బయ్యనాయుడు పేరుపై వచ్చిన హిట్ పాటలు కొన్ని విశ్వనాదన్ చేశారు అప్పటికి రామమూర్తి కలవలేదు. 1953లో విడుదలయిన జెనోవా విశ్వనాదన్-రామమూర్తి తొలి సినిమా అని కొన్ని చోట్ల చెప్పబడింది; అది సరికాదు. జెనోవా సినిమాకు విశ్వనాదన్, జ్ఞానమణి, కళ్యాణం ఈ ముగ్గురూ సంగీతం చేశారు. ఈ సినిమాలో రామమూర్తి లేరు. 1954లో వచ్చిన వైరమాలై సినిమాలో దక్షిణాది సినిమా పాటల్లో ఒక కొత్త flavorతో విశ్వనాదన్ “వన్‌జమిదో వాన్‌జై ఇదో…”, “కూవామల్ కూవుం కోగిలం…” పాటల్ని చేశారు. 1957లో వచ్చిన పుదయల్ అనే తమిళ సినిమాలో “విణ్ణోడుమ్ ముగిలోడుమ్ విళైయాడుమ్ వెణ్ణిలవే…” అన్న అద్భుతమైన పాట చేశారు విశ్వనాదన్. ఇది దక్షిణాది సినిమాలో వచ్చిన తొలి exotic పాట. 1958లో వచ్చిన మాలైయిట్ట మంగై సినిమాతో విశ్వనాథన్ (రామమూర్తి) ఊపందుకున్నారు. 1959 నుంచి విశ్వనాథన్ యుగం మొదలయింది. 1997 వఱకూ ఉన్నతమైన పాటలు చేశారు. విశ్వనాదన్ – రామమూర్తి ద్వయంలో విశ్వనాదనే 95% సంగీతం చేసేవారు. రామమూర్తి చేసింది పెద్దగా లేదు. 1965 నుంచీ విశ్వనాదన్ తన పేరుతోనే సంగీతం చేశారు. విశ్వనాదన్ 2004-2005 వఱకూ కూడా ఆయన సినిమాలు చేశారు. విశ్వనాదన్ దాదాపుగా 800 సినిమాలకు సంగీతం చేశారు అని తమిళ్ష్ సినిమా చరిత్రకారుడు వామనన్ తెలియజేస్తున్నారు. ఎమ్.ఎస్. విశ్వనాదన్ కాలం 24/6/1928 – 14/7/2015.
విశ్వనాదన్ చేసినన్ని flavors తో సినిమా పాటల్ని దేశంలో మఱొకరు చెయ్యలేదు. ఉచ్చస్థాయి aesthetic sense, సృజనాత్మకతలతో విశ్వనాదన్ భారతదేశంలోని అత్యున్నతమైన చలనచిత్ర సంగీత దర్శకుల్లో ఒకరు. దక్షిణాది చలనచిత్ర సంగీత చరిత్ర ఎమ్. ఎస్. విశ్వనాదన్‌కు ముందు తరువాత అని చెప్పాల్సి ఉంటుంది. M.S.Viswanathan, a transitional figure in South Indian Film Music. మన దేశ సినిమాలో విశ్వనాదన్ సంగీతం ఎంతో విశిష్టమైంది. సంగీతం పరంగా ఆయన ‘విశిష్ఠ విశ్వనాదన్’.
‘Elaborate aesthetic embellishment’ – ఈ మాటను పాశ్చాత్య సంగీతంలో విశిష్టతను చెప్పాల్సి వచ్చినప్పుడు చెబుతూంటారు. మన దేశ సినిమాలో ఎమ్. ఎస్. విశ్వనాదన్ సంగీతం ‘an elaborate aesthetic embellishment’.