విస్మృత యానం

0
6

[dropcap]జ[/dropcap]ననం –

పువ్వులా పరిమళించడం

నవ్వులా పరవశించడం

వాగులా దాహార్తిని తీర్చడం

తీగలా ఆత్మీయంగా అల్లుకోవడం!

మరణం –

నిర్నిద్రంగా ఉన్న కోర్కెలు

శాశ్వతంగా కనుమరుగయ్యే సమయం!

బాంధవ్యాల బంధనాల నుంచి

విముక్తి లభించే సందర్భం!

మనిషి ఇహంలో –

స్మృతి గానో, విస్మృతి గానో మిగలడం!

జననం –

జీవనకాల గమనం!

మరణం –

జీవితానంతర మననం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here