విశ్వవిజేత సముద్రగుప్త – పుస్తక పరిచయం

    0
    7

    [dropcap style=”circle”]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత్రి పాలంకి సత్య రచించి, ప్రచురించిన నవల “విశ్వవిజేత సముద్రగుప్త”. ఈ నవల తొలుత జాగృతి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురిచితమైంది.

    “కళాశాలలో చదువుకున్నది గణితశాస్త్రమయినప్పటికీ, మా నాన్నగారు అలంరాజు సూర్యనారాయణమూర్తిగారు నాచేత భారతదేశ చరిత్రనూ, సంసృతినీ తెలిపే అనేక గ్రంథాలను చదివించారు. శ్రీ కోట వెంకటాచలంగారి పుస్తకాల ద్వారా అలెక్సాండరు దండయాత్రలోని సత్యాన్ని తెలుసుకోగలిగాను. గ్రీకులు వాడిన సాంద్రకోటస్’ అన్నపదం మౌర్యచంద్రగుప్తుని గురించి కాదన్న విషయాన్ని పాఠకులతో పంచుకుందుకు చేసిన ప్రయత్నమే ఈ నవల” అని రచయిత్రి తన ముందుమాటలో తెలిపారు.

    నవల లోని ఓ యుద్ధఘట్టంలోంచి కొన్ని వాక్యాలు:

    “పురుషోత్తముడు విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించాడు. మరుక్షణం అలెక్సాండరు పంచభుతాలలో కలిసిపోయేవాడే. కానీ ఆ క్షణాన పాంచాల పతికి తాను పారశీక మహిళ రుక్సానాకు ప్రతి ప్రాణభిక్ష పెట్టిన సంగతి గుర్తుకొచ్చింది. ఆ అరక్షణమే తనకు కలసివచ్చిందనుకున్న అలెక్సాండరు పురుషోత్తమునిపై బాణం సంధించి విడిచాడు. ప్రాణం తీయకుండా అలెక్సాండరుని బంధించవచ్చునన్న ఊహతో పాంచాల రాజు బాణాన్ని శత్రువు యొక్క గుర్రంపై విడిచాడు.

    శత్రువు విడిచిన బాణం తమ ప్రభువు గుండెలకే ఎక్కు పెట్టుబడిందని గ్రహించిన మావటీలూ, అంగరక్షకులూ హాహాకారాలు చేశారు. కానీ అంతలోనే అలెక్సాండరు బాణాన్ని మరో బాణం అడ్డుకుని ముక్కలు చేసింది. వెంటనే ఇంకొక బాణం అలెక్సాండరు గుర్రానికి తగిలింది. ఈలోగానే పురుషోత్తముడు విడిచిన బాణం తగిలి అల్లల్లాడుతున్న గుర్రం రెండో బాణం తగిలేసరికి కూలిపోయింది. అశ్వం పైనుంచి అలెక్సాండరు నేలపై పడిపోయాడు. సముద్రగుప్తుడు ఆ దిక్కున శరపరంపర కురిపించడం ఆపలేదు. సేన అలెక్సాండరును చుట్టు ముట్టి, తమ ప్రాణాలను ఒడ్డి, రాజును కాపాడుకుంది.

    సముద్రగుప్త, పురుషోత్తములు సేనా సమేతులై శత్రువులను చీల్చి చెండాడారు. గ్రీకు సైనికులు అలెక్సాండరును జాగ్రతగా తమ స్కంధావారానికి చేర్చేసరికి సాయంకాలమైంది. ధర్మయుద్ధమే అలవాటుగా కల భరతభూమివాసులు రణం నిలుపుతున్నామని సూచిస్తూ శంఖధ్వని వినిపించారు.”

    ***

    151 పేజీల ఈ నవల వెల రూ.100/-. ప్రతులు సాహిత్యనికేటన్, 3-4-852, కేశవనిలయం, బర్కత్‌పురా, హైదరాబాద్ 500027 వద్ద, సాహిత్యనికేతన్, గవర్నర్‌పేట, ఏలూరు రోడ్, విజయవాడ 520002 వారి వద్ద లభిస్తాయి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here