[dropcap]ఒ[/dropcap]క్క రక్తమే… కానీ
ఇద్దరిలో రెండు రకాలు బతికింది.
నాలుగు చేతులకు పుట్టిన
ఒక్క అడ్డుగోడతో
కంఠం నిండా పగను కూర్చుకొని
దూరంగా విసురుకొంది.
కాలం
చివరి అంచుపు ప్రయాణంలో
గుండె గూటిలొ ఎంత తడిమినా
చిల్లిగవ్వవంత ప్రేమ లేక
కటిక పేదరికంతో
కాటికి పయనం.
ఒక్క కన్నీటి బొట్టును కూడా
పొందలేని జీవితాలు
వృథాగా కంటి ముందే జారిపోయాయి.
మనసు బంధం తెగిపోయినది.
ఒకే తల్లి నేసిన రక్తసంభంధం
ఎటో వెళ్ళిపోయినది.
ఒకే రక్తమే… కానీ
ఇద్దరిలో రెండు రకాలుగా
విడిపోయింది.