యాత్రా దీపిక చిత్తూరు జిల్లా- 34 తంగాల్, 35 గిరింపేట

0
8

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని తంగాల్ లోని మౌన గురు స్వామి ఆశ్రమం గురించి, చిత్తూరు జిల్లా గిరింపేట లోని దుర్గాంబ ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

34. మౌన గురు స్వామి ఆశ్రమం, తంగాల్, తమిళనాడు

[dropcap]వే[/dropcap]ల్కూరు నుంచి అక్కడికి దగ్గరలోనే వున్న తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని తంగాల్ అనే ఊళ్ళో వున్న మౌనస్వామి ఆశ్రమానికి వెళ్ళాము. ఇది చిత్తూరు నుంచి 19 కి.మీ. ల దూరంలో వుంది. మాకు దీని గురించి ఏమీ తెలియదు. పెద్ద ఆశ్రమం. చాలా శుభ్రంగా, ప్రశాంతంగా, ధ్యానం చేసుకునేవారికి చాలా సౌకర్యంగా వుంది.

ఈ ఆశ్రమంలో శ్రీ మౌన గురు స్వామి జీవ సమాధి, మరియు సద్గురు సుందరమ్ స్వామీజీ మహా సమాధి వున్నాయి. ఇక్కడ ఈ స్వాములిద్దరినీ అందరూ ఏ బేధాలు పాటించకుండా సేవిస్తారు. ఇందులో ధ్యాన కేంద్రం వుంది. అంతే కాదు. వెంకటేశ్వరస్వామి పెద్ద విగ్రహం 9 అడుగుల ఎత్తయినది పంచ లోహాలతో చేసింది.. అత్యంత ఆకర్షణీయంగా వున్నది.

ఎక్కువ వివరాలు తెలియలేదు. పుస్తకాలు వున్నాయి గానీ తమిళంలో. అక్కడివారు మాట్లాడుతున్నారు గానీ తమిళంలో. ఇంతకన్నా వివరాలు తెలియలేదు. ఫోటోలు తియ్యనియ్యలేదు.

11-30కి అక్కడనుండి బయల్దేరి గిరింపేట వచ్చాము.

35. దుర్గాంబ ఆలయం, గిరింపేట

రంగుల హంగులతో మెరిసిపోతున్న దుర్గాంబ ఆలయం మూసి వున్నది. అమ్మవారిని చూడలేకపోయాము. బయటనుంచే ఫోటోలు.

స్ధల పురాణం:

ఈ ఆలయం ముందు చిన్నగా వుండి 1990 మొదట్లో విశాలంగా నిర్మించారు. ఈ అమ్మవారు ఎవరు చెక్కిన విగ్రహం కాదంటారు. ఈ విగ్రహం ఎవరు ఎప్పుడు చేశారో కూడా ఎవరికీ తెలియదు. అమ్మవారి విగ్రహం ఇక్కడకు రావటానికి కూడా ఒక కథ చెప్తారు. దాదాపు మూడు శతాబ్దముల క్రితం, అనగా 1700 సంవత్సరంలో గొడుగుమూరు నివాసస్తులు నలుగురు ఒక రాత్రి అడవిలో రెడ్డిగుంట ప్రాంతం వైపు వేటకు వెళ్ళటం జరిగింది. వారు అలసిపోయి వెన్నెల కాంతిలో కాలువ ఇసుకలో పడుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పక్కనే వున్న కాలువలో నీరు మాయమై అమ్మవారి విగ్రహం కనబడింది. ఆ విగ్రహాన్ని నలుగురు ఎత్తలేక పోయారు. బరువుగా వుండటంతో జోలెలో పెట్టి ఒక కొయ్య సహాయంతో నలుగురు భుజాలమీది మోసుకొచ్చారు. గొడుగుమూరు గ్రామంలోకి వెళ్ళినచో ఏమి సంభవిస్తుందోనని భయపడి గిరింపేటకు దక్షిణాన వంద గజాల దూరంలో ట్రంక్ రోడ్డుకి తూర్పున పల్లంలో విగ్రహాన్ని పెట్టి గ్రామ పెద్దలకు విషయాన్ని చెప్పారు.

గొడుగుమూరు, గిరింపేట పెద్దలూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి, మూల స్ధానంలో రోడ్డుకి దిగువ ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి దుర్గమ్మను అక్కడ స్ధాపించారు. అప్పటినుంచి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు బాగా పడటం, పంటలు బాగా పండటంతో ఆ తల్లి మీద విశ్వాసంతో చుట్టుపక్కల గ్రామాలనుంచి కూడా ప్రజలు ఈ తల్లికి పొంగళ్ళు పెట్టటం, పూజలు చెయ్యటం మొదలుపెట్టారు.

ఈ ఆలయానికి దాదాపు ఎదురుగానే శ్రీ శివగామి సుందరి సమేత చిదంబరేశ్వరస్వామి దేవస్ధానం వుంది. అది కూడా మూసే వున్నది మధ్యాహ్నం అవటంవల్ల.

వచ్చేవారం మరి కొన్ని విశేషాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here