[box type=’note’ fontsize=’16’] “ఈ స్నేహం ఇలాగే ఉండిపోవాలి కలకాలం” అంటున్నారు సంజూ హనీ “నీ స్నేహం” కవితలో. [/box]
[dropcap]స్నే[/dropcap]హమనే పూ తోటలో విరిసిన పువ్వులం మనం
ముళ్ళలో గులాబీలా
ఆకులో దవనంలా
పరిమళాలు వెదజల్లుతూ వికసించాలి మనం
తోటలోని పూలెన్ని ఉన్నా ఈ పరిమళాలతోనే
తోటంతా సుగంధ భరితమై నిండిపోవాలి
ఈ స్నేహం ఇలాగే ఉండిపోవాలి కలకాలం
తోటలోని వనమాలి తోటను తీసే వరకూ
సాగాలి మన స్నేహం.