భూమి నుంచి ప్లూటో దాకా… -6

    1
    7

    [box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

    అధ్యాయం 14: చంద్రుడు

    [dropcap style=”circle”]మ[/dropcap]మ్మల్ని దిగువకు తీసుకెళుతున్న లిఫ్ట్‌లో అంతా చీకటిమయం, విపరీతమైన చల్లదనం. షాక్లెటన్ బిలం అంతర్భాగంలో నిర్మించబడిన అమృత కాలనీకి మా అవరోహణం.

    డిమిట్రి కిసుక్కున నవ్వింది.

    “టైటాన్‌లో మా ఊర్లో ఉన్నట్టే ఉంది! మా ఇల్లు చేరాలంటే భూమి అడుగున మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. మా జీవితం ఎల్లప్పుడూ నేల స్థాయికి దిగువన ఉంటుంది.”

    నాకు తెలుసు. టైటాన్ భూగర్భంలో జలాలు ఉన్నాయి. పైగా అక్కడి ఉష్ణోగ్రతలు భూమిపై ఉండే ఉష్ణోగ్రతలానే ఉంటాయి. అక్కడివాళ్ళు కూడా నేల క్రింద భారీ కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు.

    మేం బిలం అడుగుకి చేరాం. అది విశాలమైన ప్రదేశం. బిలం గోడల పక్కగా చంద్రశిలలతో చదరపు ఆకారంలో గృహాలు, నివాసాలు కనబడ్డాయి. పొడవాటి వరుసలలో నిర్మించిన కట్టడాలు, రహదారులు ఇరువైపులా ఉన్నాయి.

    కాసేపట్లో మాకు కేటాయించిన బసకి చేరుకున్నాం. ఆ హాస్టల్ భవనం కొన్ని తెలియని మిశ్రమాలు మరియు గాజుతో నిర్మించబడింది. మెరుస్తూ ఉన్న ఒక సైన్ బోర్డుపై ఆంగ్లంలోనూ, విశ్వవ్యాప్త డిజిటల్ భాషలోనూ ఇలా రాసి ఉంది:

    “చంద్రగ్రహ ప్రభుత్వ అతిథిగృహాలు”

    భూగర్భ నగరాలు, నివాసాలు అమృతా కాలనీ యొక్క విశిష్టతలు.

    మేము నిర్మాణం లోపలికి వెళ్లాం. ఇన్-బిల్ట్ కంట్రోల్స్, తెరలతో మెరుస్తున్న భారీ డెస్క్ వెనుక కూర్చున్న రిసెప్షనిస్ట్‌ని కలిశాం.

    డి.ఎన్.ఎ పరీక్ష కోసం మా రక్తం నమూనాలు తీసుకుని, మా గుర్తింపు కోసం రెటీనా స్కానింగ్ చేశాక, మాకు మా గదుల ఎలక్ట్రానిక్ తాళంచెవులను ఇవ్వబడ్డాయి.

    ఆపై చంద్రునిపై మా పని ప్రారంభమైంది.

    హాస్టల్లోని నా గదిలోకి వెళ్ళగానే, వెంటనే స్నానం చేసి మామూలు బట్టలు ధరించి, ప్రకృతితో కలిసి లంచ్ కోసం మొదటి అంతస్తులోని డైనింగ్ హాల్‌వైపు నడిచాను.

    డిమిట్రి, ఏనిమాయిడ్, చాంద్, వాన్ కు జాక్ అప్పటికే టేబుల్ వద్ద ఉన్నారు.

    “తిని, ఒక గంట విశ్రాంతి తీసుకొని, ‘మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎగైనెస్ట్ పారానార్మల్ ఫోర్సెస్‌’ ఆఫీసుకు వెళ్దాం.” వాళ్ళతో అన్నాను.

    భోజనశాలలో నిశ్శబ్దం వ్యాపించింది. ఆ వాతావరణం చల్లగా ఉంది. డైనింగ్ రూమ్ గోడలపై చంద్రుడిని అన్వేషించే క్రమంలో మానవులు చేసిన కృషిని చాటే చిత్రాలు – భారీ పరిమాణంలోని క్రేన్లు, యంత్రాలతో భారీ నిర్మాణాలు నిర్మిస్తున్న తొలి అన్వేషకులు వంటి చిత్రాలలు అలంకరించబడ్డాయి. ఇంకా చంద్రునిపై ఇతర కాలనీలు కూడా ఉన్నాయి. భూమిపై అమెరికా ప్రభ వెలుగుతున్న కాలంలో ఆ దేశ శాస్త్రవేత్తలు చంద్రుడిపై షాక్లెటన్ బిలంలోని అమృతా కాలనీని ఏర్పరిచారు, వీళ్ళవే మరికొన్ని కాలనీలు కూడా ఉన్నాయి.

    రష్యన్లు, చైనీయులు చంద్రుడి ఉపరితలంపై కాలనీలను నిర్మించుకుంటే, అమెరికన్లు భూగర్భంలో నిర్మించారు. ఇతర దేశాలు ఉపరితల కాలనీలు చంద్రుని యొక్క భారీ లావా ట్యూబులలో కాలనీలు ఏర్పాటు చేసుకున్నాయి. చంద్ర ఉపరితల రైలు మార్గం ప్రధాన కాలనీలను కలుపుతుంది. చంద్రునిపై వివిధ కాలనీల మధ్య శాంతి నెలకొని ఉంది. ఈ కాలనీలవాళ్ళు పర్యాటక రంగం, ఖనిజ అన్వేషణ మరియు అంతర్ గ్రహాల ప్రయాణంలో వృద్ధి చెందారు.

    అటువంటి భారీ గ్రహం మీద సమూరానీ, అతని దుష్ట తాంత్రిక బృందాలను కనుగొనడం ఎలా?

    ఏదైనా నిఘా వ్యవస్థ ఉందా? అత్యంత్త శక్తివంతమైన ఇంటర్‌గెలాక్టిక్ పోలీస్ అని పిలవబడే పోలీసులు ఏమైనా విచారణ చేశారా?

    దిగుమతి చేసుకున్న కోడి, గొర్రె మాంసంతోనూ; కూరగాయలు, స్ఫగెట్టి, పాల పదార్థాలతోనూ భోం చేస్తూ చెప్పాను.

    “సమూరాని పట్టుకునే విషయంలో నా ఆలోచనలను వారికి చెప్పాను. తన శక్తులను తిరిగి పొందడానికి సమూరా ప్రయత్నిస్తున్నందున, చంద్రుడిపై దాచి ఉంచిన అద్భుత వస్తువు కోసం ఖచ్చితంగా వెతుకుతాడని నేను భావిస్తున్నాను. ఆ వస్తువు విశ్వంలో ఎవరితోనైనా భావప్రసారం చేయగల అద్దం. దాన్ని ఎక్కడ దాచారో, నిజంగా అలాంటి వస్తువంటూ ఒకటుందో లేదో మనకు తెలియదు! ఉన్నట్టయితే మాత్రం, మనం ఇప్పటికే భూమిపై వెండి కొవ్వొత్తిని కనుగొన్నట్లు, దాన్నీ కనుగొనాలి”

    డిమిట్రి మళ్ళీ కిసుక్కున నవ్వింది. ఆమె నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది.

    “ఎన్నుకోబడినవాడి కదా, నువ్వు దాన్ని కనుగొనగలవు! స్వచ్ఛమైన, అమాయక, నిస్వార్థ విజర్డ్‌కి మాత్రమే అది కనబడుతుంది. అని రాసి ఉంది కదా… హహ్హహ్హా… “

    ప్రకృతి నాకేసి ప్రశ్నార్థకంగా చూసింది.

    ఆ చూపులో ‘మీ మధ్య ఏం ఉంది’ అనే ఆరా ఉంది.

    “హనీ! డిమిట్రీ అన్నదాంట్లో వాస్తవం ఉంది. ఆ అద్భుత వస్తువుని కనుగొనడానికి గతంలో వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారు. కాబట్టి వాళ్ళు చంద్రుని మీద ఓ స్వచ్ఛమైన నిస్వార్థమైన అమాయక పి.సి.యు.ఎఫ్‌ని అపహరించి, దానిని గుర్తించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ జరిగిన అన్ని కిడ్నాపులనీ పరిశీలించమని చంద్ర ప్రభుత్వంలో మంత్రిని అభ్యర్థించడం మంచిదేమో?” అంది ప్రకృతి.

    “అవును. మీరు సరైన మార్గంలోనే ఉన్నారు. పారానార్మల్ డిఫెన్స్ మంత్రి వద్దకి మనం పూర్తి కార్యాచరణ ప్రణాళికతో దర్యాప్తు కోసం వెళదాము.”

    “1. గత నెల రోజులలో జరిగిన అన్ని కిడ్నాప్‌లను, విశ్వశక్తి ఉపయోగించడం వల్ల సంభవించిన ఎలక్ట్రానిక్ టర్బులెన్స్‌ను సమీక్షించటం ద్వారా శోధించండి.

    1. ఇక్కడ డిజిటల్ నంబర్లచే పర్యవేక్షించబడే వ్యక్తుల లూనార్ పొజిషనింగ్ సిస్టమ్‌ను అధ్యయనం చేయడం వల్ల ఆధునిక శాస్త్రం వివరించలేని ఏ రహస్యమైన విషయమైనా వారికి తెలుస్తుంది.
    2. ఆల్ఫాసెంటారీ వ్యవస్థని అధ్యయనం చేసి, అక్కడి రహస్య తాంత్రిక సమూహం యొక్క ప్రధాన కార్యాలయం ఏదైనా ఇక్కడుందా అని నిర్ధారించుకోవాలి. అక్కడ కెప్లెర్ గ్రహ వ్యవస్థలు ఎ నుంచి ఎల్ వరకూ ఉన్నాయి. స్పేస్ ప్లాట్‌ఫాంపై అనుమానితులు తచ్చాడిన ఘటనలో వాళ్ళు ఆల్ఫా వ్యవస్థ నుంచి వచ్చినట్టు సమాచారం ఉంది.”

    ఏనిమాయిడ్ ఎప్పటిలానే గుర్రుమన్నాడు. అతను గనీమీడియన్ మాండలికంలో కొన్ని పదాల మినహా తప్ప ఎక్కువగా మాట్లాడలేడు, అదీ చాలా అరుదుగా!

    వాన్ కు జాక్ చుట్టూ చూశాడు. పండ్లు, పాలతో చేసిన డెజర్ట్‌ను త్రాగుతూ, తన పెదవుల మీదున్న నురగని ఆస్వాదిస్తున్నాడు.

    “ఆల్ఫా సెంటారీ వ్యవస్థలో అత్యంత భారీ విజర్డ్ సామ్రాజ్యాలు ఉన్నాయి. ఈ మాంత్రికులు మన సౌర వ్యవస్థలో ప్రవేశించడానికి చాలకాలం ముందే, ఆల్ఫా వ్యవస్థ మొత్తం గ్రహాలపై విజర్డ్ సామ్రాజ్యాలను స్థాపించిన మర్మమైన వ్యక్తులున్నారు. అన్ని గ్రహాలపైనా కాకపోయినా కనీసం మూడు గ్రహాలపై మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. సమూరా ఆల్ఫా వ్యవస్థ నుండి శరణార్థిగా వచ్చి, ఎక్కడికో తప్పించుకుపోయి, పాలపుంతలోని 100 గ్రహాలను స్వాధీనం చేసుకున్నాడని,  మళ్లీ వాటిని వివిధ యుద్ధాలలో ఒకటొకటిగా కోల్పోయాడని రెడ్ ప్లెయిన్స్‌లో విశ్వసిస్తారు.  అతని చివరి రాజ్యం అరుణ భూములలో ఉంది. అతను తన మాంత్రిక సామ్రాజ్యం ఉత్తానపతనాలను చూశాడు. బహుశా ఆల్ఫా సెంటారీ వ్యవస్థలోని కెప్లర్ బి లేదా సి ప్లానెట్‌లలో నివాసముండే అతని మాజీ యజమానులు అతన్ని రిమోట్‌గా నియంత్రిస్తారు. ఇప్పుడు అమృత ఔషధం తాగాకా అమరత్వం పొంది తను కోల్పోయిన గ్రహాలపై నియంత్రణ తిరిగి పొందాలని కోరుకుంటున్నాడు.”

    నేను చెప్పాను, “నాకిప్పుడు అర్థమైంది. నేను అతని ప్రణాళికను నాశనం చేశాను. కానీ ప్రతీ అద్భుత వస్తువుకీ ఒక షరతు ఉంటుంది. అతను అమృత ఔషధం తాగి అమరత్వం పొందాడు, కానీ శక్తులు కోల్పోయాడు. వెండి కొవ్వొత్తిని సాధించాడు, కానీ అది ఎవరినీ చంపలేదు లేదా చిత్రవధ చేయలేదు. అతను తన ఎనిమిది మంత్రులను, కుమార్తె సయోనిని భూమిపైన స్పేస్ ఎలివేటర్ వద్ద కోల్పోయాడు. అద్దం ఏమి చేయగలదో దేవుడికే తెలుసు. అతని చేతుల్లో ఉన్నా కూడా… ఇది ఖచ్చితంగా విశ్వానికి చెడు చేయదు…”

    చాన్ తన చేతులను తుడుచుకుంటూ అన్నాడు “అయితే సమూరాని ఆపాలి. నాశనం చేయాలి. ఇప్పుడు అతను – పూర్తిగా అనూహ్యమైన క్రూరత్వం చూపే దుర్మార్గులు – సుదూర ఆల్ఫా వ్యవస్థ మాంత్రికుల సహాయం పొందే ప్రమాదం ఉంది. వారు జీవితం సృష్టించగలరు; ఒంటరిగా పోరాడగలరు, సైన్స్ యొక్క అన్ని శక్తులను ఉపయోగించగలరు. కానీ అవి చాలా తక్కువ. వారు జన్యు-పరివర్తనం చేయబడ్డ అసాధారణ శక్తులు గల మానవులలా ఉన్నారు. వాళ్ళతో పాటు సమూరానీ నాశనం చేయాలి, లేదంటే ఆ చీకటి మహమ్మారి మన అంగారకుడిపై దాడి చేయగలదు.”

    “భూమిపై, మార్స్ మీద, టైటాన్‍పై, గనీమీడ్‌పై కూడా…” అన్నాను. “కానీ ఇప్పటికీ నన్ను ఇబ్బంది పెడుతున్న సంగతేంటంటే – కొందరు ముసలి చీకటి తాంత్రికులు గ్రహాలను ఎలా జయించగలరన్నదే!”

    చాంద్ మాట్లాడుతూ “మార్స్ అరుణ భూములలో జరిగినట్టే, వారు మానవులను ఓడించిన తరువాత, తాంత్రికుల సామ్రాజ్యాలను స్థాపిస్తారు, విశ్వంలోని అన్ని తాంత్రిక సమూహాలను అక్కడ నివసించడానికి ఆహ్వానిస్తారు. తమ తాంత్రిక కార్యకలాపాలను సాధన చేస్తారు. వాళ్ళతో ఎలా పోరాడాలన్నది మనుషులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు” అన్నాడు.

    “మనలాంటి గొప్ప పిసియుఎఫ్‌లు తప్ప… హనీ లాంటి ఉత్తములు తప్ప…” అని డిమిట్రి హాస్యమాడింది. ఆమె నవ్వింది. “ఎంత పరిహాసంగా అనిపించినా, దాన్ని అర్థం చేసుకోడం సులభం. చీకటి తాంత్రికులు – కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ తనిఖీలను దాటుకుని అన్ని గ్రహాలలో ప్రయాణించడం, అధికారాలు పొందడం, ప్రభుత్వాలలో కీలక స్థానాలలో తమ ఏజెంట్లను కలిగి ఉండడం… 21వ శతాబ్దంలోని భారీ గెరిల్లా లేదా అండర్‌గ్రౌండ్ వార్ లాగా… “

    “అవును!” అన్నాను నేను.

    నాకు అర్థమైంది. మానవుల శాంతి కోసం, గ్రహాల కాలనీల రక్షణ కోసం మేము వాళ్ళని కనిపెట్టి, పోరాడి నాశనం చేయాలి. “… ఇంకా నా తల్లిదండ్రుల వంటి అమాయకులను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి!” అని మనసులో అనుకున్నాను.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here