‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-7

3
11

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ జావేద్ అఖ్తర్ కవితల సంపుటి ‘ఇన్ అదర్ వర్డ్స్’ లోని కవితలను సంచిక పాఠకులకు తెలుగులో అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

మరో సమయానుకూల ఆలోచన   

[dropcap]పి[/dropcap]ల్లలు
పులుల, ఏనుగుల రూపాల్ని
మేఘాల ఆకారాల్లో చూసినట్టు
ఓ ఆలోచన తళుక్కుమంటుంది

చాలా మంది కాలంలో
జ్ఞానాన్నీ, దార్శనికతని గ్రహిస్తారు

చాలామందికి ఆ విశ్వాసపు ఛాయల్లో
తమ వెతుకులాటకు ముగింపు కూడా లభిస్తుంది

మనం కాలం అనుకుంటున్నది
నిజానికి ‘దైవం’

కానీ
సత్యాన్ని వెతికే వారు
కాలమంటే ఏమిటి అన్న ప్రశ్నను
తమ హృదయపు లోతుల్లోనూ
తమ ఆలోచనల్లోనూ నింపుకుని
సంచరిస్తూనే వుంటారు

మూలం: జావేద్ అఖ్తర్
తెలుగు: వారాల ఆనంద్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here